సినిమా వార్తలు

‘మన శంకర వర ప్రసాద్ గారు’… దీపావళి స్పెషల్ పోస్టర్‌లో మెగాస్టార్ యంగ్ లుక్!

Published by
Srinivas

మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న మోస్ట్ ఎవైటెడ్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ ‘మన శంకర వర ప్రసాద్ గారు’ ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. అనిల్ రావిపూడి దర్శకత్వం వహిస్తున్నారు.

ఇటీవల విడుదలైన ఫస్ట్ సింగిల్ “మీసాల పిల్ల” ఇప్పటికే సూపర్ హిట్‌గా దూసుకెళ్తోంది. రికార్డు స్థాయి వ్యూస్ సాధించిన ఈ మెలోడియస్ సాంగ్ అన్ని మ్యూజిక్ ప్లాట్‌ఫార్మ్స్‌లో ట్రెండింగ్‌లో ఉంది. చిరంజీవి స్వాగ్, చార్మ్‌ను అద్భుతంగా చూపించిన ఈ పాటతో సినిమా పై అంచనాలు మరింత పెరిగాయి.

కాగా, దీపావళి సందర్భంగా మేకర్స్ విడుదల చేసిన కొత్త పోస్టర్ ఇప్పుడు సినీ ప్రియులను ఆకట్టుకుంటోంది. ఇందులో చిరంజీవి తన యంగ్ లుక్‌తో అదరగొట్టారు. లైట్ గ్రీన్ హుడ్ జాకెట్, వైట్ టీషర్ట్, మ్యాచింగ్ ట్రౌజర్స్ ధరించి స్టైలిష్‌గా కనిపించారు. మెగాస్టార్ తన సిగ్నేచర్ స్మైల్‌తో బ్లాక్ మౌంటెన్ సికిల్‌పై సవారీ చేస్తూ కనిపించటం అభిమానులకు తెగ నచ్చేసింది.

స్టైలిష్ గ్లాసెస్, ట్రిమ్ చేసిన గడ్డం ఆయన లుక్‌కి మరింత యూత్‌ఫుల్ వైబ్ ఇచ్చాయి. పోస్టర్ మొత్తం ఉత్సాహం, పాజిటివిటీ, పండుగ ఫీల్‌తో నిండిపోయింది. చిరంజీవి పక్కనే ఇద్దరు స్కూల్ పిల్లలు సైకిళ్లపై సవారీ చేస్తూ కనిపించటం పోస్టర్‌కు మరింత ఫ్యామిలీ టచ్ ని జోడించింది.

సంగీతాన్ని భీమ్స్ సిసిరోలియో అందిస్తుండగా, సినిమాటోగ్రఫీని సమీర్ రెడ్డి, ఎడిటింగ్‌ను తమ్మిరాజు, ఆర్ట్ డైరెక్షన్‌ను ఏ.ఎస్. ప్రకాష్ నిర్వహిస్తున్నారు. స్క్రీన్‌ప్లేలో ఎస్. కృష్ణ, జి. ఆది నారాయణ సహ రచయితలుగా పనిచేస్తుండగా, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్‌గా ఎస్. కృష్ణ వ్యవహరిస్తున్నారు.

ఈ చిత్రం 2026 సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు రానుంది.

Srinivas