Download App
Movie Poster

Hari Hara Veera Mallu

Cast: Agerwal, Bobby Deol, Nargis Fakhri, Nora Fatehi and Sathyaraj

Director: Krish Jagarlamudi & Jyothi Krishna

Music Director: M.M. Keeravani

Producer: A Dayakar Rao, AM Rathnam

Banner: Mega Surya Production

Release Date: July 24, 2025

హరిహర వీరమల్లు మూవీ రివ్యూ

Published జూలై 24, 2025 by Srinivas

హరిహర వీరమల్లు రివ్యూ: జయహో సేనాని… సనాతన ధర్మ రక్షక సేనాని

సనాతన ధర్మ రక్షణ కథాంశంగా మొఘల్ చక్రవర్తి ఔరంగజేబు కాలాన్ని నేపథ్యంగా తీసుకుని చేసిన సినిమా ‘హరిహర వీరమల్లు’. జనసేనాని, ఏపీ డిప్యూటీ సీఎం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కథానాయకుడిగా నటించిన చిత్రమిది. క్రిష్, జ్యోతికృష్ణ డైరెక్ట్ చేశారు. విడుదలకు ముందు అంచనాలు తక్కువ ఉన్నప్పటికీ… పవన్ కళ్యాణ్ ప్రచారంతో క్రేజ్ డబుల్, ట్రిపుల్ అయ్యింది. ఐదేళ్ల పాటు నిర్మాణంలో ఉన్న ఈ సినిమా ఎలా ఉందో సమీక్ష తెలుసుకోండి.

హరిహర వీరమల్లు రివ్యూ

కథ:

హరిహర వీరమల్లు (పవన్ కళ్యాణ్)ది అగ్రహారం. సనాతన ధర్మ రక్షణతో పాటు హైందవ వేద సంస్కృతి సంప్రదాయాలు – జ్ఞానాన్ని భావితరాలకు అందించడం లక్ష్యంగా జీవిస్తున్న వేదపండితుల సంరక్షణలో పెరుగుతాడు.

సనాతని అయిన వీరమల్లు వ్రజాల దొంగగా ఎలా మారాడు? బందరు పోర్టులో బ్రిటీషర్స్ దగ్గర వజ్రాలు కొట్టేయడం ద్వారా చిన్న దొర (సచిన్ ఖేడేకర్) దృష్టిలో పడటం నుంచి గోల్కొండ నవాబు దగ్గరకు చేరడం, అక్కడ నుంచి మొఘల్ చక్రవర్తి ఔరంగజేబు దగ్గర కోహినూర్ కొట్టేయడానికి వెళ్ళడం వరకు వీరమల్లు ఎటువంటి ప్రయాణం చేశాడు? అనేది సినిమా. పంచమి (నిధి అగర్వాల్)తో ప్రేమ కథ మధ్యలో ఆటవిడుపు.

హరిహర వీరమల్లు రివ్యూ

అగ్రహారం విడిచిన వీరమల్లు నిజంగా కోహినూర్ కోసం ఢిల్లీ ప్రయాణం చేశాడా? లేదంటే అతని అజెండా ఏమైనా ఉందా? అనేది సినిమాలో అసలు పాయింట్. 

విశ్లేషణ:

పవనం సర్వాంతర్యామి… విశాఖ వీరమల్లు వేడుకలో పవన్ కళ్యాణ్ తన గురించి చెప్పిన మాట. వీరమల్లులోనూ పవన్ సర్వాంతర్యామి. ప్రతి మాటలో, ప్రతి సన్నివేశంలో, ప్రతి పాటలో పవనిజం కనిపిస్తుంది. వినిపిస్తుంది. ప్రారంభం నుంచి ముగింపు వరకు పవన్ కళ్యాణ్ భుజాల మీద నడిచిన సినిమా ‘హరిహర వీరమల్లు’. శక్తికి మించి పవన్ కష్టపడిన సినిమా క్యారెక్టర్ వీరమల్లు.

వీరమల్లుది రాబిన్ హుడ్ తరహా క్యారెక్టర్ అన్నట్టు చూపించడం, వజ్రాల చోరీ వంటివి కథలో షుగర్ కోటింగ్ అంశాలు. వీరమల్లు జెండా, అజెండా సనాతన ధర్మ పరిరక్షణ. ఆ పాయింట్ వరకు చేరుకోవడం కోసం వజ్రాల చోరీని వాడుకున్నారు. పవన్ కొరియోగ్రఫీ చేసిన యాక్షన్ సీక్వెన్స్ సైతం సనాతన ధర్మ రక్షణ నేపథ్యంలో వస్తుంది. అసలు పాయింట్ చెప్పిన సన్నివేశాలు బావున్నాయి. పవన్ అభిమానులు – హిందుత్వ వాదులతో క్లాప్స్ కొట్టిస్తాయి. అక్కడ వరకు చేసిన ప్రయాణంలో ప్రథమార్థం బావుంది. ద్వితీయార్థం ప్రారంభంలో వీఎఫ్ఎక్స్ విసిగిస్తుంది. కథగా చూస్తే వీరమల్లులో లోపాలు ఏమీ లేవు. కథనం ఆకట్టుకునేలా లేదు. కానీ, కొన్ని సన్నివేశాలు బాలేదు.

హరిహర వీరమల్లు రివ్యూ

ప్రతి సినిమాకు క్లైమాక్స్ కీలకం. థియేటర్స్ నుంచి బయటకు వచ్చే ప్రేక్షకులకు లాంగ్ లాస్ట్ ఇంప్రెషన్ ఇస్తుంది. ఆ విషయంలో వీరమల్లు ఫెయిల్ అయ్యింది. ఫెంటాస్టిక్ ఫస్టాఫ్ తర్వాత డిజప్పాయింట్ చేసే సెకండాఫ్ ఆడియన్స్ మీద ఇంపాక్ట్ చూపిస్తుంది. గూస్ బంప్స్ తెప్పించిన ప్రీ క్లైమాక్స్ యాక్షన్ ఎపిసోడ్ తర్వాత సాదాసీదా వీఎఫ్ఎక్స్, క్లైమాక్స్ నిరాశకు గురి చేస్తుంది. విజువల్స్ – కథనంలో లోపాలను కీరవాణి నేపథ్య సంగీతం కవర్ చేసింది. సెకండాఫ్‌లో పదిహేను నిమిషాల పవన్ కొరియోగ్రఫీ యాక్షన్ సన్నివేశానికి ఆయన చేసిన ఆర్ఆర్ గూస్ బంప్స్ ఇస్తుంది. పాటలు బావున్నాయి. అందంగా చిత్రీకరించారు. సినిమాలో యాక్షన్ ఎపిసోడ్స్ అన్నీ బావున్నాయి. ఒక్క కొండ మీద సన్నివేశం తప్ప! ఇద్దరు దర్శకులు పని చేయడం వల్ల కథ – రచన – క్వాలిటీలో తేడాలు తెరపై స్పష్టంగా కనిపిస్తాయి.   

హరిహర వీరమల్లు రివ్యూ

వీరమల్లుగా పవన్ కళ్యాణ్ విశ్వరూపం చూపించారు. వెండితెరపై చాలా రోజుల తర్వాత ఆయన ఫుల్ యాక్షన్ చేశారు. పాటల్లో డ్యాన్స్ చేశారు. కొత్త లుక్కులో కనిపించారు. ప్రేక్షకులకు కొత్త పవనాన్ని చూపించారు. అన్నిటికీ మించి సనాతన ధర్మం గురించి చెప్పే సన్నివేశాల్లో పూనకం వచ్చినట్టు చేశారు. పవన్, నిధి మధ్య కెమిస్ట్రీ బావుంది. నిధి పాత్రకు ట్విస్ట్ ఇవ్వడం హైలైట్. బాబీ డియోల్ నిడివి తక్కువ. ఆయన్ను పూర్తిగా వాడుకోలేదు. నాజర్, సునీల్, సబ్బరాజు, రఘుబాబు కామెడీ కుదరలేదు. సత్యరాజ్ చక్కటి పాత్ర చేశారు.

హరిహర వీరమల్లు రివ్యూ

తీర్పు:

సనాతన ధర్మ పరిరక్షణ సేనానిగా జనసేనాని నటనకు జయహో అనాలి. సినిమా ప్రచారాన్ని మాత్రమే కాదు, సినిమానూ తన భుజాలపై మోశారు పవన్ కళ్యాణ్. ఓ కథగా మంచి అనుభూతి ఇస్తుంది, సనాతన ధర్మ కోణంలో చూస్తే! పాన్ ఇండియా ఫిలిమ్స్ ట్రెండ్‌లో చూస్తే వీఎఫ్ఎక్స్ బాలేదు. అది డిజప్పాయింట్ మూమెంట్. నాసిరకం విజువల్స్ మధ్యలోనూ పవర్ స్టార్ స్టామినా సినిమాను కాపాడింది. జై కొట్టేలా సనాతన ధర్మం చేస్తుంది. పవన్ కళ్యాణ్ కోసం సినిమాను చూడాలి, చూడొచ్చు కూడా!

Click here to Read Review in English

Rating: (2.75/5)

మరిన్ని వార్తలు

No categories found.