నందమూరి బాలకృష్ణ – బోయపాటి శ్రీను కాంబినేషన్‌లో వస్తున్న అఖండ 2: ది తాండవం గ్రాండ్ రీలీజ్ టీజర్ విడుదలై ప్రేక్షకుల్లో గూస్‌బంప్స్ పుట్టిస్తోంది. అఖండ యూనివర్స్‌ను మరింత భారీగా, ఆధ్యాత్మికంగా, ఫెరోషస్‌గా విస్తరించిన విధానం ఈ టీజర్‌కు ప్రత్యేక హైలైట్.
టీజర్ మొదటి ఫ్రేమ్ నుంచే ఆధ్యాత్మిక ఎనర్జీ స్పష్టంగా కనిపిస్తుంది. తాంత్రిక క్రతువులు, యాగశాల వాతావరణం, కుంభమేళా దృశ్యాలు టీజర్‌ను మిస్టిక్ ప్రపంచంలోకి తీసుకెళ్తాయి. ఇందులో ప్రధాన ఆకర్షణ అఖండ అవతార్‌లో బాలకృష్ణ యొక్క స్క్రీన్ ప్రెజెన్స్. సాధారణంగా మాస్ లెవెల్ హైగా ఉండే అఖండను, ఈసారి బోయపాటి మరింత దివ్య కోపంతో చూపించారు. ధర్మాన్ని కాపాడే శక్తిగా అఖండ నిలబడ్డ ప్రతి షాట్ స్టయిల్‌తో పాటు భావోద్వేగాన్ని కూడా మిళితం చేస్తోంది.
టీజర్‌లో కనిపించిన యాక్షన్ సీక్వెన్సులు పూర్తిగా నెక్ట్స్ లెవెల్. శత్రువులను ఛేదిస్తున్న అఖండ దివ్య శక్తుల ప్రతాపం, అతని ఆగ్రహం, అతని నడక, అతని సంభాషణ… ముఖ్యంగా శివ తాండవం నేపథ్య సంగీతం మొత్తం టీజర్‌ను పవర్‌ఫుల్‌గా మోసుకెళ్లింది.
దర్శకుడు బోయపాటి శ్రీను తన మార్క్‌ను మళ్లీ రుజువు చేస్తూ, విజువల్ గ్రాండియర్, దివ్య భావన, ఘోర యాక్షన్ ఒక వేరే లెవెల్ స్పిరిచువల్ యాక్షన్ ఎనర్జీని సృష్టించారు.
ఎస్. థమన్ సంగీతం టీజర్‌కు ప్రాణం. శివతాండవ రాగాలు, రుద్ర తాళాలు, ఆధ్యాత్మిక హమ్ అన్ని విజువల్స్ కి తగ్గట్టుగా ఉన్నాయి.
14 రీల్స్ ప్లస్ హై-ఎండ్ ప్రొడక్షన్ విల్యూస్ స్పష్టంగా కనిపిస్తున్నాయి. ప్రతి ఫ్రేమ్ కూడా భారీ బడ్జెట్, డీటైల్ మైన సమర్పణను చూపిస్తోంది.
మొత్తం గా, అఖండ 2 టీజర్ పూర్తిగా మాస్ + మిస్టికల్ + మైండ్-బ్లోయింగ్ అంటూ ప్రేక్షకులు, ఫ్యాన్స్ ఒకే మాటగా ప్రశంసిస్తున్నారు. అఖండ యూనివర్స్ వచ్చే స్థాయి ఏంటో చూపించే ఈ టీజర్, సినిమా పై అంచనాలను ఆకాశానికెత్తేసింది.