Thamma Twitter Review:
ఆయుష్మాన్ ఖురానా (Ayushmann Khurrana) మరియు రష్మిక మందన్నా (RAshmika Mandanna) జంటగా నటించిన రొమాంటిక్ ఎంటర్‌టైనర్ ‘థామా’ (Thamma) ప్రేక్షకులను ఒక విభిన్నమైన ప్రేమకథలోకి తీసుకెళ్తుంది. ప్రేమ, త్యాగం, పునర్జన్మ… ఈ మూడు అంశాలను అద్భుతంగా మేళవించిన ఈ సినిమా, Stree Universe లో భాగంగా రూపొందిన మరో వినూత్న కథగా నిలిచింది.
స్ట్రీ, భేడియా, ముంజ్యా, స్ట్రీ 2 తర్వాత వచ్చిన ఈ ఐదవ చాప్టర్, ఈ హర్రర్-కామెడీ యూనివర్స్‌కి ఒక కొత్త దిశను చూపిస్తుంది. ఈసారి అయితే కథలోకి వాంపైర్ రొమాన్స్ అంశం చేర్చడంతో సినిమా మరింత థ్రిల్లింగ్‌గా, మిస్టీరియస్‌గా మారింది.
ఈ సినిమాను ఆదిత్య సర్పోట్దార్ దర్శకత్వం వహించగా, ఆయుష్మాన్ మరియు రష్మిక మధ్య కెమిస్ట్రీ సినిమాకు హృదయం లాంటిది. భావోద్వేగం, హాస్యం, హర్రర్, ప్రేమ — ఇవన్నీ సమపాళ్లలో మిళితమైన తమ్మా ప్రేక్షకులకు ఒక టైమ్‌లెస్ లవ్ స్టోరీగా నిలవబోతోంది.
అయితే Twitterలో ‘థామా’పై ప్రేక్షకులు ఏమంటున్నారో ఇప్పుడు చూద్దాం…