Download App

‘హల్లల్లల్లో’తో మాస్ మేనియా.. ‘పెద్ది’ నుంచి మరో బ్లాక్‌బస్టర్ సాంగ్

మే 25, 2026 By Srinivas
మెగా పవర్ స్టార్ Ram Charan నటిస్తున్న మోస్ట్ అవైటెడ్ రూరల్ యాక్షన్ డ్రామా ‘పెద్ది’ ఇప్పటికే దేశవ్యాప్తంగా భారీ అంచనాలను సృష్టించింది. ఇటీవల విడుదలైన పవర్‌ఫుల్ ట్రైలర్ సినిమాపై హైప్‌ను మరింత పెంచగా, ఇప్పుడు మూడో సింగిల్ ‘హల్లల్లల్లో’ ప్రేక్షకులను ఊపేస్తోంది. Buchi Babu Sana దర్శకత్వంలో...
‘హల్లల్లల్లో’తో మాస్ మేనియా.. ‘పెద్ది’ నుంచి మరో బ్లాక్‌బస్టర్ సాంగ్

మెగా పవర్ స్టార్ Ram Charan నటిస్తున్న మోస్ట్ అవైటెడ్ రూరల్ యాక్షన్ డ్రామా ‘పెద్ది’ ఇప్పటికే దేశవ్యాప్తంగా భారీ అంచనాలను సృష్టించింది. ఇటీవల విడుదలైన పవర్‌ఫుల్ ట్రైలర్ సినిమాపై హైప్‌ను మరింత పెంచగా, ఇప్పుడు మూడో సింగిల్ ‘హల్లల్లల్లో’ ప్రేక్షకులను ఊపేస్తోంది. Buchi Babu Sana దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని Vriddhi Cinemas బ్యానర్‌పై నిర్మాత Venkata Satish Kilaru నిర్మిస్తున్నారు. Mythri Movie Makers, Sukumar Writings సమర్పిస్తున్నాయి.

సంగీత దిగ్గజం A. R. Rahman స్వరపరిచిన ఈ పాట ఇప్పటికే సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. భోపాల్‌లో నిర్వహించిన భారీ ‘పెద్ది కీ ఆవాజ్’ ఈవెంట్‌లో ఈ పాటను గ్రాండ్‌గా లాంచ్ చేయగా, అక్కడి నుంచే సాంగ్‌కు బ్లాక్‌బస్టర్ రెస్పాన్స్ వచ్చింది. అనంతరం డిజిటల్‌గా విడుదలైన తర్వాత కూడా అదే జోరు కొనసాగుతోంది.

భారీ డ్రమ్స్, పవర్‌ఫుల్ బీట్స్, జానపద శైలిలో సాగే రిథమ్‌తో రెహమాన్ ఈ పాటను పూర్తి స్థాయి మాస్ యాంథమ్‌గా తీర్చిదిద్దారు. మొదటి బీట్ నుంచే ఎనర్జీని పెంచే ఈ ట్యూన్ చివరి వరకు అదే హైను కొనసాగిస్తుంది. Anantha Sriram రాసిన సాహిత్యం పాటకు మరింత మాస్ అప్పీల్‌ను తీసుకొచ్చింది. జానపద టచ్‌తో కూడిన పదాలు పాటకు ప్రత్యేకమైన నేటివిటీని అందించాయి.

సింగర్ Rakshita Suresh తన పవర్‌ఫుల్ వాయిస్‌తో పాటను మరో స్థాయికి తీసుకెళ్లారు. ఆమె వాయిస్‌లోని ఎనర్జీ, రెహమాన్ మ్యూజిక్‌తో కలిసి థియేటర్లలో భారీ హంగామా చేయడం ఖాయంగా కనిపిస్తోంది.

‘హల్లల్లల్లో’తో మాస్ మేనియా.. ‘పెద్ది’ నుంచి మరో బ్లాక్‌బస్టర్ సాంగ్

విజువల్‌గా ‘హల్లల్లల్లో’ ఒక గ్రాండ్ స్పెక్టకిల్‌లా నిలిచింది. భారీ సెట్స్‌లో చిత్రీకరించిన ఈ పాటలో రామ్ చరణ్, Shruti Haasan, Janhvi Kapoor ముగ్గురూ అదిరిపోయే స్క్రీన్ ప్రెజెన్స్‌తో ఆకట్టుకున్నారు. రామ్ చరణ్ తన స్టైలిష్ లుక్, ఎనర్జిటిక్ డ్యాన్స్ మూవ్స్‌తో అభిమానులను మెస్మరైజ్ చేయగా, శృతి హాసన్ తన గ్లామర్, గ్రేస్‌తో ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. జాన్వీ కపూర్ కూడా తన ఎలిగెన్స్, ఎనర్జీతో పాటకు మరింత కలర్ యాడ్ చేశారు.

మాస్ కథల్లో స్పెషల్ సాంగ్స్ ప్రాధాన్యతను బాగా అర్థం చేసుకున్న దర్శకుడు బుచ్చిబాబు సానా, ఈ పాటను కూడా భారీ స్థాయిలో డిజైన్ చేశారు. ప్రతి ఫ్రేమ్‌లో కనిపించే సెట్స్, కాస్ట్యూమ్స్, కలర్ ప్యాలెట్ సినిమాకి ఉన్న గ్రాండియర్‌ను ప్రతిబింబిస్తున్నాయి.

ఈ ఏడాది అత్యంత క్రేజీ మాస్ సాంగ్స్‌లో ‘హల్లల్లల్లో’ ఒకటిగా నిలవడం ఖాయమనే టాక్ వినిపిస్తోంది. జూన్ 4న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానున్న ‘పెద్ది’పై ఈ పాట మరింత హైప్‌ను పెంచింది. థియేటర్లలో ఈ పాట వస్తే విజిల్స్, క్లాప్స్, సెలబ్రేషన్స్‌తో ప్రేక్షకులు ఊగిపోవడం ఖాయమనేలా ‘హల్లల్లల్లో’ అలరిస్తోంది.

Srinivas

Srinivas is an entertainment journalist covering Telugu cinema, celebrity updates, movie reviews, and OTT news for over 9 years in IndiaGlitz.

View all posts

మరిన్ని వార్తలు

Discover more from IndiaGlitz Telugu

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading