
వెర్సటైల్ హీరో తిరువీర్, టీనా శ్రావ్య జంటగా నవంబర్ 7న విడుదలైన ‘ది గ్రేట్ ప్రీ-వెడ్డింగ్ షో’ ప్రేక్షకులను అలరిస్తోంది. సందీప్ అగరం, అష్మిత రెడ్డి సంయుక్తంగా 7PM ప్రొడక్షన్స్, పప్పెట్ షో ప్రొడక్షన్స్ బ్యానర్లపై నిర్మించిన ఈ చిత్రానికి రాహుల్ శ్రీనివాస్ దర్శకత్వం వహించారు. కల్పనా రావు సహ నిర్మాతగా వ్యవహరించారు.
విడుదలైన తొలి రోజునుంచే ఈ సినిమా సూపర్ హిట్ టాక్‌తో దూసుకుపోతోంది. లిమిటెడ్ బడ్జెట్‌లో, పరిమిత స్క్రీన్స్‌లో విడుదలైనప్పటికీ, ప్రేక్షకుల నుండి అద్భుతమైన స్పందన దక్కించుకుంది. తొలి మూడు రోజుల్లోనే రూ.2.22 కోట్ల వసూళ్లు సాధించడం ఈ చిత్రానికి పెద్ద విజయంగా నిలిచింది.
ప్రేక్షకులు, సినీ విమర్శకులు, మీడియా ప్రతినిధులంతా ఈ సినిమాపై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. మంచి కంటెంట్ ఉన్న సినిమాలను తెలుగు ప్రేక్షకులు ఎప్పుడూ ప్రోత్సహిస్తారనే విషయాన్ని ‘ది గ్రేట్ ప్రీ-వెడ్డింగ్ షో’ మళ్లీ నిరూపించింది.

గ్రామీణ నేపథ్యంతో రూపొందిన ఈ చిత్రం పూర్తిగా ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా నిలిచింది. ఓ ప్రీ-వెడ్డింగ్ ఫోటోషూట్ వల్ల కలిగే గందరగోళం చుట్టూ తిరిగే కథ ప్రేక్షకులను పగలబరుస్తోంది. ఫోటోగ్రాఫర్ రమేష్ పాత్రలో తిరువీర్ ఆకట్టుకున్నారు. సిట్యుయేషనల్ కామెడీ, ఎమోషనల్ టచ్‌ల మేళవింపుతో ఈ సినిమా అన్ని వర్గాల ప్రేక్షకులను థియేటర్లకు రప్పిస్తోంది.
ప్రస్తుతం వసూళ్ల వేగం పెరుగుతుండటంతో, సినిమా స్క్రీన్స్ సంఖ్యను పెంచుతున్నారు. కంటెంట్ ఆధారంగా విజయం సాధించిన ‘ది గ్రేట్ ప్రీ-వెడ్డింగ్ షో’ ఈ ఏడాది చిన్న సినిమాల్లో బిగ్ హిట్‌గా నిలవనుంది.
