Download App

ఇరాన్ – ఇజ్రాయెల్ యుద్ధంతో రేవంత్ రెడ్డికి అదృష్టం…

మార్చి 22, 2026 By Suresh Thota
"మంచి కాలం వస్తే మట్టి లో మాణిక్యం కాలి కి తగులుతుంది అని " సామెత… ఇలా ఉంది రేవంత్ రెడ్డి అదృష్టం అంటున్నారు జనం. తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తరువాత రియల్ ఎస్టేట్ వ్యాపారం కొంత స్తబ్దుగా ఉన్న మాట వాస్తవమే… దీనికి రకరకాల...
ఇరాన్ - ఇజ్రాయెల్ యుద్ధంతో రేవంత్ రెడ్డికి అదృష్టం…

“మంచి కాలం వస్తే మట్టి లో మాణిక్యం కాలి కి తగులుతుంది అని ” సామెత… ఇలా ఉంది రేవంత్ రెడ్డి అదృష్టం అంటున్నారు జనం.

తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తరువాత రియల్ ఎస్టేట్ వ్యాపారం కొంత స్తబ్దుగా ఉన్న మాట వాస్తవమే… దీనికి రకరకాల కారణాలు ఉన్నాయి. అందులో అంతర్జాతీయంగా రష్యా, ఉక్రెయిన్ యుద్ధం, ఇజ్రాయిల్ మరియు గాజా మధ్య యుద్ధం, హమాస్ , హిజ్బుల్లా ఉగ్రవాదులతో ఇజ్రాయెల్ నిర్విరామంగా పోరాడుతూనే ఉంది…. ఇటువంటి పరిస్థితిల నేపద్యంలో అమెరికా లో ట్రంప్ రావడం ఇలా ప్రపంచంలో సంక్షోభాల మూలంగా భారత దేశంలో కూడా రియల్ ఎస్టేట్ పరిశ్రమ ఒడిదుడుకులకు గురైంది. తెలంగాణ లో “హైడ్రా” సంస్థ భూమి ని చెర బట్టిన అక్రమార్కుల పై కొరడా ఝులిపించడం తో కొంత స్తబ్ధత ఏర్పడింది.

ఇప్పుడు ఇరాన్ మరియు అమెరికా, ఇజ్రాయిల్ దేశాల మధ్య యుద్ధం నెలకొనడం తో…. ఇరాన్, ఇజ్రాయిల్ మీద దాడి చేస్తూ…. అమెరికా మీద దాడి చేసేంత క్షిపణి సామర్ధ్యం లేక ,గల్ఫ్ దేశాల మీద దాడి చేయడం మొదలుపెట్టింది. ఎందుకంటే ఖతర్, యూఏఈ, సౌదీ అరేబియా దేశాలు అమెరికా కు తమ దేశంలో రక్షణ స్థావరాలు ఏర్పాటు కు చోటు ఇవ్వడం తో ఈ ఉద్రిక్తత పరిస్థితులు కు కారణం అయ్యింది. ఇస్లామిక్ సమాజానికి తానే నిర్దేశకత్వం వహించాలని ఇరాన్, మరియు టర్కీ భావిస్తున్నాయి. కాని టర్కీ నాటో లో సభ్యత్వం కలిగి ఉండటం మూలంగా, దానికి అవకాశం లేదు. ఇరాన్ షియా ముస్లిం దేశం కావడం తో ఇరాన్ తో ఏ సున్నీ ముస్లిం దేశం అంటకాగడం లేదు.

ఈ పరిస్థితి వలన పెట్టుబడులకు స్వర్గధామంగా పిలవబడే గల్ఫ్ దేశాల్లో ఒకటైన, దుబాయ్ , ఖతర్ లాంటి దేశాలను ఇరాన్ టార్గెట్ చేయడం తో పెట్టుబడి దారులు ఆలోచనలో పడ్డారు. భారతదేశం లాంటి అభివృద్ధి చెందుతున్న, అనుకూలమైన మరియు రక్షణ పరంగా స్వేచ్చాయుత వాతావరణం కలిగిన దేశం ఎక్కడా కనపడకపోవడం భారత్ కు కలసి వచ్చే సదవకాశం. ఇది ప్రస్తుతం తెలంగాణ కు సువర్ణావకాశంగా మారేవిధంగా కనపడుతున్నది అని ఆర్థిక నిపుణులు అంటున్నారు.

