ఓటిటి న్యూస్

రవితేజ ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్

Published by
Srinivas

మాస్ మహారాజా రవితేజ నటించిన రీసెంట్ బ్లాక్‌బస్టర్ చిత్రం ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ ఇప్పుడు డిజిటల్ ప్రీమియర్‌కు సిద్ధమైంది. కిషోర్ తిరుమల దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రాన్ని ఎస్ఎల్‌వీ సినిమాస్ పతాకంపై సుధాకర్ చెరుకూరి నిర్మించారు. ఈ సినిమాలో రవితేజ, ఆషికా రంగనాథ్, డింపుల్ హయతి ప్రధాన పాత్రల్లో నటించారు.

కామెడీతో పాటు గుండెల్ని తాకే ఎమోషన్స్‌ను మేళవిస్తూ కిషోర్ తిరుమల ఈ కథను ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చారు. సంక్రాంతి సందర్భంగా విడుదలైన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని సాధించి ప్రేక్షకుల ప్రశంసలు అందుకుంది. కుటుంబ ప్రేక్షకులను ఆకట్టుకున్న ఈ ఎంటర్టైనర్ ఇప్పుడు ఓటీటీ ప్రేక్షకులను అలరించడానికి సిద్ధమవుతోంది.

ఈ సినిమా డిజిటల్ రిలీజ్ గురించి రవితేజ మాట్లాడుతూ, “ఈ సినిమాలో హాస్యంతో నిండిన ప్రత్యేకమైన భావోద్వేగం ఉంటుంది. కిషోర్ తిరుమల దీనిని ఎంతో వినోదాత్మకంగా, అందరికీ నచ్చే విధంగా తెరకెక్కించారు. దక్షిణాది ప్రేక్షకులు తమ తమ భాషల్లో ఈ సినిమాను అనుభవించేలా జీ5లో విడుదలవుతున్నందుకు చాలా ఆనందంగా ఉంది” అని తెలిపారు.

ఆషికా రంగనాథ్ మాట్లాడుతూ, “నా పాత్రతో మహిళలు చాలా సులభంగా కనెక్ట్ అయ్యారు. పలు రకాల భావోద్వేగాలు, షేడ్స్ ఉన్న పాత్రగా ఇది నిలిచింది. ఇప్పుడు మా సినిమా డిజిటల్ రిలీజ్‌కు సిద్ధంగా ఉంది. ఓటీటీలో కూడా ప్రేక్షకులు మా సినిమాను ఆదరిస్తారని ఆశిస్తున్నాను” అని చెప్పారు.

డింపుల్ హయతి మాట్లాడుతూ, “ఈ సినిమా వినోదాత్మకంగా ఉండటంతో పాటు మంచి సందేశాన్ని కూడా అందిస్తుంది. మానవ సంబంధాలను చాలా సహజంగా చూపించారు. ప్రతి పాత్రకు ఒక ప్రత్యేకత ఉంది. ఓటీటీలో కూడా ప్రేక్షకులు మా సినిమాను ఆదరిస్తారని ఆశిస్తున్నాను” అని అన్నారు.

కుటుంబ సమేతంగా అందరూ కలిసి చూడదగ్గ ఈ ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ చిత్రం మార్చి 13 నుంచి ZEE5లో తెలుగు, తమిళం, కన్నడ, మలయాళ భాషల్లో స్ట్రీమింగ్ కానుంది.

Srinivas

Srinivas is an entertainment journalist covering Telugu cinema, celebrity updates, movie reviews, and OTT news for over 9 years in IndiaGlitz.