
ఇరాన్ మరియు అమెరికా, ఇజ్రాయిల్ మధ్య యుద్ధం వలన ప్రపంచ వ్యాప్తంగా డిజిటల్ వార్ భయాలు పెరుగుతున్నాయి. మధ్యప్రాచ్యంలో ఎడతెగని యుద్ధం వల్ల…. రోజు రోజుకు పెరుగుతున్న ఉద్రిక్తతలు ప్రపంచాన్ని మరోసారి డిజిటల్ యుద్ధ భయాల వైపు నెట్టుతున్నాయి. ఇరాన్‌తో పెరుగుతున్న ఘర్షణల నేపథ్యంలో మిలిటరీ యాక్షన్ గురించే చర్చ జరుగుతున్నప్పటికీ, ఇప్పుడే అసలు ముప్పు డిజిటల్ ప్రపంచానికే ఉండవచ్చని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఇది కేవలం భౌతిక యుద్ధం మాత్రమే కాకుండా, డిజిటల్ యుద్ధం వైపు మళ్లే ప్రమాదం ఉందని విశ్లేషణలు సూచిస్తున్నాయి.
డిజిటల్ వార్ అంటే… ఈ ఆధునిక కాలంలో ప్రతి దేశం టెక్నాలజీ మీద ఆధారపడుతున్నది పలు రకాలుగా, అన్ని దేశాలు కు ఇంటర్నెట్ సేవలు అందుబాటులోకి రావడం తో దీనిని అవకాశం గా తీసుకుని టెక్నాలజీని ఆయుధంగా ఉపయోగించి చేసే యుద్ధమే డిజిటల్ వార్. దీనిని సైనిక వ్యూహాలలో భాగమైన సైబర్ వార్ ఫేర్ (Cyber warfare) గా కూడా పరిగణిస్తారు.
ఈ యుద్ధం ముఖ్యంగా సైబర్ దాడుల రూపంలో ముఖ్య భూమిక పోషిస్తున్నాయి. ఇందులో
- కమ్యూనికేషన్ నెట్‌వర్క్స్‌ను దెబ్బ తీయడం.
- డేటా సిస్టమ్స్‌ను నిలిచిపోయేలా చేయడం.
- ఫేక్ సమాచారంతో ప్రజలను ఆందోళనకు గురి చేసి, వారిని ప్రభావితం చేయడం… వంటి చర్యలు చోటుచేసుకుంటాయి.
ఇక సముద్రపు కేబుల్స్ ఇవి ప్రపంచ డేటాను, సమాచార మార్పిడి ద్వారా… దేశాల మధ్య దూరాన్ని తగ్గించేశాయి. ప్రపంచంలో సుమారు 95% అంతర్జాతీయ డేటా ట్రాఫిక్ సముద్రపు అడుగున ఉన్న ఫైబర్ ఆప్టిక్ కేబుల్స్ ద్వారానే జరుగుతోంది. ముఖ్యంగా రెడ్ సీ, హార్ముజ్ జల సంధి, పర్షియన్ గల్ఫ్ (Red Sea, Strait of Hormuz, Persian Gulf) ప్రాంతాలు ఈ కనెక్టివిటీకి కీలక కేంద్రాలుగా ఉన్నాయి. యూరప్, ఆసియా, మధ్యప్రాచ్యం, భారత్ మధ్య డేటా రవాణా ప్రధానంగా ఈ మార్గాలపైనే ఆధారపడి ఉంటుంది.
గతంలో కొన్ని ఘటనలు జరిగినవి. 2024లో యెమెన్‌లోని హౌతీ దళాలు (Houthi movement) దాడుల సమయంలో కొన్ని సముద్ర గర్భ కేబుల్స్ దెబ్బతిన్నాయి. దీని వలన ఈస్ట్ ఆఫ్రికాలో ఇంటర్నెట్ వేగం తగ్గింది. బ్యాంకింగ్, క్లౌడ్ సేవలు స్లో అయ్యాయి, ఇంటర్నెట్ ట్రాఫిక్‌ను ఇతర మార్గాలకు మళ్లించాల్సి వచ్చింది. ఈ ఘటనలు డిజిటల్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ఎంత సున్నితంగా ఉంటాయో ప్రపంచానికి తెలియచెప్పాయి.