గల్ఫ్ ప్రాంతంలో కొనసాగుతున్న యుద్ధ పరిస్థితులు ప్రపంచ ఆర్థిక వ్యవస్థను కుదిపేస్తున్న వేళ, దాని ప్రభావం భారత్‌పైన, ముఖ్యంగా తెలంగాణపై ఆసక్తికర మార్పులకు దారితీస్తోంది. ఇరాన్ మరియు అమెరికా, ఇజ్రాయిల్ ఉద్రిక్తతల నేపథ్యంలో గల్ఫ్ దేశాల్లో అనిశ్చితి పెరగడంతో అక్కడి ఎన్నారైలు తమ పెట్టుబడులను సురక్షిత ప్రాంతాలకు మళ్లించే దిశగా ఆలోచిస్తున్నారు. దీని మూలంగా హైదరాబాద్ రియల్ ఎస్టేట్ వ్యాపారం పుంజుకునే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయని రియల్ ఎస్టేట్ వ్యాపార నిపుణులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

ఈ నేపథ్యంలో హైదరాబాద్ నగరం లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి “ఫ్యూచర్ సిటీ” కి పెట్టుబడులు వరద ప్రవాహం లా వచ్చే అవకాశం ఉందంటున్నారు. ఈ సిటీ ప్రధాన పెట్టుబడి కేంద్రంగా మారుతోంది. గల్ఫ్ నుంచి వచ్చే డబ్బు, కొత్తగా పెట్టుబడులు పెట్టాలనే ఉత్సాహం, రియల్ ఎస్టేట్ రంగానికి కొత్త ఊపును తెస్తోంది. ముఖ్యంగా ఐటీ కారిడార్లు, గేటెడ్ కమ్యూనిటీలు, మధ్య తరగతి గృహ సముదాయపు ప్రాజెక్టులు ఎక్కువ ఆకర్షణగా మారుతున్నాయి.

ఈ పరిణామాలు తెలంగాణకు ఆర్థికంగా ఉపయోగపడే అవకాశం ఉందని నిపుణులు భావిస్తున్నారు. గృహ కొనుగోళ్లు పెరగడం ద్వారా రిజిస్ట్రేషన్లు పెరిగి, ప్రభుత్వ ఆదాయం కూడా పెరగవచ్చు. ఇదే సమయంలో, నిర్మాణ రంగం, ఉపాధి అవకాశాలు కూడా పెరిగే అవకాశముంది.

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న మూసీ పునరుజ్జీవ ప్రాజెక్టు, ఫ్యూచర్ సిటీ ప్రణాళికలు, మౌలిక సదుపాయాల అభివృద్ధి వంటి చర్యలు ఈ పెట్టుబడులను ఆకర్షించే దిశగా కీలకంగా మారుతున్నాయి. గల్ఫ్‌లోని అనిశ్చిత పరిస్థితులు తెలంగాణకు అనుకూల వాతావరణాన్ని సృష్టిస్తున్నాయని విశ్లేషకులు చెబుతున్నారు.

అయితే మరోవైపు కొన్ని సవాళ్లు కూడా కనిపిస్తున్నాయి. గల్ఫ్ నుంచి వచ్చే రెమిటెన్సులు తగ్గే అవకాశం, చమురు ధరల పెరుగుదల వల్ల నిర్మాణ ఖర్చులు పెరగడం వంటి అంశాలు మార్కెట్‌పై ప్రభావం చూపవచ్చు. అయినప్పటికీ, సరైన ప్రణాళికలు మరియు విధానాలతో ఈ పరిస్థితిని తెలంగాణ అభివృద్ధికి మలచుకోవచ్చు.

మొత్తానికి, గల్ఫ్ యుద్ధ పరిస్థితులు తెలంగాణకు సవాళ్లు మరియు అవకాశాలను తీసుకువచ్చినప్పటికీ, సరైన నాయకత్వం, సరైన వ్యూహంతో ఇవి రాష్ట్రానికి దీర్ఘకాలిక లాభాలను అందించే అవకాశంగా ఉంది.

ముగింపు: అదృష్టవంతుడ్ని పాడుచేసేవాడు…. దురదృష్టవంతుడు ను బాగు చేసేవాడు… ఉండడు…

ఇక్కడ రేవంత్ రెడ్డి అదృష్టవంతుడు.

Suresh Thota

సురేష్ తోట ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్. సినిమా, రాజకీయాలు మరియు సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక వ్యాసాలు రచించడం ఆయన ప్రత్యేకత. సమకాలీన పరిణామాలపై లోతైన అవగాహనతో, వాస్తవాధారిత దృక్కోణంలో పాఠకులకు స్పష్టమైన, సమగ్ర సమాచారాన్ని అందించడం ఆయన రచనా శైలిలో ప్రధాన లక్షణం.

View all posts

Trending Now

No trending articles in this category from the last 3 days.

Discover more from IndiaGlitz Telugu

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading