పదేళ్ల తర్వాత మల్టీ టాలెంటెడ్ సూపర్‌స్టార్ ఎస్‌జె సూర్య తన దర్శకత్వ ప్రతిభని మరోసారి మనకు చూపించేందుకు సిద్ధమయ్యారు. “కిల్లర్” పేరుతో ఓ భారీ పాన్ ఇండియా ప్రాజెక్ట్‌ను తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమాతో ఆయన తిరిగి డైరెక్టర్‌గా రీఎంట్రీ ఇస్తుండటమే కాకుండా, కథ, స్క్రీన్‌ప్లే, డైలాగ్స్ అన్నీ తానే అందించడం విశేషం. కథను తనే రాసి, తనే తెరకెక్కిస్తుండటంతో సినిమాపై మరింత ఆసక్తి పెరిగింది.
ఈ భారీ ప్రాజెక్ట్‌ను శ్రీ గొకులం మూవీస్ (గోకులం గోపాలన్ నేతృత్వంలో) మరియు సూర్య సొంత నిర్మాణ సంస్థ ఏంజెల్ స్టూడియోస్ కలిసి నిర్మిస్తున్నాయి. నిర్మాతలుగా V. C. ప్రవీణ్, బైజు గోపాలన్ వ్యవహరిస్తుండగా, కృష్ణమూర్తి ఎగ్జిక్యూటివ్ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. ఈ సినిమా లాంచ్ ఇటీవలే గ్రాండ్‌గా జరిగింది.
తాజాగా విడుదలైన ఫస్ట్ లుక్ పోస్టర్‌లో ఎస్‌జె సూర్య బ్లాక్ కోటు ధరించి స్టయిలిష్‌గా షాట్ గన్ పట్టుకుని కనిపించడం అభిమానులను ఆకట్టుకుంది. మరో పోస్టర్‌లో రెడ్ డ్రెస్‌లో ఉన్న హీరోయిన్ ప్రీతి అస్రానిని చేతిలో గన్ పట్టుకుని భుజాన ఎత్తుకున్న ఎస్‌జె సూర్య లుక్ సినిమాపై ఇంట్రెస్టింగ్ హైప్ క్రియేట్ చేసింది.
ఈ సినిమాకి సంగీతం అందించబోతున్నది ఏకంగా అకాడమీ అవార్డ్ విన్నర్ ఏఆర్ రెహమాన్. ఆయన సంగీతం ఈ సినిమాకి ప్రత్యేక ఆకర్షణగా నిలవనుంది. ఇది సూర్య – రెహమాన్ కాంబినేషన్‌లో వస్తున్న ఐదో సినిమా కావడం విశేషం. ఈ ఇద్దరి కలయికలో వచ్చిన నాని, న్యూస్, అన్బే ఆరుయిరే, పులి సినిమాలు మ్యూజికల్‌గా సూపర్ హిట్‌గా నిలిచాయి.
“కిల్లర్” అనే పేరుతోనే ఆసక్తి రేపుతున్న ఈ సినిమా ఐదు భాషల్లో పాన్ ఇండియా స్థాయిలో విడుదల కానుంది. భారీ నిర్మాణ విలువలతో తెరకెక్కుతున్న ఈ చిత్రంపై ఇప్పటికే ప్రేక్షకుల్లో భారీ ఎక్స్‌పెక్టేషన్స్ ఏర్పడ్డాయి.