సినిమా వార్తలు

‘లెనిన్’ నుంచి విడుదలైన ‘వారెవా వారెవా’ లిరికల్ సాంగ్‌

Published by
Srinivas

యువ హీరో అఖిల్ అక్కినేని హీరోగా, మురళి కిషోర్ అబ్బూరు దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం లెనిన్ పై అంచనాలు రోజురోజుకు పెరుగుతున్నాయి. మనం ఎంటర్‌ప్రైజెస్ LLP మరియు సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకాలపై అక్కినేని నాగార్జున, సూర్యదేవర నాగవంశీ నిర్మిస్తున్న ఈ చిత్రం తాజాగా సంగీత పరంగా మంచి బజ్‌ను సొంతం చేసుకుంది.

సోమవారం విడుదలైన ‘వారెవా వారెవా..’ లిరికల్ సాంగ్‌కు అభిమానులు, మ్యూజిక్ లవర్స్ నుంచి అద్భుతమైన స్పందన లభిస్తోంది. అనంత శ్రీరామ్ రచించిన భావోద్వేగభరితమైన లిరిక్స్‌కు, శ్వేతా మోహన్, జుబిన్ నౌటియాల్ తమ మధురమైన స్వరాలతో ప్రాణం పోశారు. వారి గానం పాటకు ఓ హృద్యమైన ఎమోషనల్ ఫీల్‌ను తీసుకొచ్చిందని శ్రోతలు ప్రశంసిస్తున్నారు.

మ్యూజికల్ సెన్సేషన్ ఎస్‌.ఎస్‌.తమన్ సంగీతం అందించిన ఈ పాట రొమాంటిక్ వైబ్‌తో ఆకట్టుకుంటోంది. సినిమాలోని భావోద్వేగాలను సున్నితంగా ప్రతిబింబిస్తూ, హీరో–హీరోయిన్ మధ్య కెమిస్ట్రీని చక్కగా హైలైట్ చేసేలా ఈ సాంగ్ ఉండటంతో సినిమాపై అంచనాలు మరింత పెరిగాయి.

ఇదిలా ఉండగా, ‘లెనిన్’ షూటింగ్ వేగంగా సాగుతోంది. ఇప్పటివరకు దాదాపు 70 శాతం చిత్రీకరణ పూర్తయ్యిందని సమాచారం. సమ్మర్ సీజన్‌లో సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. ఈ చిత్రంలో అఖిల్ అక్కినేని సరసన భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్‌గా నటిస్తోంది.

మంచి సంగీతంతో ముందే హృదయాలను గెలుచుకున్న ‘లెనిన్’, విడుదలకు దగ్గరయ్యే కొద్దీ ప్రేక్షకుల్లో మరింత ఆసక్తిని రేపుతోంది.

Srinivas