‘వార్ 2’ (War2) సినిమా ఫెయిల్యూర్ పై ప్రొడ్యూసర్ నాగ వంశీ (Naga Vamsi) తన మౌనం వీడారు. హృతిక్ రోషన్(Hrithik Roshan), జూనియర్ ఎన్టీఆర్ (Jr NTR)ల కాంబినేషన్‌లో భారీ అంచనాలతో వచ్చిన వార్ 2 ఆశించిన స్థాయిలో రాణించకపోవడంతో, తెలుగు వెర్షన్ ప్రజెంటర్‌గా ఉన్న నిర్మాత నాగ వంశీ స్పందించారు. “ఆయన్ని నమ్మాము… కానీ చివరికి ఇలా అయింది” అంటూ యాష్ రాజ్ ఫిల్మ్స్‌పై నేరుగా వ్యాఖ్యానించారు. “తప్పు మా వైపు కాదు, వాళ్ల వైపే జరిగింది. కానీ దెబ్బ మాకే తగిలింది” అని చెప్పారు.
తాజాగా తన తాజా చిత్రం మాస్ జాతర ప్రమోషన్ల సందర్భంగా మాట్లాడుతూ వార్ 2 ఫెయిల్యూర్‌పై ఆయన స్పందించారు.
“తప్పులు అందరివద్దా జరుగుతాయి. ఆదిత్య చోప్రా (Aditya Chopra) గారు ఇండియన్ సినిమాలో అతి పెద్ద నిర్మాత. నేను, ఎన్టీఆర్ అన్న ఇద్దరం కూడా ఆయనపై నమ్మకం పెట్టుకున్నాం. కానీ అది మిస్‌ఫైర్ అయింది,” అని నాగ వంశీ వెల్లడించారు.
అలాగే, ఆయన.. “తప్పు మా వైపు కాదు, YRF వైపే జరిగింది. కానీ ట్రోలింగ్ మాత్రం మాకు ఎదురైంది. ఆ సినిమా మనం నిర్మించినది కాదని సంతోషంగా ఉంది,” అంటూ నవ్వుతూ అన్నారు.
నాగ వంశీ చేసిన ఈ క్యాండిడ్ కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అభిమానులు, సినీ వర్గాలు ఆయన నిజాయితీతో చెప్పిన మాటలను ప్రశంసిస్తున్నాయి.
వార్ 2 ఫెయిల్యూర్ సినిమా ప్రపంచంలో పెద్ద చర్చనీయాంశంగా మారింది. పెద్ద స్టార్‌లు, పేరుగాంచిన ప్రొడక్షన్ హౌస్ ఉన్నప్పటికీ, సినిమా విఫలమవడం మరోసారి రుజువు చేసింది… పేర్లతోనే కాదు, కంటెంట్ తోనే విజయాన్ని సాధించాలి అని.