గాడ్ ఆఫ్ మాసెస్ నందమూరి బాలకృష్ణ – బ్లాక్‌బస్టర్ దర్శకుడు బోయపాటి శ్రీను కాంబినేషన్‌లో వస్తున్న మోస్ట్ అవైటెడ్ డివైన్ యాక్షన్ ఎంటర్‌టైనర్ ‘అఖండ 2: తాండవం’ ప్రస్తుతం దేశవ్యాప్తంగా భారీ అంచనాలు సృష్టిస్తోంది. రామ్ ఆచంట, గోపీచంద్ ఆచంట నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని ఎం. తేజస్విని నందమూరి సమర్పిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన టీజర్, ఫస్ట్ సింగిల్ ‘తాండవం’కు వచ్చిన అద్భుత స్పందనతో సినిమాపై హైప్ మరింత పెరిగింది. ఈ నేపథ్యంలో మేకర్స్ సినిమా గురించి ఒక పెద్ద అప్‌డేట్ విడుదల చేశారు.
నిన్న జరిగిన ప్రత్యేక కార్యక్రమంలో ‘అఖండ 2: తాండవం’ను 3D ఫార్మాట్‌లోనూ విడుదల చేయనున్నట్టు అధికారికంగా ప్రకటించారు.
దీనికి సంబంధించి నిర్వహించిన ప్రెస్ మీట్‌లో దర్శకుడు బోయపాటి శ్రీను మాట్లాడుతూ, మీడియా మిత్రులు, అభిమానులు, 3D అనుభూతిని ఆస్వాదించడానికి వచ్చిన ప్రేక్షకులకు ధన్యవాదాలు తెలిపారు. బాలకృష్ణ గారి అభిమానులకు, ప్రేక్షకులకు ప్రత్యేకమైన అనుభూతి ఇవ్వాలన్న ఉద్దేశంతోనే సినిమాను 3Dలో రూపొందిస్తున్నట్టు అన్నారు. త్రీడీలో సినిమా చూసిన తర్వాత ప్రేక్షకులు అద్భుత అనుభూతి పొందుతారని విశ్వాసం వ్యక్తం చేశారు. ఈ చిత్రం భారతదేశ ఆత్మ, పరమాత్మ అని, మన దేశ సనాతన ధర్మాన్ని ఆధారంగా తీసుకుని కథ రూపొందించామని చెప్పారు. చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దల వరకు అందరికీ థియేటర్లలో మంత్రముగ్ధ అనుభూతి కలిగేలా ఉండాలని తన బాధ్యతగా భావిస్తున్నట్లు తెలిపారు. దేశమంతా సినిమా చేరాలన్న ఉద్దేశంతో ప్రచారాన్ని ముంబయి నుంచి ప్రారంభించామని చెప్పారు. భగవద్గీత, రామాయణం, భారతం వంటి గ్రంథాలకు ఉన్న ఆత్మే అఖండ 2 అని పేర్కొన్నారు.
నిర్మాత గోపీ ఆచంట మాట్లాడుతూ ఈ కథ, కాన్వాస్, లొకేషన్ 3D కావడంతో సినిమా 3Dలో కూడా రూపొందించామని, విజువల్‌గా ప్రేక్షకులకు అసాధారణమైన అనుభవం ఇవ్వగలుగుతుందని చెప్పారు. ఇది మా వాగ్దానం అని అన్నారు. రచ్చ రవి మాట్లాడుతూ సినిమా చూసిన తర్వాత ప్రేక్షకులు జై బాలయ్య, హర హర మహాదేవ, జై బోయపాటి అంటూ థియేటర్ల నుంచి బయటకు వస్తారని, ఈ సినిమా అందరికీ జీవితాంతం గుర్తుండిపోతుందన్నారు. డీఓపీ సంతోష్ మాట్లాడుతూ బాలకృష్ణ గారు, బోయపాటి గారితో పని చేయడం అద్భుత అనుభవమని తెలిపారు. 3D రేస్ రాజు మాట్లాడుతూ అఖండ 2 త్రీడీలో హిస్టారికల్ అవుతుందని, వరల్డ్ క్లాస్ విజువల్ ఎఫెక్ట్స్‌తో వస్తుందని చెప్పారు. ఎడిటర్ తమ్మి రాజు మాట్లాడుతూ అఖండ 2, అఖండ కంటే పదింతలు ఎక్కువ ఎనర్జీతో ఉంటుందని, ఇప్పుడు 3D అనుభూతి ప్రేక్షకులకు కొత్తగా, గ్రాండ్‌గా అనిపిస్తుందని అన్నారు.
‘అఖండ 2: తాండవం’ 2D మరియు 3D ఫార్మాట్లలో 2025 డిసెంబర్ 5న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదల కానుంది.