
తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో విజయ్ నేతృత్వంలోని TVK 108 స్థానాల్లో ఘనవిజయం సాధించి, సింగిల్ లార్జెస్ట్ పార్టీగా అవతరించిన విషయం విదితమే… కాని సోషల్ మీడియాలో నెటిజన్లు కొందరు… తమిళ విజయ్ ను, తెలుగులో పవన్ కళ్యాణ్ ను పోలుస్తూ, హోరెత్తిస్తున్నారు.
దక్షిణాది రాజకీయ చిత్రపటాన్ని మార్చేసిన ఈ ఇద్దరు మాస్ హీరోలు…. నేడు నేతలు గా ప్రజల నుండి విజయ హారతులు అందుకుంటున్నారు… “పవన్ కళ్యాణ్” మరియు “విజయ్”. ఆంధ్రప్రదేశ్‌లో పవన్ కళ్యాణ్ తన వ్యూహాలతో ప్రభంజనం సృష్టిస్తే, నిన్నటి తమిళనాడు ఎన్నికల ఫలితాల్లో విజయ్ తన ‘తమిళగ వెట్రి కళగం’ (TVK) పార్టీతో 107 స్థానాలను కైవసం చేసుకుని, ఆరు దశాబ్దాల ద్రవిడ రాజకీయాల గుత్తాధిపత్యాన్ని బద్దలు కొట్టారు. ఇద్దరూ వెండితెరపై ఎంతటి ప్రభంజనం సృష్టించారో, రాజకీయాల్లోనూ అంతకంటే పెద్ద “బ్లాక్ బస్టర్” విజయాలను నమోదు చేశారు.

వీరిద్దరి సినీ కెరీర్‌ను పోల్చి చూస్తే ఆసక్తికరమైన తేడాలు కనిపిస్తాయి. పవన్ కళ్యాణ్ తన కెరీర్ ఆరంభంలోనే “తొలిప్రేమ”, “తమ్ముడు”, “ఖుషి” వంటి చిత్రాలతో ట్రెండ్ సెట్టర్‌గా నిలిచి టాలీవుడ్ రికార్డులను తిరగరాసారు. పవన్ సినిమాలు కేవలం వసూళ్ల తో సంబంధం లేకుండా, ఆరాధనా పూర్వకమైన మాస్ ఇమేజ్ ను సంపాదించిపెట్టాయి. ముఖ్యంగా “గబ్బర్ సింగ్” ఆయన కెరీర్‌లోనే అతిపెద్ద కమర్షియల్ మైలురాయి. “అత్తారింటికి దారేది” చిత్రం రిలీజ్ కు ముందే నెట్ లో రిలీజ్ అయిన కూడా, అభిమానులు థియోటర్ లోనే చూసి తమ హీరో కు, అండగా నిలిచారు… ఎందుకంటే పవన్ కళ్యాణ్ కు ఉన్న ఇమేజ్ అటువంటిది. వ్యక్తిగతంగా ఆయన నీతి, నిజాయితీ , నిబద్ధత, ప్రేక్షకుల దృష్టి లో సినిమా ఇమేజ్ ను మించి ఉన్నది.
మరోవైపు విజయ్ ప్రయాణం కూడా నెమ్మదిగా మొదలై, పక్కా కమర్షియల్ ఇమేజ్ తో, “రజనీ కాంత్” లాంటి మాస్ క్రేజీ స్థాయి కి వెళ్లింది. “గిల్లి”, “పోకిరి” చిత్రాలతో మాస్ హీరోగా స్థిరపడిన విజయ్, ఇటీవలి “మెర్సల్”, “బిగిల్”, “లియో” వంటి చిత్రాలతో వందల కోట్ల క్లబ్‌లో చేరి, గ్లోబల్ మార్కెట్‌లో “పవన్ కళ్యాణ్” కంటే భారీ వసూళ్లను సాధించారు. పవన్ బాక్సాఫీస్ వద్ద తన మేనరిజంతో ప్రభావితం చేస్తే, విజయ్ తన డ్యాన్స్ మరియు పక్కా మాస్ ఎలిమెంట్స్‌తో తమిళనాడు లో సినీ రికార్డులు తిరగరాశారు.

