Download App
Movie Poster

Maremma

Cast: Maadhav Bhupathiraju (making his debut), Deepa Balu, and Vikas Vasishta

Director: Manchala Nagaraj

Music Director: Prasanth R. Vihari

Producer: Mayur Reddy Bandaru (Moksha Arts)

Release Date: September 11, 2026

మారెమ్మ మూవీ రివ్యూ

Published సెప్టెంబర్ 11, 2026 by Srinivas

మాస్ మహారాజ్ కుటుంబం నుంచి మాధవ్ భూపతిరాజు హీరోగా ఎంట్రీ ఇచ్చిన చిత్రం ‘మారెమ్మ’. అలాగే ‘హార్ట్ బీట్’ అనే వెబ్‌సిరీస్ బాగా ఫేమస్ అయిపోయిన దీపా బాలు తెలుగు తెరపై ఈ సినిమాతో ఎంట్రీ ఇచ్చింది. వీరిద్దరి కాంబోలో వచ్చిన ఈ సినిమాకు సంబంధించిన అప్‌డేట్స్ అన్నీ కూడా సినిమాపై అంచనాలను పెంచేవిగానే ఉన్నాయి. మరి సినిమా ఎలా ఉంది? తెలుసుకుందాం.

మారెమ్మ Movie Review

కథేంటంటే..

తెలంగాణ‌లోని మారుమూల ప్రాంతంలోని ఓ గ్రామమే మ‌హిషాపురం. ఆ ఊరికి చాలా కాలంగా ఓ క‌ట్టుబాటు ఉంటుంది. అదేంటంటే.. ప్రతి పదేళ్లకోసారి ఇక్కడ జాతర జరుగుతూ ఉంటుంది. ఊరు సుభిక్షంగా ఉండాలన్నా.. పంట‌లు బాగా పండాలన్నాఈ జాత‌ర‌లో అమ్మ‌వారికి ఓ దున్న‌పోతుని బ‌లి ఇవ్వాలి. అలా జాత‌ర‌లో బ‌లి ఇవ్వ‌డానికి మారి అనే ఓ దున్మ‌పోతుని పెంచుతారు. దానిని చూసుకొనే బాధ్య‌త క‌ర్ణ (మాధ‌వ్‌) పై ప‌డుతుంది. చిన్నప్పటి నుంచి మారిని పెంచడంతో అది అతని జీవితంలో భాగమవుతుంది. కర్ణ దానిని తోబుట్టువులా చూసుకుంటాడు. మహిషాపురంలో జాతర ప్రారంభమవతుంది. మారిని బలిచ్చే రోజు వస్తుంది. ఉన్నట్టుండి సడెన్‌గా మారి మాయమవుతుంది. దానిని మాయం చేసిందెవరు? మారి మయమైన తర్వాత ఊరిలో ఎలాంటి పరిణామాలు చోటు చేసుకున్నాయి? చిత్రంలో మంజు (దీపా బాలు) ,జ‌లంధ‌ర్ (వ‌శిష్ట వికాస్‌) పాత్రలేమిటి? వంటి విషయాలను సినిమా చూసి తెలుసుకోవాల్సిందే.

సినిమా ఎలా ఉందంటే..

వాస్తవానికి ఒక సినిమా అంటే కొన్ని జీవితాలు. హిట్టైనా.. ఫ్లాపైనా చాలా జీవితాలు ఇబ్బందుల్లో పడతాయి. ఆ స్పృహ దర్శకుడిలో ఉంటే సినిమా బాగానే ఉంటుంది. అలాంటి స్పృహ లేకుండా తీసిన చిత్రమే ఇది. తెలంగాణ కథలకు ‘బలగం’ తర్వాత ప్రేక్షకాదరణ బాగా ఉంది. మారెమ్మ కూడా తెలంగాణ మ‌ట్టివాస‌న న‌మ్ముకొన్న కథే. అందుకే ఈ చిత్రంలో తెలంగాణ ప్రజల న‌మ్మ‌కాలు, వాళ్ల ఆచారాలూ చూపిస్తూ దర్వకుడు కథను ప్రారంభించాడు. అది కూడా వృథా ప్రయాసే. ఏమాత్రం వర్కవుట్ కాలేదు. ఫస్ట్ హాఫ్ అంతా సాగదీతే. ఏఐ విజువల్స్, హీరో చిన్నప్పటి ఎపిసోడ్స్, లవ్ ట్రాక్‌లతో నడిపించారు. ఇంటర్వెల్‌కు ఓ ట్విస్ట్ ఇచ్చి..సెకండాఫ్ మొత్తాన్ని దున్నపోతు కోసం వెదికే సీన్లతో నడిపించారు. క్లైమాక్స్‌ను సైతం సింపుల్‌గా తేల్చేశారు. కనీసం నటీనటుల తెలంగాణ యాస సైతం సహజంగా అనిపించదు. ఈ కథలో ఎక్కడా కూడా జనానికి కనెక్ట్ అయ్యే సీన్సే లేవు. మనిషికి, పెట్స్‌కి మధ్య ఉండే బంధాన్ని చాలా ఎమోషనల్‌గా చూపించవచ్చు. ప్రేక్షకులు బాగా కనెక్ట్ అవుతారు కూడా. కానీ దానిని కూడా దర్శకుడు సరిగా వినియోగించుకోలేదు. హీరో, దున్నపోతు మధ్య బంధాన్ని మరింత బలంగా చూపించి ఉంటే ఫలితం వేరే లెవల్‌లో ఉండేది. ఏవీ సెట్ కాలేదు. ప్రతి సీన్ ప్రేక్షకులకు టార్చర్ అన్నట్టుగానే ఉంది. కనీసం విలన్‌ పాత్రను సైతం దర్శకుడు బలంగా రాసుకోలేదు. మొత్తంగా సినిమా ప్రేక్షకుల సహనానికి పరీక్ష.

ఎవరెలా నటించారంటే..

మాధవ్ భూపతిరాజుకు ఇది తొలి సినిమా అయినా కూడా బాగానే నటించాడు. యాక్షన్, ఎమోషనల్ సీన్లలో పర్వాలేదనిపించాడు. హీరోయిన్‌గా దీప బాలు బాగానే నటించింది. విలన్ పాత్రలో వికాస్ వశిష్ట, మనీష్ తమ పరిధిలో మంచి నటనను కనబరిచారు.

మారెమ్మ Movie Review

టెక్నికల్ పరంగా..

కథ.. దానిని ప్రెజెంట్ చేసిన విధానం అన్నీ మైనస్సే. మ్యూజిక్ పర్వాలేదనిపించింది. ఇప్పటికే ఈ చిత్రానికి సంబంధించిన ఓ పాట వైరల్ అవుతోంది. సినిమాటగ్రఫీ, ఎడిటింగ్ ఏమాత్రం సరిగా లేవు. పల్లెటూరి వాతావరణాన్ని ఎంత చక్కగా చూపించవచ్చు.. కానీ ఈ సినిమాలో అలాంటిదేం కనిపించదు. నిర్మాణ విలువలు కూడా అంతంత మాత్రమే.

ఫైనల్‌గా.. ‘మారెమ్మ’ ప్రేక్షకుల సహనానికి పరీక్షే

Rating: (1.75/5)

మరిన్ని వార్తలు

No categories found.