శర్వానంద్ ఈసారి స్టైలిష్ మోటార్‌సైకిల్ రేసర్‌గా ప్రేక్షకుల గుండెల్లో స్పీడ్ రేపేందుకు సిద్ధమవుతున్నారు. ఆయన నటిస్తున్న యాక్షన్–ఎమోషనల్ ఎంటర్టైనర్ ‘బైకర్’ పూర్తి దశకు చేరుకుంది.
ఇప్పటికే టైటిల్, ఫస్ట్ లుక్‌తోనే భారీ బజ్ క్రియేట్ చేసిన ఈ సినిమా నుండి ఇప్పుడు “ఫస్ట్ ల్యాప్ గ్లింప్స్” రానుంది. నేటి నుంచే ఈ గ్లింప్స్ థియేటర్లలో ప్రత్యేకంగా ప్రదర్శించనున్నారు. ఈ రోజు విడుదల అవుతున్న ‘బాహుబలి: ది ఎపిక్’, ‘మాస్ జాతర’ సినిమాలకు అటాచ్‌గా ఈ వీడియో చూపించనున్నారు. అంటే, అభిమానులకు ఇది డిజిటల్ విడుదలకు ముందే ఒక ప్రత్యేక థియేట్రికల్ ట్రీట్ గా నిలవనుంది. డిజిటల్‌గా గ్లింప్స్ మాత్రం నవంబర్ 1న సాయంత్రం 4:05 గంటలకు విడుదల కానుంది.
ఇప్పటికే విడుదల చేసిన పోస్టర్‌లో శర్వా రెడ్ అండ్ వైట్ దుస్తుల్లో స్టైలిష్‌గా, కాన్ఫిడెంట్ లుక్‌తో కనిపిస్తున్నారు. ఆయన పొడవాటి కర్లీ హెయిర్, సన్‌గ్లాసెస్ — ఒక రెబెల్లియస్ రేసర్ వైబ్‌ను ఇస్తున్నాయి. ఇటీవల వైరల్ అయిన షర్ట్‌లెస్ ఫోటోలు ఆయన చేసిన అద్భుతమైన ఫిజికల్ ట్రాన్స్‌ఫార్మేషన్‌కు నిదర్శనం కాగా, సినిమా మీద అంచనాలు మరింత పెరిగాయి.
‘బైకర్’ కథ 1990ల మరియు 2000ల నేపథ్యంతో సాగే రేసింగ్ యాక్షన్ డ్రామా, కానీ ఇందులో కేవలం స్పీడ్ మాత్రమే కాదు — మూడు జనరేషన్ల ఫ్యామిలీ బాండ్, ఎమోషన్స్, అంబిషన్, హార్ట్‌ఫెల్ట్ రిలేషన్‌షిప్స్ అన్నీ మిళితమై ఉంటాయి. ఒకే రేసింగ్ కలతో మూడు తరాల కథను అద్భుతంగా అల్లిన ప్రాజెక్ట్‌గా ఈ సినిమా రూపుదిద్దుకుంటోంది.
ఈ చిత్రంలో మాళవిక నాయర్ హీరోయిన్‌గా నటిస్తుండగా, బ్రహ్మాజీ, అతుల్ కులకర్ణి కీలక పాత్రల్లో కనిపించనున్నారు. సినిమాటోగ్రఫీని జె. యువరాజ్ నిర్వహించగా, సంగీతాన్ని జిబ్రాన్ అందిస్తున్నారు. ఎడిటింగ్ బాధ్యతలు అనిల్ కుమార్ పి చేపట్టగా, ప్రొడక్షన్ డిజైన్‌ను రాజీవన్ చూసుకున్నారు. ఆర్ట్ డైరెక్టర్‌గా ఎ. పన్నీర్ సెల్వం, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్‌గా ఎన్. సందీప్ పనిచేస్తున్నారు.
అభిలాష్ రెడ్డి కంకర దర్శకత్వం వహిస్తుండగా, ప్రతిష్టాత్మక బ్యానర్ యువి క్రియేషన్స్ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది.