Download App

‘దొంగ నా కొడుకు’ కోసం కంఫర్ట్ జోన్ దాటా.. మౌళి తనూజ్ ప్రశాంత్

అక్టోబర్ 28, 2026 • By Srinivas
మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తున్న యూత్‌ఫుల్ ఎంటర్‌టైనర్ ‘దొంగ నా కొడుకు’ ప్రమోషన్స్ జోరందుకున్నాయి. మౌళి తనూజ్ ప్రశాంత్, సుష్మిత శెట్టి జంటగా నటిస్తున్న ఈ చిత్రానికి శ్రీను కంబాల దర్శకత్వం వహిస్తున్నారు. నవంబర్ 13న సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. తాజాగా ఈ మూవీ మ్యూజికల్ ప్రమోషన్స్‌లో...
‘దొంగ నా కొడుకు’ కోసం కంఫర్ట్ జోన్ దాటా.. మౌళి తనూజ్ ప్రశాంత్

మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తున్న యూత్‌ఫుల్ ఎంటర్‌టైనర్ ‘దొంగ నా కొడుకు’ ప్రమోషన్స్ జోరందుకున్నాయి. మౌళి తనూజ్ ప్రశాంత్, సుష్మిత శెట్టి జంటగా నటిస్తున్న ఈ చిత్రానికి శ్రీను కంబాల దర్శకత్వం వహిస్తున్నారు. నవంబర్ 13న సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. తాజాగా ఈ మూవీ మ్యూజికల్ ప్రమోషన్స్‌లో భాగంగా ఫస్ట్ సింగిల్ ‘ఓ మై గాడ్’ను విడుదల చేశారు.

సింజిత్ ఎర్రమిల్లి స్వరపరిచిన ఈ రొమాంటిక్ సాంగ్‌కు భాస్కరభట్ల సాహిత్యం అందించగా, రామ్ మిరియాల తన ఎనర్జిటిక్ వాయిస్‌తో పాటను మరింత ఆకట్టుకునేలా చేశారు. ఆట సందీప్ కొరియోగ్రఫీ చేసిన ఈ పాటలో మౌళి తన డ్యాన్స్‌తో ఆకట్టుకున్నారు. మౌళి, సుష్మిత శెట్టి మధ్య కెమిస్ట్రీ కూడా పాటకు ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.

మౌళి తనూజ్ ప్రశాంత్ మాట్లాడుతూ.. “ముందుగా సందీప్ మాస్టర్‌కు థాంక్స్ చెప్పాలి. నన్ను కంఫర్ట్ జోన్ నుంచి బయటకు తీసుకొచ్చి ఈ సాంగ్ చేయించారు. ఆయనతో కలిసి వర్క్ చేయడం చాలా హ్యాపీగా అనిపించింది. భాస్కరభట్ల గారు యూత్‌కు కనెక్ట్ అయ్యేలా అద్భుతమైన లిరిక్స్ రాశారు. రామ్ మిరియాల గారు నా ఫేవరెట్ సింగర్. ఆయన నా సినిమా కోసం పాట పాడటం నా అదృష్టంగా భావిస్తున్నాను. సింజిత్ తన మ్యూజిక్‌తో సినిమాను మరో లెవల్‌కు తీసుకెళ్తాడు. తను నా ఫ్రెండ్ కావడం ఆనందంగా ఉంది.

యూట్యూబ్‌తో నా ప్రయాణం ప్రారంభమైంది. ‘లిటిల్ హార్ట్స్’తో నటుడిగా కూడా విజయం అందుకున్నాను. ఈ సినిమాకు యాక్టింగ్‌తో పాటు ప్రొడక్షన్ బాధ్యతలను కూడా నిర్వహించాను. మైత్రీ మూవీ మేకర్స్‌తో కలిసి పనిచేయడం ద్వారా ఎన్నో విషయాలు నేర్చుకున్నాను. కంఫర్ట్ జోన్ దాటి బయటకు వస్తేనే విజయం సాధించగలమని నమ్ముతున్నాను. ఈ సినిమా చాలా ఎంటర్‌టైనింగ్‌గా ఉంటుంది. ఫ్రెండ్స్, ఫ్యామిలీతో కలిసి వచ్చి హాయిగా నవ్వుకునే సినిమా ఇది. నవంబర్ 13న థియేటర్లకు వచ్చి సినిమాను ఎంజాయ్ చేయండి” అని కోరారు.

