సినిమా వార్తలు

దుల్కర్ సల్మాన్-పూజా హెగ్డే ‘శ్రీ శ్రీ’ నుంచి ఫస్ట్ సింగిల్ ‘బొమ్మ బొమ్మ’ రిలీజ్ డేట్ ఫిక్స్

Published by
Srinivas

వెర్సటైల్ స్టార్ దుల్కర్ సల్మాన్, స్టార్ హీరోయిన్ పూజా హెగ్డే జంటగా నటిస్తున్న మోస్ట్ అవైటెడ్ పాన్ ఇండియా రొమాంటిక్ ఎంటర్‌టైనర్ ‘శ్రీ శ్రీ’ మ్యూజిక్ ప్రమోషన్స్‌కు శ్రీకారం చుట్టింది. ఇప్పటికే ఫస్ట్ లుక్ పోస్టర్‌తో ఆసక్తిని పెంచిన చిత్ర బృందం.. ఇప్పుడు తొలి పాట ‘బొమ్మ బొమ్మ’ విడుదల తేదీని ప్రకటించి అభిమానుల్లో మరింత క్యూరియాసిటీని పెంచింది.

నూతన దర్శకుడు రవి నెలకుదిటి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘శ్రీ శ్రీ’ చిత్రాన్ని ప్రతిష్టాత్మక ఎస్‌ఎల్‌వీ సినిమాస్ బ్యానర్‌పై సుధాకర్ చెరుకూరి నిర్మిస్తున్నారు. నిర్మాణ సంస్థకు ఇది ప్రతిష్టాత్మకమైన 10వ చిత్రం (#SLV10) కాగా, ఇషాన్ సక్సేనా సహ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు.

ప్రేమ, వినోదం, హృదయాన్ని హత్తుకునే భావోద్వేగాలతో రూపొందుతున్న ఈ రొమాంటిక్ ఎంటర్‌టైనర్‌లో దుల్కర్ సల్మాన్ సరసన పూజా హెగ్డే తొలిసారిగా జత కట్టడం సినిమాపై ప్రత్యేక ఆకర్షణగా మారింది. ఇటీవల విడుదలైన ఫస్ట్ లుక్ పోస్టర్‌కు ప్రేక్షకుల నుంచి అద్భుతమైన స్పందన లభించింది.

ఇప్పుడు చిత్రబృందం మ్యూజిక్ ప్రమోషన్స్‌ను ప్రారంభిస్తూ ‘బొమ్మ బొమ్మ’ అనే తొలి సింగిల్‌ను జూలై 27న విడుదల చేయనున్నట్లు ప్రకటించింది.

ఈ సందర్భంగా విడుదల చేసిన సాంగ్ అనౌన్స్‌మెంట్ పోస్టర్‌లో దుల్కర్ సల్మాన్, పూజా హెగ్డే ట్రెక్కింగ్ దుస్తుల్లో కొండ ప్రాంతంలోని సస్పెన్షన్ బ్రిడ్జిపై నడుస్తూ కనిపించారు. ఇద్దరి మధ్య కనిపించిన సహజమైన కెమిస్ట్రీ, చిరునవ్వులు పోస్టర్‌కు ఫ్రెష్ లుక్‌ను తీసుకురాగా, నేపథ్యంలో కనిపిస్తున్న రంగురంగుల జెండాలు, ప్రకృతి అందాలు పాట విజువల్స్‌పై మరింత ఆసక్తిని పెంచుతున్నాయి.

టెక్నికల్‌గా కూడా ఈ చిత్రానికి బలమైన టీమ్ పనిచేస్తోంది. అనయ్ ఓం గోస్వామి సినిమాటోగ్రఫీ అందిస్తుండగా, జీవీ ప్రకాశ్ కుమార్ సంగీతం సమకూరుస్తున్నారు. అవినాష్ కొల్లా ప్రొడక్షన్ డిజైనర్‌గా వ్యవహరిస్తున్నారు. ఈ ముగ్గురి ప్రతిభతో సినిమా విజువల్‌గా, సంగీతపరంగా, భావోద్వేగాల పరంగా ప్రేక్షకులను ఆకట్టుకునేలా రూపొందుతోంది.

‘శ్రీ శ్రీ’ చిత్రాన్ని తెలుగు, తమిళం, హిందీ, కన్నడ, మలయాళ భాషల్లో పాన్ ఇండియా స్థాయిలో భారీగా విడుదల చేయనున్నట్లు మేకర్స్ వెల్లడించారు. ఇక తొలి పాట ‘బొమ్మ బొమ్మ’ ప్రేక్షకులను ఏ స్థాయిలో అలరిస్తుందో చూడాలి.

Srinivas

Srinivas is an entertainment journalist covering Telugu cinema, celebrity updates, movie reviews, and OTT news for over 9 years in IndiaGlitz.

Recent Posts