సినిమా వార్తలు

డాల్బీ సినిమాస్‌లోనూ విడుదల కానున్న రామ్ చరణ్ ‘పెద్ది’

Published by
Srinivas

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటిస్తున్న పాన్-ఇండియా యాక్షన్ డ్రామా “పెద్ది” పోస్ట్-ప్రొడక్షన్ మరియు ప్రమోషనల్ కార్యక్రమాలు శరవేగంగా కొనసాగుతున్నాయి. బుచ్చి బాబు సనా దర్శకత్వంలో, వృద్ధి సినిమాస్ బ్యానర్‌పై వెంకట సతీష్ కిలారు నిర్మిస్తున్న ఈ చిత్రం ఏప్రిల్ 30న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదలకు సిద్ధమవుతోంది.

ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఈ చిత్రం మరో ప్రత్యేకతను సొంతం చేసుకుంది. పెద్ది అత్యాధునిక డాల్బీ సినిమాస్ ఫార్మెట్‌లో కూడా విడుదల కానుంది. రామ్ చరణ్ మాస్ రగ్గడ్ అవతార్‌ను డాల్బీ సినిమాస్ ఫార్మెట్‌లో చూడడం ప్రేక్షకులకు మరింత గ్రాండ్ విజువల్ అనుభూతిని అందించనుంది. భారీ యాక్షన్, భావోద్వేగాలతో నిండిన ఈ సినిమాను డాల్బీ సినిమాస్‌లో ఆస్వాదించడం ప్రేక్షకులకు పూర్తిగా లీనమయ్యే అనుభూతిని ఇవ్వనుంది.

ఈ సందర్భంగా మేకర్స్ విడుదల చేసిన కొత్త పోస్టర్‌లో రామ్ చరణ్ రగ్గడ్ అవతార్ ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. చేతిలో బ్యాట్ పట్టుకుని, ఇంటెన్స్ లుక్‌తో కనిపిస్తున్న ఆయన క్యారెక్టర్ సినిమాలో పవర్‌ఫుల్ యాక్షన్‌ను సూచిస్తోంది. ఈ పోస్టర్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

ఇప్పటికే పెద్ది ప్రమోషనల్ కంటెంట్ ప్రేక్షకుల్లో భారీ అంచనాలు పెంచింది. ముఖ్యంగా విడుదలైన “పెద్ది ఫస్ట్ షాట్” కి ట్రెమండస్ రెస్పాన్స్ లభించింది.

సంగీత మాంత్రికుడు ఎ.ఆర్. రెహమాన్ అందించిన సౌండ్‌ట్రాక్ కూడా ఇప్పటికే సంచలనం సృష్టిస్తోంది. “చికిరి చికిరి”, “రైరై రా రా” పాటలు వరల్డ్‌వైడ్‌గా వైరల్ అయ్యాయి.

ఈ చిత్రంలో జాన్వీ కపూర్ హీరోయిన్‌గా నటిస్తుండగా, శివ రాజ్‌కుమార్, జగపతి బాబు, దివ్యేందు, బోమన్ ఇరానీ ఇతర కీలక పాత్రల్లో కనిపించనున్నారు.

సినిమాకు టాప్ టెక్నికల్ టీం పని చేస్తోంది. సినిమాటోగ్రాఫర్‌గా ఆర్. రత్నవేలు, ఎడిటర్‌గా నవీన్ నూలి, ప్రొడక్షన్ డిజైనర్‌గా అవినాష్ కొల్లా తమ ప్రతిభను చూపిస్తున్నారు.

Srinivas

Srinivas is an entertainment journalist covering Telugu cinema, celebrity updates, movie reviews, and OTT news for over 9 years in IndiaGlitz.

Recent Posts