Download App

రిషబ్ శెట్టి ‘కాంతార: చాప్టర్ 1’ – భారతీయ సినిమా చరిత్రలో తొలిసారిగా…

అక్టోబర్ 23, 2025 By Rahul N
రిషబ్ శెట్టి ‘కాంతార: చాప్టర్ 1’ చిత్రం బాక్సాఫీస్ వద్ద దుమ్మురేపుతోంది. విడుదలైన నాటి నుండి అన్ని వర్గాల ప్రేక్షకుల్ని ఆకట్టుకుని, ఘన విజయాన్ని సొంతం చేసుకుంది. అద్భుతమైన విజువల్స్, బలమైన కథనం, రిషబ్ శెట్టి అద్భుత నటన... సినిమాను రికార్డ్ బ్రేకింగ్ కలెక్షన్లతో కొత్త బెంచ్‌మార్క్‌గా నిలిపింది....
రిషబ్ శెట్టి ‘కాంతార: చాప్టర్ 1’ - భారతీయ సినిమా చరిత్రలో తొలిసారిగా...

రిషబ్ శెట్టి ‘కాంతార: చాప్టర్ 1’ చిత్రం బాక్సాఫీస్ వద్ద దుమ్మురేపుతోంది. విడుదలైన నాటి నుండి అన్ని వర్గాల ప్రేక్షకుల్ని ఆకట్టుకుని, ఘన విజయాన్ని సొంతం చేసుకుంది.

అద్భుతమైన విజువల్స్, బలమైన కథనం, రిషబ్ శెట్టి అద్భుత నటన… సినిమాను రికార్డ్ బ్రేకింగ్ కలెక్షన్లతో కొత్త బెంచ్‌మార్క్‌గా నిలిపింది. ప్రేక్షకులు, విమర్శకులు ఇద్దరూ చిత్రాన్ని ప్రశంసలతో ముంచెత్తుతున్నారు.

ఇప్పుడు ఈ చిత్రం మరో చరిత్ర సృష్టించింది. భారతీయ సినిమా చరిత్రలో తొలిసారిగా ఇంగ్లీష్ డబ్బింగ్ వెర్షన్‌తో విడుదల కాబోతున్న చిత్రంగా రికార్డు నెలకొల్పింది. అక్టోబర్ 31న ఇంగ్లీష్ వెర్షన్ ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది.

తాజా వెర్షన్‌లో సినిమా రన్‌టైమ్‌ను కాస్త కుదించారు – 2 గంటలు 45 నిమిషాలు 40 సెకన్లు మాత్రమే ఉంటుంది.

రిషబ్ శెట్టి ‘కాంతార: చాప్టర్ 1’ - భారతీయ సినిమా చరిత్రలో తొలిసారిగా...

బాక్సాఫీస్ విషయానికొస్తే, తెలుగులోనే రూ. 100 కోట్లు వసూలు చేసి రికార్డు సృష్టించగా, ప్రపంచవ్యాప్తంగా రూ. 800 కోట్ల గ్రాస్ కలెక్షన్తో దూసుకెళ్తోంది. ఇది కన్నడ సినీ చరిత్రలోనే అత్యంత భారీ హిట్ మూవీగా నిలిచింది.

పాన్ ఇండియా బ్లాక్‌బస్టర్ ‘కాంతార’కు ప్రీక్వెల్‌గా వచ్చిన ‘కాంతార: చాప్టర్ 1’ ప్రస్తుతం దేశవ్యాప్తంగా, విదేశాల్లో కూడా విజయవంతంగా ప్రదర్శింపబడుతూ సంచలనం సృష్టిస్తోంది.

హోంబలే ఫిల్మ్స్ సంస్థ నిర్మించిన ఈ భారీ చిత్రాన్ని అక్టోబర్ 2న విడుదల చేశారు.

మరిన్ని వార్తలు

Discover more from IndiaGlitz Telugu

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading