హైదరాబాద్ దేశ రెండవ రాజధాని కాబోతుందా…?
December 2, 2025 Published by Srinivas

హైదరాబాద్ మహానగరం లో 27 మున్సిపాలిటీలు కలపాలని నిర్దేశిస్తూ…. తెలంగాణ కేబినెట్ నిర్ణయించుకున్నది. ఎప్పటి నుండో (RRR) రీజనల్ రింగ్ రోడ్ పేరిట ప్లాన్స్ జరుగుతున్నాయి. భవిష్యత్ అవసరాలు తీర్చేటట్టుగా హైద్రాబాద్ మహానగరం రూపుదిద్దుకుంటోంది.
గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (GHMC) చుట్టూ ఉన్న మున్సిపాలిటీలు, కార్పొరేషన్ల విలీన ప్రక్రియలో భాగంగా సోమవారం ఆ ఫైల్ రాజభవన్ కి చేరుకుంది. విలీనానికి సంబంధించి కేబినెట్ ఆమోదించి పంపించిన ముసాయిదా ఆర్డినెన్స్‌కు రాష్ట్ర గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ ఆమోదం తెలిపారు. గవర్నర్ ఆమోదించిన ఫైల్ తిరిగి ప్రభుత్వం వద్దకు కూడా చేరింది. ఈ విలీన ప్రక్రియకు సంబంధించిన ఉత్తర్వులు ఏ క్షణమైనా గెజిట్ నోటిఫికేషన్ ద్వారా విడుదలయ్యే అవకాశం ఉందని ప్రభుత్వ వర్గాల సమాచారం. గెజిట్ విడుదలైన వెంటనే, ఈ 27 మున్సిపాలిటీలు జీహెచ్ఎంసీలో విలీనం అయినట్టే.
ఒకటి, రెండు నెలల్లో డివిజనల విభజన ప్రక్రియ పూర్తి కానున్నట్లు తెలుస్తోంది. దీనితో 2735 చ. కితో దేశంలోనే అతిపెద్ద నగరం గా ఆవిర్భవించబోతోంది హైదరాబాద్. దీనిని మూడు భాగాలుగా విభజించి…. మూడు నగరాలుగా చేస్తారని అంటున్నారు.
అందులో ఒక భాగాన్ని కేంద్ర పాలిత ప్రాంతం గా చేసి , దేశ రెండవ రాజధాని ని చేసే దిశ గా కేంద్ర ప్రభుత్వం సమాలోచనలు చేస్తున్నట్టుగా రహస్య వర్గాల బోగట్టా….? ఎందుకంటే దేశ రాజధాని ఢిల్లీ లో వాయు కాలుష్యం విపరీతంగా పెరిగిపోవడం…. మన శత్రు దేశాల సరిహద్దులకు దగ్గరగా ఉండటం…. మరికొన్ని ప్రభుత్వ అంతర్గత కారణాల రీత్యా కూడా కొన్ని సమాలోచనలు జరుగుతున్నాయట…!
దీనిలో భాగంగా ఒక నోట్ పైల్ తయారు అయినట్లుగా డిల్లీ రాజకీయ వర్గాల్లో పుకార్లు షికార్లు చేస్తున్నాయి. కాని తెలంగాణ రాష్ట్రంలో అత్యధిక ఆదాయం హైదరాబాద్ నగరం ద్వారా నే వస్తుంది. ఒక్క రంగారెడ్డి జిల్లాలోనే నెలకు 100 కోట్లు రిజిస్ట్రేషన్స్ ద్వారా వస్తుంది అని ఒక అంచనా…. ఇటువంటి ప్రతిపాదనలు తెలంగాణ ప్రభుత్వం అంగీకరిస్తుందా…. లేదా అన్నది వేచి చూడాల్సిందే.
ముందు జాగ్రత్త చర్యగా, అందులో భాగంగానే కొంతమంది ఉత్తర భారత దేశ నాయకులు కొందరు హైదరాబాద్ చుట్టుపక్కల భూములు కొనుగోలు చేస్తున్నారట…!
ఏది ఏమైనా భారతదేశంలో అత్యధిక వైశాల్యంతో మహానగరం ఉద్భవిస్తున్న హైదరాబాద్ నగరానికి స్వాగతం పలుకుదాం.
