Download App

ఓటీటీలోకి విజయ్ ‘జన నాయకుడు’.. నాలుగు భాషల్లో స్ట్రీమింగ్‌కు రెడీ

ఆగస్ట్ 20, 2026 • By Srinivas
తమిళ స్టార్ హీరో విజయ్ నటించిన మోస్ట్ అవైటెడ్ మూవీ ‘జన నాయకుడు’ ఓటీటీ స్ట్రీమింగ్‌కు సిద్ధమైంది. హెచ్. వినోద్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ పొలిటికల్ యాక్షన్ డ్రామా జీ5లో ఆగస్టు 21 నుంచి స్ట్రీమింగ్ కానుంది. తమిళంతో పాటు తెలుగు, మలయాళం, కన్నడ భాషల్లోనూ ఈ సినిమా...
Jana Nayakudu Movie Review

తమిళ స్టార్ హీరో విజయ్ నటించిన మోస్ట్ అవైటెడ్ మూవీ ‘జన నాయకుడు’ ఓటీటీ స్ట్రీమింగ్‌కు సిద్ధమైంది. హెచ్. వినోద్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ పొలిటికల్ యాక్షన్ డ్రామా జీ5లో ఆగస్టు 21 నుంచి స్ట్రీమింగ్ కానుంది. తమిళంతో పాటు తెలుగు, మలయాళం, కన్నడ భాషల్లోనూ ఈ సినిమా అందుబాటులోకి రానుంది.

విజయ్ సినీ కెరీర్‌లో ‘జన నాయకుడు’కు ప్రత్యేక స్థానం ఉంది. రాజకీయాల్లోకి ప్రవేశించిన తర్వాత ఆయన నటించిన తొలి చిత్రంగా నిలిచిన ఈ సినిమా.. వెండితెరపై ఆయన చివరి చిత్రం కావడం విశేషం. దీంతో విజయ్ అభిమానులకు ఈ మూవీ మరింత ప్రత్యేకంగా మారింది. తమ అభిమాన హీరోను చివరిసారిగా వెండితెరపై చూసిన అభిమానులు.. ఇప్పుడు ఓటీటీలో మరోసారి ఈ సినిమాను వీక్షించేందుకు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

‘జన నాయకుడు’లో విజయ్ వెట్రి కొండన్ అనే మాజీ పోలీస్ అధికారిగా కనిపించారు. అవినీతి, అన్యాయానికి వ్యతిరేకంగా పోరాడే వ్యక్తిగా ఆయన పాత్ర సాగుతుంది. శక్తివంతమైన వ్యక్తులతో ఢీకొనే క్రమంలో వెట్రి కొండన్ ప్రజల కోసం నిలబడే నాయకుడిగా ఎలా ఎదిగాడనేది సినిమా కథాంశం. యాక్షన్‌తో పాటు కుటుంబ భావోద్వేగాలు, సామాజిక అంశాలు, రాజకీయ నేపథ్యాన్ని కలిపి దర్శకుడు హెచ్. వినోద్ ఈ చిత్రాన్ని తెరకెక్కించారు.

ఈ సినిమాలో విజయ్ సరసన పూజా హెగ్డే హీరోయిన్‌గా నటించారు. బాబీ డియోల్, మమితా బైజు, ప్రకాశ్ రాజ్, గౌతమ్ వాసుదేవ్ మీనన్, ప్రియమణి, నాజర్, నరేన్ తదితరులు కీలక పాత్రల్లో కనిపించారు.

విజయ్ అభిమానులను దృష్టిలో పెట్టుకుని సినిమాలో ఆయన ట్రేడ్‌మార్క్ మేనరిజమ్స్, మాస్ మూమెంట్స్, యాక్షన్ సన్నివేశాలు, ఎమోషనల్ సీన్స్‌కు ప్రాధాన్యత ఇచ్చారు. ముఖ్యంగా విజయ్ చివరి చిత్రం కావడంతో ఈ సినిమాకు ఆయన అభిమానుల్లో ప్రత్యేకమైన క్రేజ్ ఏర్పడింది.

జీ5 ప్రతినిధులు మాట్లాడుతూ.. ‘జన నాయకుడు’ విజయ్ అభిమానులకు ఎంతో భావోద్వేగ ప్రాధాన్యత కలిగిన చిత్రమని తెలిపారు. విజయ్ చివరి ఫీచర్ ఫిల్మ్ కావడంతో ఇది తమిళ సినిమాకు ఒక ప్రత్యేకమైన మైలురాయిగా నిలుస్తుందని పేర్కొన్నారు. యాక్షన్, ఎమోషన్, కుటుంబ విలువలు, సామాజిక అంశాలతో రూపొందిన ఈ సినిమా విజయ్‌కు సరైన వీడ్కోలుగా నిలుస్తుందని అన్నారు.

‘జన నాయకుడు’ ఆగస్టు 21 నుంచి జీ5లో ఎక్స్‌క్లూజివ్‌గా స్ట్రీమింగ్ కానుంది. తమిళంతో పాటు తెలుగు, మలయాళం, కన్నడ భాషల్లోనూ ఈ చిత్రం అందుబాటులోకి రానుంది. దీంతో విజయ్ అభిమానులు తమ అభిమాన హీరో చివరి చిత్రాన్ని మరోసారి ఓటీటీలో చూసే అవకాశం దక్కనుంది.

Srinivas

Srinivas is an entertainment journalist covering Telugu cinema, celebrity updates, movie reviews, and OTT news for over 9 years in IndiaGlitz.

View all posts

Trending Now

No trending articles in this category from the last 3 days.

Discover more from IndiaGlitz Telugu

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading