
మొన్నటికి మొన్న ఫస్ట్ షాట్ తో రచ్చ చేసిన గ్లోబల్ స్టార్ రాంచరణ్ పెద్ది ఇప్పుడు భారీ సాంగ్ షూట్ కు సిద్ధమైంది. ఈ సాంగ్ షూట్ మైసూర్‌లో జరుపుకుంటోంది. ఈ పాట ప్రత్యేకత ఏంటంటే – 1000 మందికి పైగా డ్యాన్సర్లు పాల్గొనడం. ఈ గ్రాండ్ సాంగ్‌కి కొరియోగ్రఫీ చేస్తోంది టాలీవుడ్ టాప్ డాన్స్ మాస్టర్ జానీ మాస్టర్.
అదే కాకుండా ఈ మ్యాసివ్ సాంగ్‌కి ఆస్కార్ అవార్డు విన్నర్ ఏఆర్ రహ్మాన్ స్వరాలు సమకూరుస్తుండటంతో, ఇది ఒక విజువల్ & మ్యూజికల్ ఫీస్ట్ అవుతుందని మేకర్స్ నమ్మకంగా చెబుతున్నారు. రామ్ చరణ్ తన ట్రేడ్‌మార్క్ ఎనర్జీ, మాస్ స్టెప్స్‌తో ఈ పాటను హైలైట్‌గా నిలబెట్టడం ఖాయం.
బుచ్చిబాబు సాన దర్శకత్వం వహిస్తున్న ఈ ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్‌ను వృద్ధి సినిమాస్ బ్యానర్ పై వెంకట సతీష్ కిలారు భారీ స్థాయిలో నిర్మిస్తున్నారు. మైత్రీ మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్ ఈ సినిమాను ప్రెజెంట్ చేస్తున్నారు.
వినాయక చవితి వాతావరణంలో కూడా టీమ్ షూటింగ్‌లో నిబద్ధతతో పాల్గొనడం విశేషం. సినిమాలో జాన్వి కపూర్ హీరోయిన్‌గా, శివరాజ్‌కుమార్ కీలక పాత్రలో నటిస్తున్నారు. జగపతి బాబు, దివ్యేందు శర్మ కూడా ప్రధాన రోల్స్ చేస్తున్నారు. సినిమాటోగ్రఫీ రత్నవేలు, నవీన్ నూలి ఎడిటింగ్ బాధ్యతలు చేపట్టారు.
భారీ అంచనాల మధ్య, “పెద్ది” మార్చి 27, 2026న పాన్ ఇండియా రిలీజ్ కానుంది.
