Download App

ఇండిగోది నిర్లక్ష్యమా… ధిక్కారమా…!

డిసెంబర్ 8, 2025 • By Rahul N
భారతదేశ విమానయాన రంగంలో ఎప్పుడూ కని, విని ఎరుగని సంక్షోభాన్ని దేశీయ విమానయాన ప్రయాణికులు ఎదుర్కొంటున్నారు. విమాన సర్వీసుల లో అంతరాయం కారణంగా… గత ఐదు రోజులుగా రమారమి 1200 సర్వీసులు రద్దు అయినట్లు గా సోషల్ మీడియా లోను, న్యూస్ చానల్స్ లోనూ, దినపత్రికల్లోనూ… హోరెత్తిపోతుంది. ఇంటర్...
ఇండిగోది నిర్లక్ష్యమా… ధిక్కారమా…!

భారతదేశ విమానయాన రంగంలో ఎప్పుడూ కని, విని ఎరుగని సంక్షోభాన్ని దేశీయ విమానయాన ప్రయాణికులు ఎదుర్కొంటున్నారు. విమాన సర్వీసుల లో అంతరాయం కారణంగా… గత ఐదు రోజులుగా రమారమి 1200 సర్వీసులు రద్దు అయినట్లు గా సోషల్ మీడియా లోను, న్యూస్ చానల్స్ లోనూ, దినపత్రికల్లోనూ… హోరెత్తిపోతుంది.

ఇంటర్ గ్లోబ్ ఎంటర్ ప్రైజెస్ కు చెందిన రాహుల్ భాటియా, అమెరికాకు చెందిన ప్రవాస భారతీయుడైన…. రాకేష్ ఎస్. గాంగ్వాల్ కలిసి 2006 లో ఇండిగో సంస్థను స్థాపించారు. ఈ సంస్థ త్వరితగతం గానే ఎదిగింది. మధ్య తరగతి ప్రజలను బాగా ఆకర్షించింది.

DGCA…. (FDTL) ఫ్లైట్ డ్యూటీ టైమ్ లిమిటేషన్ నియమ నిబంధనలు పాటించాలని ఒక సంవత్సరం ముందుగానే అందరికీ తెలియపరచింది.

ఫ్లైట్ డ్యూటీ టైమ్ లిమిటేషన్ (FDTL) నిబంధనలు ప్రకారం…. పైలట్లు ఎక్కువ టైం పనిచేయకుండా, వారికి తగినంత విశ్రాంతి ఇవ్వాలి అని వారికి ఇచ్చే విశ్రాంతి సమయాన్ని వారంలో 36 గంటల నుంచి 48 గంటలకు పెంచారు.

రాత్రి ఫ్లైట్లు, ల్యాండింగ్స్‌ను, వరుసగా లేకుండా రాత్రి డ్యూటీలు నియంత్రించారు. దీనిమూలంగా మరింత మంది పైలట్ లు కావలసి వచ్చారు. ఇండిగో అందుకు సరిపడ్డ పైలట్లును సిద్ధం చేసుకోలేదు, విమాన షెడ్యూల్స్ ను కూడా కొత్త రూల్స్‌కు తగినట్లుగా మార్చుకోలేదు.

పైలట్లు విశ్రాంతి కోసం సెలవులు పెట్టడంతో, తగినంత టెక్నికల్ సిబ్బంది లేక అవసరమైన సర్వీస్ ల సంఖ్య తగ్గిపోయింది. దీంతో విమాన సర్వీసులు తగ్గిపోయాయి. అందువల్ల ఎయిర్‌పోర్టుల్లో ప్రయాణికులు చాలా ఇబ్బందులకు గురవుతున్నారు. దేశం మొత్తం షాక్ కు గురైంది.

దీనితో పౌర విమాన మంత్రిత్వ శాఖ తో పాటు, హోం మంత్రిత్వ శాఖకూడా రంగంలోకి దిగింది. …. ప్రయాణికులు అసౌకర్యాని కి మరియు విధి నిర్వహణలో అలసత్వం తో వ్యవహరించినందుకు.. DGCA… ఇండిగో సీఈఓ పీటర్ ఎల్బర్స్ కు…. షోకాజ్ నోటీసులు జారీ చేసింది.

PMO కూడా రంగంలోకి దిగి ఒక ఉన్నత స్థాయి కమిటీని నియమించి 15 రోజుల్లో నివేదిక ఇమ్మని ఆదేశించింది. దీని వెనుక నిజంగా ఇవే కారణాల లేక ప్రభుత్వం నీ ఇరకాటంలో పెట్టేందుకు ఏమైనా విదేశీ కుట్ర లాంటింది ఏమైనా ఉందా.

ఇది నిర్లక్ష్యమా… లేక… ధిక్కారమా అని తేల్చేందుకు ఆ కోణంలో కూడా ఆలోచించాలి అని సోషల్ మీడియా లో పలువురు కోరుతున్నారు.

Trending Now

No trending articles in this category from the last 3 days.

Discover more from IndiaGlitz Telugu

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading