సినిమా వార్తలు

అనిల్ రావిపూడి విడుదల చేయనున్న కార్తి ‘అన్నగారు వస్తారు’ టీజర్…

Published by
Srinivas

స్టార్ హీరో కార్తి ప్రధాన పాత్రలో నటిస్తున్న పాన్ ఇండియా యాక్షన్–కామెడీ “అన్నగారు వస్తారు” (తమిళం: “వా వాతియార్”) డిసెంబర్‌లో ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతోంది. స్టూడియో గ్రీన్ బ్యానర్‌పై కె.ఇ. జ్ఞానవేల్ రాజా నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని నలన్ కుమారస్వామి దర్శకత్వం వహిస్తున్నారు. కృతి శెట్టి హీరోయిన్‌గా నటిస్తుంది.

చిత్ర యూనిట్ ఈరోజు టీజర్ రిలీజ్ అనౌన్స్‌మెంట్‌ను అధికారికంగా ప్రకటించింది. నవంబర్ 28న సాయంత్రం 5:04 నిమిషాలకు బ్లాక్‌బస్టర్ డైరెక్టర్ అనిల్ రావిపూడి చేతుల మీదుగా “అన్నగారు వస్తారు” టీజర్ విడుదల కానుంది.

ఈ సినిమాలో కార్తి పవర్‌ఫుల్ పోలీస్ ఆఫీసర్‌గా కనిపించబోతున్నారు. ఇప్పటికే విడుదలైన ఫస్ట్ లుక్, పోస్టర్లు, టైటిల్‌తో సినిమా పాన్ ఇండియా స్థాయిలో భారీ బజ్ క్రియేట్ చేస్తోంది. కార్తి కెరీర్‌లో మరో బ్లాక్‌బస్టర్‌గా నిలుస్తుందనే అంచనాలు కూడా పెరుగుతున్నాయి.

Srinivas