
బ్లాక్‌బస్టర్ డైరెక్టర్ అనిల్ రావిపూడి పుట్టినరోజు వేడుక మరింత ప్రత్యేకంగా మారింది. మెగాస్టార్ చిరంజీవి స్వయంగా శుభాకాంక్షలు తెలియజేయడమే కాకుండా, ఆయనకు అందమైన వాచ్‌ను గిఫ్ట్‌గా అందించి సర్ప్రైజ్ చేశారు. ఇద్దరూ కలిసి కేక్ కట్ చేస్తూ పుట్టినరోజును హర్షాతిరేకాలతో జరుపుకున్నారు. చిరంజీవి ఇచ్చిన ఈ హృదయపూర్వక శుభాకాంక్షలు మరియు ప్రత్యేక కానుక అనిల్ రావిపూడికి మరచిపోలేని మధుర క్షణాలుగా నిలిచాయి.
ప్రస్తుతం అనిల్ రావిపూడి దర్శకత్వంలో మెగాస్టార్ నటిస్తున్న మోస్ట్ అవైటెడ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ ‘మన శంకరవరప్రసాద్ గారు’ రూపొందుతోంది. నయనతార హీరోయిన్గా నటిస్తున్న ఈ చిత్రానికి ఇప్పటికే విడుదలైన టీజర్, సాంగ్స్‌కు అద్భుతమైన స్పందన లభించింది. ప్రత్యేకంగా ఫస్ట్ సింగిల్ ‘మీసాల పిల్ల’ రికార్డ్ బ్రేకింగ్ వ్యూస్‌తో దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. తెలుగు సినీ మ్యూజిక్కు కొత్త బెంచ్‌మార్క్ సెట్ చేసిన ఈ పాట ప్రతి వయసు ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది.

చిరంజీవి తన సిగ్నేచర్ చార్మ్, ఎమోషన్స్, ఎనర్జిటిక్ డ్యాన్స్ మువ్స్తో మరోసారి అభిమానుల హృదయాలను గెలుచుకున్నారు. సాంగ్‌కు వస్తున్న విపరీతమైన స్పందనతో సినిమాపై అంచనాలు మరింత పెరిగాయి.
సాహూ గారపాటి, సుష్మిత కొణిదెల సంయుక్తంగా “షైన్ స్క్రీన్స్” మరియు “గోల్డ్ బాక్స్ ఎంటర్టైన్మెంట్స్” బ్యానర్లపై భారీ స్థాయిలో నిర్మిస్తున్న ఈ చిత్రం 2026 సంక్రాంతికి గ్రాండ్‌గా విడుదల కానుంది.
