Download App

అదే నా యంగ్ లుక్స్ సీక్రెట్: శ్రీదేవి

ఆగస్ట్ 18, 2025 By Rahul N
నారా రోహిత్ 20వ మైల్‌స్టోన్ మూవీ సుందరకాండ ఆగస్టు 27న గ్రాండ్‌గా ప్రేక్షకుల ముందుకు రానుంది. వెంకటేష్ నిమ్మలపూడి దర్శకత్వంలో సందీప్ పిక్చర్ ప్యాలెస్ బ్యానర్‌పై సంతోష్ చిన్నపొల్ల, గౌతమ్ రెడ్డి, రాకేష్ మహంకాళి నిర్మిస్తున్న ఈ చిత్రంలో వృతి వాఘాని, శ్రీదేవి విజయ్‌కుమార్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. టీజర్,...
అదే నా యంగ్ లుక్స్ సీక్రెట్: శ్రీదేవి

నారా రోహిత్ 20వ మైల్‌స్టోన్ మూవీ సుందరకాండ ఆగస్టు 27న గ్రాండ్‌గా ప్రేక్షకుల ముందుకు రానుంది. వెంకటేష్ నిమ్మలపూడి దర్శకత్వంలో సందీప్ పిక్చర్ ప్యాలెస్ బ్యానర్‌పై సంతోష్ చిన్నపొల్ల, గౌతమ్ రెడ్డి, రాకేష్ మహంకాళి నిర్మిస్తున్న ఈ చిత్రంలో వృతి వాఘాని, శ్రీదేవి విజయ్‌కుమార్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. టీజర్, పాటలు, ట్రైలర్ సినిమాపై బలమైన అంచనాలు రేపాయి.

తాజాగా విలేకరుల సమావేశంలో మాట్లాడిన శ్రీదేవి విజయ్‌కుమార్, చాలా కాలం తర్వాత హీరోయిన్‌గా రీఎంట్రీ ఇస్తుండటం పట్ల ఆనందం వ్యక్తం చేశారు. “ఏ నటికి అయినా మంచి క్యారెక్టర్ చేయడం చాలా ఇంపార్టెంట్. ఈ సినిమాలో నాకు చాలా మీనింగ్‌ఫుల్, స్ట్రాంగ్ రోల్ దక్కింది. అందుకే ఇది నా కెరీర్‌లో మెమొరబుల్ అవుతుంది” అని ఆమె అన్నారు.

తన సినిమాల బ్రేక్ గురించి మాట్లాడుతూ, పెళ్లి, ఫ్యామిలీ రెస్పాన్స్‌బిలిటీస్ కారణంగా గ్యాప్ వచ్చిందని, కానీ ఇప్పుడు మళ్లీ సినిమాలు చేయడానికి సిద్ధంగా ఉన్నానని తెలిపారు. సుందరకాండ స్క్రిప్ట్ విన్న వెంటనే ఆశ్చర్యపోయానని, డైరెక్టర్ వెంకటేష్ నిమ్మలపూడి చూపించిన క్లారిటీ, కాన్ఫిడెన్స్ తనను ఆకట్టుకున్నాయని చెప్పారు.

అదే నా యంగ్ లుక్స్ సీక్రెట్: శ్రీదేవి

నారా రోహిత్ గురించి మాట్లాడుతూ “ఆయన చాలా కూల్ పర్సన్. వర్క్ చేయడం చాలా హ్యాపీగా అనిపించింది” అన్నారు. అలాగే లియోన్ జేమ్స్ మ్యూజిక్ ఈ సినిమాకి హైలైట్ అవుతుందని, సిడ్ శ్రీరామ్ పాడిన పాట తనకు బాగా నచ్చిందని పేర్కొన్నారు.

తన ఆరోగ్యం, యంగ్ లుక్స్ సీక్రెట్ గురించి అడిగితే “ఆనందంగా ఉండడమే పెద్ద సీక్రెట్. దాంతో పాటు గాడ్ బ్లెస్సింగ్” అని సమాధానమిచ్చారు.

ప్రభాస్‌తో తన ఫ్రెండ్షిప్ గురించి కూడా చెప్పి, “ఈశ్వర్ సినిమా టైమ్ నుంచే ఆయన పెద్ద స్టార్ అవుతారని మాకు తెలుసు. ఇప్పటికీ ఆయనలో ఎలాంటి మార్పు లేదు. అదే ప్యాషన్, అదే క్యూట్‌నెస్” అని పేర్కొన్నారు.

తన భవిష్యత్ ప్రణాళికల గురించి మాట్లాడుతూ, మంచి ప్రాధాన్యత ఉన్న స్ట్రాంగ్ క్యారెక్టర్స్ చేయాలని ఆకాంక్ష వ్యక్తం చేశారు.

Trending Now

No trending articles in this category from the last 3 days.

Discover more from IndiaGlitz Telugu

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading