Download App

సూర్య ‘సీన్’ ట్రైలర్ అదిరింది.. డీఎస్పీగా సరికొత్త అవతారంలో స్టార్ హీరో!

నవంబర్ 2, 2026 • By Srinivas
తమిళ స్టార్ హీరో సూర్య మరోసారి సరికొత్త పాత్రతో ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమవుతున్నారు. మలయాళంలో బ్లాక్‌బస్టర్ హిట్‌గా నిలిచిన ‘ఆవేశం’ చిత్రంతో గుర్తింపు తెచ్చుకున్న దర్శకుడు జిత్తు మాధవన్‌తో ఆయన తెరకెక్కిస్తున్న యాక్షన్ కామెడీ ఎంటర్‌టైనర్ ‘సీన్’. తాజాగా ఈ సినిమా ట్రైలర్‌ను మేకర్స్ విడుదల చేయగా, ఆద్యంతం...
సూర్య ‘సీన్’ ట్రైలర్ అదిరింది.. డీఎస్పీగా సరికొత్త అవతారంలో స్టార్ హీరో!

తమిళ స్టార్ హీరో సూర్య మరోసారి సరికొత్త పాత్రతో ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమవుతున్నారు. మలయాళంలో బ్లాక్‌బస్టర్ హిట్‌గా నిలిచిన ‘ఆవేశం’ చిత్రంతో గుర్తింపు తెచ్చుకున్న దర్శకుడు జిత్తు మాధవన్‌తో ఆయన తెరకెక్కిస్తున్న యాక్షన్ కామెడీ ఎంటర్‌టైనర్ ‘సీన్’. తాజాగా ఈ సినిమా ట్రైలర్‌ను మేకర్స్ విడుదల చేయగా, ఆద్యంతం ఆసక్తికరంగా సాగిన ఈ ట్రైలర్ సినిమాపై అంచనాలను పెంచుతోంది.

ఈ చిత్రంలో నజ్రియా నజీమ్ హీరోయిన్‌గా నటిస్తుండగా, ఆనంద్ రాజ్, లాల్, రాజ్ ప్రియన్ కీలక పాత్రల్లో కనిపించనున్నారు. జ్యోతిక, సూర్య తమ 2డీ ఎంటర్‌టైన్‌మెంట్, జాగరం స్టూడియోస్ బ్యానర్లపై ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. జయశ్రీ దామోదరన్ సహ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు.

సూర్య ‘సీన్’ ట్రైలర్ అదిరింది.. డీఎస్పీగా సరికొత్త అవతారంలో స్టార్ హీరో!

ఇప్పటికే విడుదలైన టైటిల్ టీజర్, గ్లింప్స్ సినిమాకు సంబంధించిన విభిన్నమైన ప్రపంచాన్ని పరిచయం చేశాయి. విడుదలైన రెండు పాటలకు కూడా మంచి స్పందన లభించింది. తాజాగా వచ్చిన ట్రైలర్ మాత్రం మరింత వినోదాన్ని, ఉత్కంఠను అందించేలా ఉంది.

ఇందులో డీఎస్పీ ప్రేమ్‌రాజ్‌గా సూర్య ఎంట్రీ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఆయన బాడీ లాంగ్వేజ్, కామెడీ టైమింగ్, పాత్రను డిజైన్ చేసిన తీరు ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి. కెరీర్ మంచి స్థాయిలో ఉన్నప్పుడు ఉద్యోగానికి రాజీనామా చేసి ఏం చేస్తావని అడిగితే.. రాజకీయాల్లోకి వెళ్తానంటూ సూర్య చెప్పే సమాధానం ట్రైలర్‌లో ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.

మరోవైపు ఈశ్వరన్‌గా నస్లేన్ కనిపించిన తీరు కూడా ఆసక్తికరంగా ఉంది. అతడిని పట్టుకునేందుకు డీఎస్పీ ప్రేమ్‌రాజ్ చేసే ప్రయత్నాలు, ఈ క్రమంలో ఎదురయ్యే పరిణామాలు కథలో ఉత్కంఠను పెంచుతున్నాయి. ఇక నజ్రియా నజీమ్‌ను పనిమనిషి పాత్రలో చూపించిన విధానం కూడా కొత్తగా ఉంది. యాక్షన్, కామెడీ, థ్రిల్ అంశాలను దర్శకుడు జిత్తు మాధవన్ తనదైన శైలిలో మేళవించినట్లు ట్రైలర్ చూస్తే అర్థమవుతోంది.

సూర్య ‘సీన్’ ట్రైలర్ అదిరింది.. డీఎస్పీగా సరికొత్త అవతారంలో స్టార్ హీరో!

సాంకేతికంగా కూడా సినిమా బలంగా కనిపిస్తోంది. వినీత్ అగస్టిన్ సినిమాటోగ్రఫీ విజువల్స్‌కు ప్రత్యేక ఆకర్షణగా నిలవగా, సుశిన్ శ్యామ్ అందించిన సంగీతం యాక్షన్, ఎమోషనల్ సన్నివేశాలకు మరింత బలాన్ని ఇచ్చింది. అజ్మల్ సాబు ఎడిటింగ్, అశ్విని కాలే ప్రొడక్షన్ డిజైన్ సినిమాకు కీలకంగా నిలవనున్నాయి.

మొత్తానికి ట్రైలర్‌తో ‘సీన్’పై అంచనాలు ఒక్కసారిగా పెరిగాయి. ముఖ్యంగా సూర్యను సరికొత్త కామెడీ యాక్షన్ అవతారంలో చూడాలని అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో ఈ చిత్రాన్ని ప్రముఖ డిస్ట్రిబ్యూషన్ సంస్థ ఎన్వీఆర్ సినిమా గ్రాండ్‌గా విడుదల చేయనుంది.

‘సీన్’ ప్రపంచవ్యాప్తంగా 2026 నవంబర్ 6న దీపావళి కానుకగా థియేటర్లలోకి రానుంది.

Srinivas

Srinivas is an entertainment journalist covering Telugu cinema, celebrity updates, movie reviews, and OTT news for over 9 years in IndiaGlitz.

View all posts