సినిమా వార్తలు

ఐబొమ్మ నిర్వాహకుడు ఇమ్మడి రవి అరెస్ట్.. కీలక సమాచారమిచ్చిన ఆమె ?

Published by
Srinivas

సినీ పరిశ్రమను సంవత్సరాలుగా వణికిస్తున్న పైరసీ మాఫియా ఐబొమ్మపై తెలంగాణ పోలీసులు కీలక చర్య చేపట్టారు. హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు ఈ వెబ్‌సైట్ ప్రధాన నిర్వాహకుడిగా భావిస్తున్న ఇమ్మడి రవిని హైదరాబాద్‌లో అరెస్ట్ చేశారు. రవి విదేశాల్లోనే ఉండి ఐబొమ్మను ఆపరేట్ చేస్తున్నాడని చాలా కాలంగా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

ఓటీటీ ప్లాట్‌ఫార్ములు, థియేటర్ వ్యాపారాలకు వేల కోట్ల రూపాయల నష్టం కలిగిస్తున్న పైరసీ నెట్‌వర్క్‌పై నిర్మాతలు పలుమార్లు ఫిర్యాదులు చేయడంతో, పోలీసులు ప్రత్యేక దర్యాప్తు చేపట్టారు. ఈ నేపథ్యంలో రవిపై విశేష నిఘా పెట్టిన అధికారులు చివరికి అతడిని పట్టించగలిగారు.

రవి భార్య కీలక సమాచారం అందించినట్లు సమాచారం. దర్యాప్తులో ఆసక్తికర అంశం బయటపడింది. రవిని పట్టుకునే ప్రక్రియలో అతడి భార్య కీలక పాత్ర పోషించినట్లు వెల్లడవుతోంది. గత కొంతకాలంగా దంపతుల మధ్య విభేదాలు ఉండటం వల్ల, రవి లొకేషన్‌ సహా వ్యక్తిగత సమాచారం ఆమె సైబర్ క్రైమ్ అధికారులకు గోప్యంగా అందించినట్టు తెలుస్తోంది.

అరెస్ట్ సమయంలో రవి ఉపయోగించిన కంప్యూటర్లు, హార్డ్‌డిస్క్‌లు, నెట్‌వర్క్ పరికరాలు అధికారుల చెంతకు వచ్చాయి. వీటిని ఫోరెన్సిక్ విశ్లేషణకు పంపించారు. ఐబొమ్మ నడపటంలో ఇంకా ఎవరెవరు పాల్గొన్నారనే అంశంపై పోలీసులు మరింత విచారణ చేస్తున్నారు.

Srinivas

Srinivas is an entertainment journalist covering Telugu cinema, celebrity updates, movie reviews, and OTT news for over 9 years in IndiaGlitz.