Download App

సూరంపల్లిలో సీఎం చంద్రబాబు పర్యటన… ‘అన్నదాత సుఖీభవ’ 3వ విడత నిధుల విడుదల

మార్చి 14, 2026 By Rahul N
ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు శుక్రవారం కృష్ణాజిల్లా గన్నవరం నియోజకవర్గం సూరంపల్లిలో పర్యటించారు. ఈ సందర్భంగా రాష్ట్రంలోని రైతులకు ‘అన్నదాత సుఖీభవ’ పథకం 3వ విడత నిధులను సూరంపల్లి నుంచే విడుదల చేశారు. పర్యటనలో భాగంగా సీఎం స్థానిక రైతులు సాగు చేస్తున్న పంటలను పరిశీలించారు. టమోటా, వంకాయ...
సూరంపల్లిలో సీఎం చంద్రబాబు పర్యటన… ‘అన్నదాత సుఖీభవ’ 3వ విడత నిధుల విడుదల

ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు శుక్రవారం కృష్ణాజిల్లా గన్నవరం నియోజకవర్గం సూరంపల్లిలో పర్యటించారు. ఈ సందర్భంగా రాష్ట్రంలోని రైతులకు ‘అన్నదాత సుఖీభవ’ పథకం 3వ విడత నిధులను సూరంపల్లి నుంచే విడుదల చేశారు.

పర్యటనలో భాగంగా సీఎం స్థానిక రైతులు సాగు చేస్తున్న పంటలను పరిశీలించారు. టమోటా, వంకాయ పంటలను సాగు చేస్తున్న తోట వడ్డీకాసులు కుటుంబ సభ్యులతో మాట్లాడి, పంట పరిస్థితులను తెలుసుకున్నారు. టమోటా తోటలోకి వెళ్లి పంటను పరిశీలించిన సీఎం, డ్రిప్ సిస్టమ్‌తో సాగు చేస్తున్న వంగ తోటను కూడా పరిశీలించారు. రెండెకరాల్లో వంగ పంట సాగు చేస్తున్నట్లు రైతు వడ్డీకాసులు సీఎంకు తెలిపారు. పంటకు అయ్యే పెట్టుబడి, వచ్చే దిగుబడి గురించి రైతు దంపతులను అడిగి తెలుసుకున్నారు.

సూరంపల్లిలో సీఎం చంద్రబాబు పర్యటన… ‘అన్నదాత సుఖీభవ’ 3వ విడత నిధుల విడుదల

అనంతరం యువ రైతు తుళిమిల్లి లక్ష్మణరావు వద్దకు వెళ్లి వ్యవసాయంలో డ్రోన్ వినియోగంపై వివరాలు తెలుసుకున్నారు. సాంప్రదాయ పద్ధతిలో చేసే పిచికారీకి, డ్రోన్‌తో స్ప్రే చేయడానికి మధ్య సమయం, శ్రమలో ఉన్న తేడాలను గురించి సీఎంతో చర్చించారు.

సూరంపల్లిలో సీఎం చంద్రబాబు పర్యటన… ‘అన్నదాత సుఖీభవ’ 3వ విడత నిధుల విడుదల

తరువాత సూరంపల్లిలో నిర్వహించిన ‘అన్నదాత సుఖీభవ’ ప్రజా వేదిక సభలో సీఎం చంద్రబాబు నాయుడు ప్రసంగించారు.

మరిన్ని వార్తలు

Discover more from IndiaGlitz Telugu

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading