సినిమా వార్తలు

యష్ ‘టాక్సిక్’ పై రూమర్లను ఖండించిన టీం

Published by
Srinivas

రాకింగ్ స్టార్ యశ్’టాక్సిక్: ఎ ఫెయిరీటేల్ ఫర్ గ్రోన్-అప్స్’పై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. గీతూ మోహన్ దాస్ దర్శకత్వం వహిస్తున్నారు.

కాగా, ఇటీవల ఈ సినిమా విడుదల వాయిదా పడుతుందన్న వదంతులు పుట్టుకొచ్చాయి. ఇప్పుడు వార్తలపై స్పష్టత వచ్చింది. నిర్మాతలు సినిమా రిలీజ్ డేట్‌లో ఎలాంటి మార్పు లేదని, ముందుగా ప్రకటించినట్టే మార్చి 19, 2026న ప్రపంచవ్యాప్తంగా భారీ స్థాయిలో విడుదల కానుందని స్పష్టం చేశారు.

ప్రస్తుతం సినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులు వేగంగా కొనసాగుతున్నాయి. ఇప్పటికే ఏప్రిల్ నుండి VFX పనులు ప్రారంభమయ్యాయి. మరోవైపు యశ్ ముంబైలో “రామాయణ” చిత్ర షూటింగ్‌లో బిజీగా ఉన్నప్పటికీ, “టాక్సిక్” ప్రమోషనల్ వర్క్‌పై కూడా ఫోకస్‌ ఉంది. ఈ సినిమా ప్రమోషన్లు వచ్చే ఏడాది జనవరి నెలలో ప్రారంభం కానున్నట్లు సమాచారం.

తాజాగా చిత్రబృందం సోషల్ మీడియాలో “ఇంకా 140 రోజులు మాత్రమే మిగిలాయి!” అంటూ పోస్ట్ చేస్తూ, సినిమా మార్చి 19, 2026న రిలీజ్ అవుతుందనే విషయాన్ని మరోసారి ధృవీకరించారు.

‘టాక్సిక్’ చిత్రం గుడిపడ్వా, ఉగాది, ఈద్ వంటి ప్రధాన పండుగల సమయంలో విడుదల కానుంది. ఈ ఫెస్టివ్ సీజన్ కారణంగా సినిమా బాక్సాఫీస్ వద్ద భారీ కలెక్షన్లు సాధించే అవకాశం ఉందని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.

ఈ చిత్రం ఇంగ్లీష్, కన్నడ భాషల్లో తెరకెక్కుతుండగా, హిందీ, తెలుగు, తమిళ, మలయాళ భాషల్లో కూడా డబ్ చేసి ఒకేసారి దేశవ్యాప్తంగా, అంతర్జాతీయంగా విడుదల కానుంది.

‘కేజీఎఫ్’ వంటి బ్లాక్‌బస్టర్‌ తర్వాత య‌ష్ నటిస్తున్న ఈ మాస్-మైండ్ థ్రిల్లర్‌పై ఫ్యాన్స్‌తో పాటు సినీప్రియులంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

హాలీవుడ్ స్థాయిలో రూపొందుతున్న ఈ ప్రాజెక్ట్‌ను కేవీఎన్ ప్రొడక్షన్స్, మాన్‌స్టర్ మైండ్ క్రియేషన్స్ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. నిర్మాతలుగా వెంకట్ కె. నారాయణ మరియు యశ్ వ్యవహరిస్తున్నారు.

Srinivas