రాజకీయంగా పవన్ కళ్యాణ్ ఎంచుకున్న మార్గం చాలా భిన్నమైనది. 2014లో జనసేన పార్టీని స్థాపించినప్పటికీ, అప్పట్లో ఉన్న క్లిష్ట పరిస్థితుల దృష్ట్యా రాష్ట్ర ప్రయోజనాలే పరమావధిగా భావించి ఆయన ఎన్నికల్లో పోటీ చేయలేదు. కేవలం తన మద్దతు ద్వారా అధికార మార్పిడికి సహకరించారు. ఈ త్యాగం మరియు నిబద్ధత కారణంగా “ప్రధాని మోడీ” పార్లమెంట్ సభ్యులు సాక్షిగా ఆయనను తుఫాన్ తో పోల్చారు. పవన్ కళ్యాణ్ సేవలు, చర్యలు ప్రజల గుండెల్లో బలమైన నాయకుడిగా నిలబెట్టాయి. విజయ్ కూడా అదే స్థాయిలో పక్కా ప్రణాళికతో రంగంలోకి దిగి, మొదటి ప్రయత్నంలోనే ఏకంగా 108 స్థానాల్లో ఆధిక్యం ప్రదర్శించి తమిళనాడు రాజకీయాల్లో పెను సంచలనం సృష్టించారు.
పవన్ కళ్యాణ్ 2024 ఏపీ ఎన్నికల్లో 100% స్ట్రైక్ రేట్ (పోటీ చేసిన 21/21 అసెంబ్లీ, 2/2 పార్లమెంట్ స్థానాల్లో విజయం) సాధించి భారత రాజకీయాల్లోనే సరికొత్త రికార్డును నెలకొల్పారు. ఈ అద్భుతమైన స్ట్రైక్ రేట్ ఆయన రాజకీయ చాణక్యానికి నిదర్శనం. అదే స్ఫూర్తితో విజయ్ కూడా నిన్నటి ఫలితాల్లో తన సత్తా చాటారు. డీఎంకే, ఏఐఏడీఎంకే వంటి దిగ్గజ పార్టీలను కాదని 107 స్థానాల్లో విజయం సాధించడం విజయ్ సాధించిన అతిపెద్ద రాజకీయ విజయం. పవన్ ‘స్ట్రైక్ రేట్’ కింగ్ అయితే, విజయ్ తన తొలి సమరంలోనే “సింగిల్ లార్జెస్ట్ పార్టీ”గా నిలిచిన “మాస్ లీడర్” గా రాజకీయాలలో అవతరించారు.
మొత్తానికి, పవన్ కళ్యాణ్ ఆంధ్రప్రదేశ్‌లో తన పవర్‌ను నిరూపించుకోగా, విజయ్ తమిళ గడ్డపై తన ‘విజయ’ దుందుభిని మ్రోగించారు. పవన్ కళ్యాణ్ సుదీర్ఘ పోరాటం ద్వారా 100% విజయంతో కింగ్ మేకర్ స్థాయికి ఎదిగితే, విజయ్ మొదటి అడుగులోనే అతిపెద్ద పార్టీగా అవతరించి ముఖ్యమంత్రి పీఠం దిశగా అడుగులు వేస్తున్నారు. వీరిద్దరూ తమ తమ రాష్ట్రాల్లో సరికొత్త రాజకీయ శకాన్ని ప్రారంభించారనడంలో ఎటువంటి సందేహం లేదు.
ముగింపు: రాజకీయాలలో ఒక్కో రాష్ట్ర ప్రజలు ఒక్కో విధానం తో ఉంటారు. ఒకరినొకరితో సరిపోల్చరాదు. కాని వీళ్ళు ఇద్దరూ వెండితెర విజయ సారథులు కాబట్టి, సోషల్ మీడియాలో పిలుస్తున్నారు. ఆంధ్ర ప్రదేశ్, తమిళనాడు రాష్ట్రాల్లో ప్రజలు తెలివైన వారు… అందుకే వీళ్లని నాయకులుగా ఎంచుకున్నారు.
