కన్నప్ప’ చూసిన తర్వాత రజినీకాంత్ నన్ను హత్తుకున్నారు: విష్ణు మంచు
June 17, 2025 Published by Srinivas

తెలుగు సినిమా చరిత్రలో ఓ మైలురాయిగా నిలిచిన ‘పెద రాయుడు’ చిత్రానికి ఈరోజుతో ముప్పై ఏళ్లు పూర్తయ్యాయి. ఈ సందర్భంగా 1995 జూన్ 15న విడుదలైన ఈ విఖ్యాత సినిమాను గుర్తుచేసుకుంటూ, చిత్ర ప్రధాన హీరోలు సూపర్ స్టార్ రజినీకాంత్ మరియు డా. ఎం. మోహన్ బాబు చెన్నైలో ప్రత్యేకంగా కలుసుకున్నారు.

ఈ ప్రత్యేకమైన సందర్బంగా, రజినీకాంత్ విష్ణు మంచు ప్రధాన పాత్రలో నటించిన మైత్రిక పౌరాణిక చిత్రం ‘కన్నప్ప’ ను ప్రత్యేకంగా వీక్షించారు. సినిమా ముగిసిన తరువాత రజినీకాంత్, విష్ణును ఆప్యాయంగా హత్తుకున్నారు. ఈ విషయాన్ని విష్ణు మంచు తన సోషల్ మీడియా వేదికగా పంచుకుంటూ ఇలా పేర్కొన్నారు:
“22 ఏళ్లుగా ఎదురు చూసిన క్షణం ఇది. ‘కన్నప్ప’ చూసిన తర్వాత రజినీకాంత్ గారు నన్ను హత్తుకున్నారు, ఆయనకు సినిమా చాలా నచ్చింది అన్నారు. ఈ రోజు నాకు అపారమైన ఆనందం, గర్వం.”

మరోవైపు, డా. మోహన్ బాబు కూడా ఈ ఉత్కంఠభరిత సంధర్బాన్ని సంతోషంగా గుర్తు చేసుకుంటూ స్పందించారు:
“‘పెద రాయుడు’ విడుదలై 30 ఏళ్లు పూర్తయిన రోజునే నా ప్రియ మిత్రుడు రజినీకాంత్ గారు ‘కన్నప్ప’ చిత్రాన్ని తన కుటుంబంతో కలిసి చూశారు. ఆయన చూపిన ప్రేమ, మెచ్చిన మాటలు ఎప్పటికీ మర్చిపోలేను. థాంక్యూ మిత్రమా.”
కాగా, కన్నప్ప చిత్రం ఈ నెల 27న ప్రేక్షకుల ముందుకు రానుంది.
