
మలయాళ స్టార్ హీరో పృథ్విరాజ్ సుకుమారన్ నటించిన తాజా క్రైమ్ థ్రిల్లర్ ‘ఐ, నోబడీ’ ఇప్పుడు ఓటీటీ బాట పట్టింది. థియేటర్లలో జూలై 9న విడుదలైన ఈ సినిమా మిక్స్‌డ్ టాక్‌ను సొంతం చేసుకుంది. అంచనాలకు తగ్గట్టుగా బాక్సాఫీస్ వద్ద ప్రభావం చూపలేకపోయిన ఈ మూవీ.. ఇప్పుడు డిజిటల్ రిలీజ్‌తో మరోసారి ప్రేక్షకుల ముందుకు రానుంది.
ఆగస్టు 25 నుంచి ‘ఐ, నోబడీ’ జియోహాట్‌స్టార్‌లో స్ట్రీమింగ్ కానుంది. ఈ విషయాన్ని సదరు ఓటీటీ సంస్థ అధికారికంగా ప్రకటించింది. థియేటర్లలో ఈ సినిమా మలయాళం, తెలుగు, తమిళ భాషల్లో విడుదలైంది. అయితే ఓటీటీలో ఏయే భాషల్లో అందుబాటులోకి రానుందనే పూర్తి వివరాలను మాత్రం ఇంకా వెల్లడించలేదు.
క్రైమ్ థ్రిల్లర్ నేపథ్యంలో తెరకెక్కిన ఈ చిత్రానికి నిసామ్ బషీర్ దర్శకత్వం వహించారు. ప్రిత్విరాజ్ సుకుమారన్, పార్వతి తిరువోతు ప్రధాన పాత్రల్లో నటించగా.. హక్కీమ్ షాజహాన్, అశోకన్, విజయరాఘవన్, మధుపాల్, శంకర్ రామకృష్ణన్ కీలక పాత్రల్లో కనిపించారు.
సుప్రియా మీనన్, ముకేష్ ఆర్. మెహతా, సి.వి. శారథి ఈ చిత్రాన్ని నిర్మించారు. ప్రిత్విరాజ్ సుకుమారన్ కో-ప్రొడ్యూసర్‌గా వ్యవహరించారు. జేక్స్ బిజోయ్ సంగీతం అందించగా.. దినేశ్ పురుషోత్తమన్ సినిమాటోగ్రఫీ బాధ్యతలు చేపట్టారు.
థియేటర్లలో మిక్స్‌డ్ రెస్పాన్స్ అందుకున్న ‘ఐ, నోబడీ’కి ఓటీటీ రిలీజ్ కొత్త ఆడియన్స్‌ను చేరుకునే అవకాశం కల్పించనుంది. ముఖ్యంగా క్రైమ్ థ్రిల్లర్ సినిమాలను ఇష్టపడే ప్రేక్షకుల్లో ఈ చిత్రం ఎలాంటి స్పందన తెచ్చుకుంటుందనేది ఆసక్తికరంగా మారింది.
పృథ్విరాజ్ సుకుమారన్ అభిమానులు ఈ క్రైమ్ థ్రిల్లర్‌ను ఆగస్టు 25 నుంచి జియోహాట్‌స్టార్‌లో చూడొచ్చు.
