
ZEE5 నుంచి రాబోతున్న కొత్త తెలుగు ఒరిజినల్ వెబ్ సిరీస్ Memu Coplam ట్రైలర్ ఇప్పుడు సోషల్ మీడియాలో మంచి బజ్ క్రియేట్ చేస్తోంది. గ్రామీణ నేపథ్యంలో కామెడీ, మిస్టరీ, సస్పెన్స్‌లను కలిపి రూపొందించిన ఈ ట్రైలర్ మొదటి నుంచే ఒక డిఫరెంట్ వైబ్‌ను క్రియేట్ చేస్తుంది.
మహదేవపట్నం అనే ఊరిలో కథ ప్రారంభమవుతుంది. ఊరిలో కోడి పందేలు అంటే ప్రాణం పెట్టే జనాలు. అలాంటి సమయంలో గజపతిరాజు ఎంతో ప్రతిష్టాత్మకంగా భావించే పందెం కోడి “సలార్ రాజు” అకస్మాత్తుగా కనిపించకుండా పోవడం ఊరంతా కలవరపెడుతుంది. అయితే అసలు ట్విస్ట్ ఏంటంటే.. ఈ కోడి మిస్సింగ్ కేసును చేధించే బాధ్యత ఇద్దరు అమాయక పోలీసుల చేతికి వెళ్లడం.
Getup Srinu, Raviteja Nannimala చేసిన పోలీస్ పాత్రలు ట్రైలర్‌కు ప్రధాన హైలైట్‌గా నిలిచాయి. కేసును సీరియస్‌గా ఇన్వెస్టిగేట్ చేయాలనుకుంటూ చేసే గందరగోళం, వారి అమాయకత్వం నుంచి వచ్చే కామెడీ బాగా వర్కౌట్ అయ్యేలా కనిపిస్తోంది. ముఖ్యంగా “కోడిపుంజు కోసం ఇంత హడావిడి ఏంటి?” అనిపించే సమయంలోనే ట్రైలర్ మరో లెవెల్‌కు వెళ్లి అసలు మిస్టరీని చూపించడం ఆసక్తిని పెంచుతుంది.
Nagendra Babu గజపతిరాజు పాత్రలో చాలా నేచురల్‌గా కనిపించారు. గ్రామ పెద్దగా ఆయన ప్రెజెన్స్ ట్రైలర్‌కు బలం ఇచ్చింది. అలాగే ఊరిలో రాజకీయాలు, మూఢనమ్మకాలు, భయాలు, బ్లాక్ మ్యాజిక్ టచ్, రక్తపాతం హెచ్చరికలు.. ఇలా ఒక్కో ఎలిమెంట్‌ను మెల్లగా ట్రైలర్‌లో రివీల్ చేస్తూ వెళ్లడం బాగుంది.

విజువల్‌గా కూడా ట్రైలర్ చాలా రిచ్‌గా కనిపిస్తోంది. గోదావరి ప్రాంత ఫ్లేవర్, నైట్ విజువల్స్, గ్రామీణ టెక్స్చర్, కలర్ టోన్ సిరీస్‌కు ఒక ప్రత్యేకమైన మూడ్ తీసుకొచ్చాయి. బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ కూడా కామెడీతో పాటు మిస్టరీ ఫీల్‌ను బాగా ఎలివేట్ చేసింది.
ట్రైలర్ మొత్తంగా చూస్తే.. ఇది కేవలం కోడి మిస్సింగ్ కామెడీ కాదు. గ్రామ రాజకీయాలు, వ్యక్తిగత ఈగోలు, రహస్యాలు, విచిత్ర సంఘటనలతో నిండిన ఓ ఎంటర్‌టైనింగ్ రూరల్ మిస్టరీ డ్రామాగా కనిపిస్తోంది. కామెడీని ఫోర్స్ చేయకుండా నేచురల్‌గా తీసుకురావడం ట్రైలర్‌కు పెద్ద ప్లస్.
మొత్తానికి “మేము కాప్’లం” ట్రైలర్ నవ్వులు, సస్పెన్స్, గ్రామీణ గందరగోళం అన్నీ కలిపిన పూర్తి వినోదాన్ని ప్రామిస్ చేస్తోంది. మే 22న జీ5లో స్ట్రీమింగ్ కానున్న ఈ సిరీస్ ప్రేక్షకులను ఎంతవరకు ఆకట్టుకుంటుందో చూడాలి.
