సిడ్నీలో యూదులపై ఉగ్రవాదుల కాల్పులు
December 15, 2025 Published by Rahul N

ఆస్ట్రేలియా లో సిడ్నీ నగరం లోని బొండి బీచ్‌లో డిసెంబర్ 14, 2025న జరిగిన కాల్పుల ఘటన లో యూదులను లక్ష్యంగా చేసుకుని పాల్పడిన ఉగ్రవాద దాడి తో ప్రపంచం ఒక్కసారిగా ఉలిక్కిపడింది. యూదుల పండుగ “హనుక్కా” మొదలైన మొదటి రోజున “చానుకా బై ది సీ” కార్యక్రమంలో పాల్గొన్న వందలాది మంది యూదులపై కరడుగట్టిన ఉగ్రవాదులు గా మారిన తండ్రి-కొడుకులు దాడి చేశారు.
ఈ దాడిలో కనీసం 15 మంది మరణించగా, 38 మంది గాయపడ్డారు, వీరిలో ఇద్దరు పోలీసులు కూడా ఉన్నారు. దాడి చేసిన ఇద్దరు షూటర్లలో ఒకరిని పోలీసులు కాల్చి వేయగా, మరొకరుని ప్రాణాలతో పట్టుకున్నారు. వీరిని పాక్ జాతీయులు అంటున్నారు. ఇంకా నిర్ధారించలేదు. తండ్రి పేరు సాజిద్ అక్రమ్ (50 ఏళ్లు) మరియు కొడుకు పేరు నవీద్ అక్రమ్ (24 ఏళ్లు). తండ్రి 2015 నుండి ఆయుధ లైసెన్స్ కలిగి ఉన్నాడు. అదిగాక చాలా హాంటింగ్ క్లబ్ లలో మెంబర్ కూడా అని పోలీసులు తెలిపారు.
ప్రపంచం మొత్తం ఈ ఘటనను ఖండించింది.
ఇజ్రాయేల్ అధ్యక్షుడు ఇస్సాక్ హెర్జాగ్ ఈ దాడిని “యూదులపై క్రూరమైన దాడి”గా భావిస్తున్నామని, ఆస్ట్రేలియా ప్రభుత్వాన్ని యూదు సమాజానికి మరింత రక్షణ అందించాలని, యాంటీ-సెమిటిజమ్‌పై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నామన్నారు.
ప్రధాని బెంజమిన్ నెతన్యాహు ఆస్ట్రేలియా పాలస్తీనా ను గుర్తించడం వలన యాంటీ-సెమిటిజమ్ బాగా పెరిగిపోయింది అన్నారు.
ఈ సంఘటన వెనుక ఇరాన్ ఉన్నదని కొన్ని నిఘా సంస్థలు అనుమానం వ్యక్తం చేస్తున్నాయి. ఇంకా నిర్ధారించబడలేదు. ఇదే నిజమైతే ప్రపంచ రాజకీయాలు ఒక్కసారిగా మారిపోతాయి. USA ఇజ్రాయెల్ కి తోడుగా నిలుస్తుంది అనడంలో సందేహం లేదు.
పాకిస్తాన్ జాతీయుడు అని దీని వెనుక పాకిస్తాన్ కి చెందిన ఏదైనా ఉగ్రసంస్థ ఉందని నిర్ధారణ జరిగితే పాకిస్తాన్ ను భారత్ తో కలసి భశ్మిపటలం చేసినా చేయొచ్చు… అమెరికా ఇరకాటంలో పడిపోతుంది. USA లో యూదు లాబీ చాలా బలంగా పని చేస్తుంది.
ఇజ్రాయేల్ ఎవరి మాట వినదు, ఒక వారంలో దీని పై మనకు ఒక అంచనా వస్తుంది అని సోషల్ మీడియాలో వార్తలు చక్కెర్లు కొడుతున్నాయి. ఎందుకంటే శత్రువుకి శత్రువు మన మిత్రుడు కదా…
