K 4 ప్రయోగంతో… మేరా భారత్ మహాన్…
డిసెంబర్ 27, 2025 Published by Rahul N

K 4 SLBM పరీక్ష విజయవంతమైంది. భారత్ అణు జలాంతర్గామి నుండి ప్రయోగించే శ్రేణి లో ఇది కీలక పరీక్ష . K 4 అంటే “Kalam Series – Missile No.4” అని అర్థం… డా. ఏ.పీ.జే. అబ్దుల్ కలాం గౌరవార్థంగా భారత సబ్‌మరైన్ లాంచ్ మిస్సైల్ సిరీస్ కు “K-Series” అని పేరు పెట్టారు.
భారత్ ప్రయోగించిన K 4 పరీక్ష ద్వారా 3,500 కిలోమీటర్ల నుండి 4000 కిలోమీటర్ల వరకు దీని పరిధి లోకి వస్తుంది అని అంటున్నారు. DRDO మాత్రం 3500 వరకు అని చెబుతుంది. ఇంకా K 5, K 6 కూడా ప్రయోగాల దశలో ఉన్నాయని రక్షణ రంగ విశ్లేషకులు చెబుతున్నారు. ఇప్పుడు K 4 Submarine-Launched Ballistic Missile (SLBM) ను విజయవంతం అవడం తో ప్రపంచ దేశాల తో పాటు ముఖ్యంగా చైనా కు ఏమి చేయాలో అర్థంకాని పరిస్థితి లో ఉంది. చైనా మెయిన్ లాండ్ తో పాటు చైనా రాజధాని బీజింగ్ కూడా దీని పరిధిలోకి వస్తుంది.
భారత్ ఇప్పటివరకు NOTAM (Notice to Airmen) ని ప్రకటించి రెండు సార్లు వాయిదా వేసింది… ఎందుకంటే సముద్ర తీరంలో వాతావరణ పరిస్థితులు, విమాన ప్రయాణాలు, నౌక రవాణా, షిప్పింగ్ ట్రాఫిక్ తో పాటు శత్రు ఉపగ్రహాల వ్యవస్థ కి , శత్రు నౌకా దళం నిఘా వ్యవస్థ లు మనపై దృష్టి సారించకుండా, వాటికి దొరకకుండా చేయాలి. ఇతర ఏ దేశాల నౌకలు అయినా అంతర్జాతీయ నిబంధనలు ప్రకారం ఒకచోటనే స్థిరంగా ఉండకూడదు. తిరుగుతూ ఉండొచ్చు. ఒకచోటనే స్థిరంగా ఉంటే అంతర్జాతీయ నియమాలను ఉల్లంఘించినట్లు, వేరే దేశం పై నిఘా గా పరిగణిస్తారు. అందుకే భారత్ రెండు సార్లు వాయిదా వేసి మూడవ సారి తన ప్రయోగాన్ని దిగ్విజయం గా పూర్తి చేసింది. అందుకే రెండు సార్లు వాయిదా వేసి వాటిని అయోమయ స్థితిలోకి నెట్టివేసింది.
భారత్ K 4 వంటి అణు సామర్థ్యం ఉన్న వ్యూహాత్మక క్షిపణి పరీక్షల విషయంలో 100% భద్రత , విజయం లక్ష్యంగా జరిపారు. ఈ ప్రయోగం INS అరిహంత్ (Arihant) నుంచి భారత్ యొక్క సముద్రాధారిత అణు సామర్ధ్య వ్యవస్థ తో ప్రపంచంలో (Sea-based Nuclear Deterrent) అగ్ర రాజ్యాల తో సమాన స్థాయి కి చేరుకుంది. భూమి, ఆకాశం, సముద్రం నుండి అణు సామర్ధ్యం కలిగిన మిస్సైల్స్ ప్రయోగించగల వ్యవస్థ… ఆ సత్తా కలిగిఉంది.
ముఖ్య సాంకేతిక వివరాలు
K 4 శ్రేణి (Range) 3,500 కిమీ దూరం తో పాటు సుమారు 2,000 కిలోలు పెలోడ్ ని తీసుకెళ్ళగల సామర్ధ్యం దీని సొంతం. శత్రువు మొదటి అణు దాడి చేసినా, సముద్రంలో దాగి ఉన్న మన సబ్‌మరైన్ నుంచి… నిరోధించలేని ప్రతిదాడి చేయగల శక్తి భారత్‌కి ఉంది. దీని వలన ఏ దేశం అయినా ఒకటికి రెండుసార్లు ఆలోచించుకోవలసిందే….. ఎందుకంటే USA పెంటగాన్ రిపోర్ట్ ప్రకారం అరుణాచల ప్రదేశ్ విషయంలో భారత్ కు చైనా కు యుద్ధం జరిగే అవకాశం ఉంది అని USA రక్షణ రంగ నిపుణులు చెబుతున్నారు. ఈ ప్రయోగాల ఫలితం సందర్భంగా భారత దేశం గురించి పునరాలోచనలో పడొచ్చు చైనా.
అణు ఆధారిత సబ్‌మరైన్‌లు సముద్రంలో కనిపించకుండా కదలగలవు. అందువల్ల శత్రువు ముందుగా గుర్తించడం చాలా కష్టం. డీజిల్ మరియు ఎలెక్ట్రిక్ తో నడిచే సబ్ మెరైన్స్ ను ఇప్పుడు ఉన్న టెక్నాలజీ తో చాలా సులభంగా గుర్తించవచ్చు…. దాని నుండి వచ్చే పొగ, అది ప్రయాణిస్తున్న సమయంలో దాని కింద నుండి నీటి బుడగలు ఇలా రకరకాలుగా వీటిని గుర్తిస్తారు అని అంటున్నారు రక్షణ రంగ నిపుణులు.
మన దేశానికి ప్రస్తుతం రెండు అణు జలాంతర్గాములు ఉన్నాయి. అందులో INS Arihant, INS Arighat ఉండగా …. తొందరలోనే మూడవది కూడా భారత అమ్ములపొదలో చేరబోతుంది. న్యూక్లియర్ పవర్డ్ బాలిస్టిక్ మిసైల్ సబ్‌మరైన్ (SSBN). K-4 వంటి దీర్ఘశ్రేణి లు అందుబాటులోకి రావడం వల్ల…. భారత్ తన జలసరిహద్దులకు దూరంగా ఉండగానే వ్యూహాత్మక లక్ష్యాలను కవర్ చేయగలదు.
ఇది ఒక సాధారణ పరీక్ష కాదు. భారత్ అణు భద్రతా నిర్మాణంలో గొప్ప ముందడుగు….. K 4 రావడం తో జాతీయ భద్రతకు తిరుగులేని బలం…. వీటితో పాటు ఇప్పటి వరకు మనకు 17 సబ్ మెరైన్స్ ఉన్నాయి