హర్ముజ్ జల సంధి లో ఇరాన్ సామర్థ్యం తక్కువగా చూడలేము. ఇరాన్ ప్రభావం వ్యూహాత్మకమైనది. ఇరాన్ వద్ద సముద్ర మరియు సైబర్ రంగాల్లో మంచి పట్టు, గణనీయమైన సామర్థ్యం ఉంది. ముఖ్యంగా ఇస్లామిక్ రెవల్యూషనరీ గార్డ్ కార్ప్స్ (IRGC) సముద్ర కార్యకలాపాల్లో కీలక పాత్ర పోషిస్తోంది. సీ మైన్స్ తో పాటు, డిజిటల్ వార్ కూడా ఏక కాలంలో ప్రారంభిస్తాం అనే కోణంలో ప్రకటనలు వెలువడుతున్నాయి. ఇవి అన్ని కలిసి ఇరాన్‌ను డిజిటల్ యుద్ధంలో ప్రభావవంతమైన దేశంగా నిలబెడుతున్నాయి.
ఈ కేబుల్ మార్గాలపై ఆధారపడే దేశాల్లో భారత్ కూడా ఒకటి. దాదాపు 4 బిలియన్ మంది ఈ కనెక్టివిటీ పై పరోక్షంగా ఆధారపడి ఉన్నారని అంచనా. సముద్ర గర్భ కేబుల్ దెబ్బతింటే పరిణామాలు చాలా దారుణంగా ఉంటాయి…. వీటిని సరిదిద్దడానికి ప్రత్యేక నౌకలతో మరమ్మత్తులు చేయాలి. వారాలు లేదా నెలలు పట్టే అవకాశం ఉంది. దీని వలన భారీ ఆర్థిక నష్టం, స్టాక్ మార్కెట్లు, బ్యాంకింగ్, UPI సేవలపై ప్రభావం, సోషల్ మీడియా, OTT, కమ్యూనికేషన్ అంతరాయం ఇంటర్నెట్ పూర్తిగా ఆగిపోకపోయినా, స్లోడౌన్ మూలంగా పనులు వేగవంతంగా జరగవు.
డిజిటల్ వార్ పర్యవసానాలు ఎలా ఉంటాయి అంటే…
బ్యాంకింగ్ సిస్టమ్స్ డౌన్ కావచ్చు, పవర్ గ్రిడ్ హ్యాకింగ్ వల్ల బ్లాకౌట్స్, హెల్త్ సిస్టమ్స్ కి ఆటంకాలు ఏర్పడతాయి. కమ్యూనికేషన్ వ్యవస్థలు నిలిచిపోవచ్చు, ఫేక్ న్యూస్ వల్ల ప్రజల్లో గందరగోళం పెరుగుతుంది. యుద్ధ ప్రాంతాల్లో కీలక డిజిటల్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ఉంది.
జియోపాలిటికల్ ఉద్రిక్తతలు పెరుగుతున్నాయి. దీని మూలంగా అధిక ప్రభావం నకు గురి అయ్యే పరిస్థితిగా మారుతోంది. ఇంతకుముందు యుద్ధం అంటే సరిహద్దుల్లో జరిగేది. ఇప్పుడు అలా కాదు. ఇది డిజిటల్ యుగంలో ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ యుద్ధం. మన రోజువారీ జీవితం లో UPI చెల్లింపులు, క్లౌడ్ డేటా, సోషల్ మీడియా అన్నీ సముద్రపు అడుగున ఉన్న సముద్రపు కేబుల్స్‌పై ఆధారపడి ఉన్నాయి.
ముగింపు: ప్రపంచ రాజకీయాలు ఇప్పుడు మన ఇంటి వైఫై స్పీడ్‌ను కూడా ప్రభావితం చేసే స్థాయికి చేరుకున్నాయి. యుద్ధంలో భారత్ పాల్గొనకపోయినా… దాని ప్రభావం మన మీద గాస్ రూపంలో చూపిస్తున్నది. చమురు లాంటి రంగాల్లో, భారత దేశంలో పటిష్టమైన నాయకత్వం వలన మన మీద యుద్ధ ప్రభావ ఫలితాలు తక్కువగా ఉన్నాయి.
