సినిమా వార్తలు

ఏగన్–శ్రీదేవీ–ఫెమినా జార్జ్ ప్రధాన పాత్రల్లో విజన్ సినిమా హౌస్ కొత్త చిత్రం

Published by
Srinivas

కోలీవుడ్‌లో ఇటీవల విడుదలై బ్లాక్‌బస్టర్ హిట్‌గా నిలిచిన ‘జో’ చిత్రంతో విశేష గుర్తింపు అందుకున్న విజన్ సినిమా హౌస్ తమ తదుపరి ప్రాజెక్ట్‌ అయిన ప్రొడక్షన్ నెంబర్ 3 ను అధికారికంగా ప్రకటించింది. ఈ చిత్రం తెలుగు–తమిళ్ ద్విభాషా చిత్రంగా రూపొందనున్నది.

ఈ ప్రాజెక్ట్‌లో ప్రతిభావంతులైన నటులు ప్రధాన పాత్రల్లో కనిపించనున్నారు. ‘కోజిపన్నై చెల్లదురై’, ‘కానా కానమ్ కాలంగళ్’ వంటి చిత్రాలతో నటనలో మెప్పించిన ఏగన్, ‘కోర్ట్’ ద్వారా ప్రశంసలు పొందిన శ్రీదేవీ, ‘మిన్నల్ మురళి’ ఫేమ్ ఫెమినా జార్జ్ ఈ సినిమాలో కీలక పాత్రలను పోషిస్తున్నారు. నటీనటుల ఎంపికతోనే చిత్రంపై మంచి బజ్ నెలకొంది.

ఈ చిత్రానికి రీసెంట్ మ్యూజికల్ సెన్సేషన్ విజయ్ బుల్గానిన్ సంగీతం అందిస్తున్నారు. ‘బేబీ’, ‘కోర్ట్’ వంటి చిత్రాలకు చార్ట్‌బస్టర్ ఆల్బమ్స్ ఇచ్చిన విజయ్, ఈ ద్విభాషా చిత్రానికి మ్యూజిక్ అందించనున్నారని మేకర్స్ ప్రకటించారు.

‘ఆహా కళ్యాణం’ చిత్రంతో దర్శకత్వం లో తనదైన ముద్ర వేసుకున్న యువరాజ్ చిన్నసామి ఈ కొత్త ప్రాజెక్ట్‌కు దర్శకుడిగా వ్యవహరిస్తున్నారు.

‘జో’ విజయంతో కంటెంట్‌కు ప్రాధాన్యమిస్తూ కథా ప్రధాన చిత్రాలు అందించాలనే లక్ష్యంతో ముందుకు సాగుతున్నట్లు నిర్మాతలు డా. డి. అరుళనందు, మాథ్యూయో అరుళనందు తెలిపారు. క్వాలిటీ విషయంలో ఎక్కడా రాజీ పడకుండా ఈ ప్రాజెక్ట్‌ను భారీ స్థాయిలో నిర్మించనున్నట్టు స్పష్టం చేశారు.

సినిమా సంబంధిత మరిన్ని వివరాలను త్వరలోనే చిత్ర బృందం ప్రకటించనుంది.

Srinivas

Srinivas is an entertainment journalist covering Telugu cinema, celebrity updates, movie reviews, and OTT news for over 9 years in IndiaGlitz.