Download App

అవి సృష్టించే వాళ్లకి గుండె ఉందా? కుటుంబం ఉందా…?: మీనా

సెప్టెంబర్ 15, 2025 • By Srinivas
2022లో ఊపిరితిత్తుల ఇన్ఫెక్షన్ కారణంగా భర్త విద్యాసాగర్ (48) కన్నుమూసిన తరువాత నటి మీనా జీవితంలోనే అతిపెద్ద దెబ్బ తగిలింది. భర్తను కోల్పోయిన ఆ బాధతో తన టీనేజ్ కూతురికి తల్లి, తండ్రి తానే అయ్యింది. అయితే ఆ కష్టసమయంలో కూడా ఆమెను విడిచిపెట్టని బాధ — నిరాధార...
అవి సృష్టించే వాళ్లకి గుండె ఉందా? కుటుంబం ఉందా…?: మీనా

2022లో ఊపిరితిత్తుల ఇన్ఫెక్షన్ కారణంగా భర్త విద్యాసాగర్ (48) కన్నుమూసిన తరువాత నటి మీనా జీవితంలోనే అతిపెద్ద దెబ్బ తగిలింది. భర్తను కోల్పోయిన ఆ బాధతో తన టీనేజ్ కూతురికి తల్లి, తండ్రి తానే అయ్యింది. అయితే ఆ కష్టసమయంలో కూడా ఆమెను విడిచిపెట్టని బాధ — నిరాధార రూమర్స్.

భర్త మరణించిన కొన్ని నెలలకే, మీనా రెండో పెళ్లి చేసుకుంటున్నారన్న పుకార్లు చక్కర్లు కొట్టాయి. ముఖ్యంగా ఓ విడాకులు తీసుకున్న తమిళ స్టార్ తో ఆమెకు పెళ్లి జరుగుతోందని వచ్చిన వార్తలు మీనాను బాగా కలిచివేశాయి.

ఇటీవల జగపతి బాబు హోస్ట్ చేస్తున్న ‘జయమ్ము నిశ్చయమ్ము రా’ కార్యక్రమంలో పాల్గొన్న మీనా, ఆ రూమర్స్ గురించి మాట్లాడుతూనే భావోద్వేగానికి లోనయ్యారు.

“నా భర్త మరణించి కొద్ది కాలమే అయ్యింది. ఇలాంటి సమయంలో నన్ను వేరే హీరోలతో కలిపి రాయడం ఎంత దారుణమో చెప్పలేను. ఈ రూమర్స్ సృష్టించే వాళ్లకి గుండె ఉందా? కుటుంబం ఉందా? అని అనిపించింది. విడాకులు తీసుకున్న ఏ స్టార్ ఉన్నా వెంటనే నన్ను అతనితో లింక్ చేయడం మా కుటుంబానికి చాలా బాధాకరమైన అనుభవం,” అంటూ కన్నీళ్లు పెట్టుకున్నారు.

మీనా మనసులోని ఈ వేదన బయటపెట్టిన తర్వాత, ఆమె అభిమానులు సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున స్పందిస్తున్నారు. “మీనా గారు చాలా బాధలు ఎదుర్కొన్నారు, ఇకపై ఆమె వ్యక్తిగత జీవితాన్ని గౌరవించాలి” అని వ్యాఖ్యానిస్తూ ఆమెకు అండగా నిలుస్తున్నారు.

Srinivas

Srinivas is an entertainment journalist covering Telugu cinema, celebrity updates, movie reviews, and OTT news for over 9 years in IndiaGlitz.

View all posts

Discover more from IndiaGlitz Telugu

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading