సినిమా వార్తలు

‘ఏజెంట్ మిర్చి’గా శ్రీలీల.. రెడీ.. స్టడీ.. ఫైర్…

Published by
Srinivas

రెడీ.. స్టడీ.. ఫైర్… ఆగ్ లగాదె అంటోంది అందాల భామ శ్రీలీల. ఇప్పటివరకు ‘గుంటూరు కారం’, ‘ధమాకా’ వంటి సినిమాలతో తన గ్లామర్‌, డ్యాన్స్‌ పెర్ఫార్మెన్స్‌లతో ప్రేక్షకుల మనసులు గెలుచుకున్న శ్రీలీల ఇప్పుడు గేర్‌ మార్చేసింది. ‘పుష్ప 2’లో స్పెషల్‌ సాంగ్‌తో అలరించిన ఈ అందాల భామ, ఇప్పుడు తన బాలీవుడ్‌ ప్రస్థానాన్ని కొత్త పుంతలు తొక్కిస్తోంది.

బాలీవుడ్ మూవీలో కార్తిక్‌ ఆర్యన్‌ సరసన రొమాంటిక్‌ ఎంటర్‌టైనర్‌లో నటించే అవకాశం దక్కించుకున్న శ్రీలీల, ఇప్పుడు యాక్షన్‌ జోనర్‌లో అడుగుపెడుతోంది. ఈరోజు ఆమె తన బాలీవుడ్‌ యాక్షన్‌ ప్రాజెక్ట్‌ నుండి తన ఫస్ట్‌ లుక్‌ను విడుదల చేసింది.

తన కొత్త అవతారాన్ని పరిచయం చేస్తూ శ్రీలీల సోషల్ మీడియాలో ఇలా పోస్ట్ చేసింది —
“Ready, steady, fire… Mirchi lagne wali hai! Oct 19 #AagLagaaDe.”

ఈ పోస్టర్‌లో ఆమె స్టైలిష్‌ యాక్షన్‌ లుక్‌లో కనిపించగా, “ఇది పూర్తిగా కొత్త శ్రీలీల” అంటూ అభిమానులు కామెంట్లు కురిపిస్తున్నారు.

ఇక్కడ ఆశ్చర్యమేమిటంటే… ఇటీవల నటుడు బాబీ డియోల్‌ కూడా తన ‘ప్రొఫెసర్ వైట్ నాయిస్’ లుక్‌ను అదే హ్యాష్‌ట్యాగ్‌తో (#AagLagaaDe) షేర్‌ చేయడం చర్చనీయాంశమైంది. దీంతో ఇది ఒకే యూనివర్స్‌లో భాగమా? లేక పెద్ద ప్రమోషనల్ క్యాంపెయినా? అనే ఊహాగానాలు మొదలయ్యాయి.

తెలిసిన సమాచారం ప్రకారం, ఈ చిత్రంలో రణ్‌వీర్‌ సింగ్‌ హీరోగా నటిస్తుండగా, శ్రీలీల ఫైరీ అండర్‌కవర్‌ ఏజెంట్ ‘మిర్చి’ పాత్రలో కనిపించబోతోందట.

ఈ కొత్త లుక్‌తో శ్రీలీల గ్లామర్‌కే కాదు, యాక్షన్‌లో కూడా సత్తా చాటగలదని మరోసారి నిరూపించింది. అక్టోబర్‌ 19న విడుదల కాబోయే ఈ ప్రాజెక్ట్‌ ప్రస్తుతం బీ-టౌన్‌లో హాట్‌ టాపిక్‌గా మారింది.

Srinivas

Srinivas is an entertainment journalist covering Telugu cinema, celebrity updates, movie reviews, and OTT news for over 9 years in IndiaGlitz.