దర్శకుడు శ్రీను కంబాల మాట్లాడుతూ.. “మా టీజర్‌కు చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది. సినిమాలో పాటలు కూడా అద్భుతంగా ఉంటాయి. సింజిత్ మంచి పాటలు ఇవ్వడంతో పాటు బ్యాక్‌గ్రౌండ్ స్కోర్‌ను కూడా చాలా బాగా చేశారు. ఆయనతో వర్క్ చేయడం హ్యాపీగా ఉంది. రామ్ మిరియాల ఎనర్జీ ఈ పాటకు బాగా ప్లస్ అయింది. సుష్మిత తన పాత్రను పర్ఫెక్ట్‌గా చేసింది. మౌళి చేసిన డ్యాన్స్ కూడా పాత్రకు తగ్గట్టుగా ఉంటుంది. ప్రేక్షకులు ఈ పాటను ఎంజాయ్ చేస్తారు” అన్నారు.

హీరోయిన్ సుష్మిత శెట్టి మాట్లాడుతూ.. “చాలామంది నన్ను నార్త్ ఇండియన్ అనుకుంటున్నారు. కానీ నేను తెలుగు అమ్మాయిని. ఈ అవకాశం ఇచ్చిన మైత్రీ మూవీ మేకర్స్‌కు ధన్యవాదాలు. దర్శకుడు సినిమాను అద్భుతంగా తీశారు. ఈ పాటను చాలా ఎంజాయ్ చేశాను. మౌళితో కలిసి నటించడం మంచి అనుభవం. సందీప్ మాస్టర్ చాలా బ్యూటిఫుల్‌గా కొరియోగ్రఫీ చేశారు. ప్రేక్షకులు ఈ పాటను థియేటర్లలో బాగా ఎంజాయ్ చేస్తారు” అని తెలిపారు.

కొరియోగ్రాఫర్ ఆట సందీప్ మాట్లాడుతూ.. “మౌళి ఈ పాటను అద్భుతంగా పెర్ఫార్మ్ చేశాడు. ప్రతి స్టెప్పును చాలా బాగా చేశాడు. సింజిత్ మంచి ట్యూన్ ఇచ్చారు. రామ్ మిరియాల వాయిస్ పాటకు మరింత ఎనర్జీ తీసుకొచ్చింది. మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌లో తొలిసారి కొరియోగ్రఫీ చేయడం చాలా సంతోషంగా ఉంది” అన్నారు.

సంగీత దర్శకుడు సింజిత్ ఎర్రమిల్లి మాట్లాడుతూ.. “ఈ పాట మీ అందరికీ నచ్చడం చాలా సంతోషంగా ఉంది. ఇందులో మంచి హుక్ స్టెప్స్ కూడా ఉన్నాయి. పాట పాడిన రామ్ మిరియాల గారికి, సాహిత్యం అందించిన భాస్కరభట్ల గారికి ధన్యవాదాలు. ‘దొంగ నా కొడుకు’ సినిమా ప్రేక్షకులందరినీ తప్పకుండా ఎంటర్‌టైన్ చేస్తుంది” అని చెప్పారు.

ఇప్పటికే ఫస్ట్ లుక్, టీజర్‌తో ఆసక్తి పెంచిన ‘దొంగ నా కొడుకు’.. ‘ఓ మై గాడ్’ పాటతో మ్యూజికల్ ప్రమోషన్స్‌ను ప్రారంభించింది. నవీన్ యెర్నేని, వై. రవిశంకర్ నిర్మాతలుగా, అనిల్ యెర్నేని కో-ప్రొడ్యూసర్‌గా వ్యవహరిస్తున్నారు. సూర్య బాలాజీ సినిమాటోగ్రఫీ అందిస్తుండగా, శ్రీధర్ సోంపల్లి ఎడిటర్‌గా, నాగేంద్ర గువ్వల ప్రొడక్షన్ డిజైనర్‌గా పనిచేస్తున్నారు. నవంబర్ 13న ఈ చిత్రం థియేటర్లలో విడుదల కానుంది.

Srinivas

Srinivas is an entertainment journalist covering Telugu cinema, celebrity updates, movie reviews, and OTT news for over 9 years in IndiaGlitz.

View all posts

మరిన్ని వార్తలు

Trending Now