
తమిళనాడు ఎన్నికల ప్రచారం ఊపు అందుకున్నది. నిన్న ఎన్నికల తేదీలు ఖరారు కావడం తో బీజేపీ, అన్నాడీఎంకే, డీఎంకే, టీవీకే కి చెందిన అగ్రనేతలు…. ఇంకా చిన్న, చిన్న పార్టీల నేతలు తో తమిళనాట ఎన్నికల ప్రచారం రసవత్తరంగా సాగుతున్నాది. కేంద్ర ఎన్నికల సంఘం ప్రకటించిన తేదీలు… కేరళ, అస్సాం, పుదుచ్చేరి, లో ఎన్నికల పోలింగ్ ఏప్రిల్ 9న, పశ్చిమబెంగాల్‌లో 294 సీట్లకు రెండు ఫేజ్‌లలో అనగా ఏప్రిల్ 23, మరియు 29 వ తేదీన ఎన్నికల తేదీలు ప్రకటించగా, తమిళనాడులో మాత్రం 234 సీట్లకు జరిగే ఎన్నికలను ఒకే ఫేజ్‌లో ఏప్రిల్ 23న పోలింగ్ అని ప్రకటించారు.
తమిళనాడు ఎన్నికల వాతావరణం ఉత్కంఠభరితంగా, ఉద్వేగభరితంగా ఉంది. డీఎంకే అధికారంలో ఉండటం, క్షేత్ర స్థాయిలో బలమైన కార్యవర్గం కలిగి ఉండటం ఈ పార్టీకి కలసి వచ్చే అవకాశం ఉందని రాజకీయ విశ్లేషకులు విశ్లేషిస్తునే… ప్రభుత్వ వ్యతిరేక ఓటు బలంగా ఉందని కూడా అంటున్నారు…. విపక్షాలు సరిగ్గా వినియోగించుకోకపోతే… అది డీఎంకే కి కలసి వచ్చే అవకాశం అని అంటున్నారు. ఇప్పుడు స్టాలిన్ కు పార్టీ లో ఎదురు లేకుండా ఉండటం…. పార్టీ లో సీనియర్ నాయకులు సైతం స్టాలిన్ కు తమ సపోర్ట్ ఇవ్వడం తో చాలా బలంగా ఉంది… ఆర్థికంగా కూడా….
ఇక అన్నాడీఎంకే కు EPS నేతృత్వంలో కుల రాజకీయాలు (ముఖ్యంగా గౌండర్) పార్టీ ఓటు బేస్‌ను బలహీనపరుస్తున్నాయి అంటున్నారు. జయలలితా మరణం తర్వాత EPS గౌండర్ కమ్యూనిటీ ఫేస్‌గా మారిపోయారు అనే అపప్రద ఎక్కువగా వినిపిస్తుంది, కొంగు ప్రాంతం (కోయంబత్తూర్, ఈరోడ్)లో గౌండర్లు AIADMKకు సంపూర్ణ మద్దతు ఇస్తున్నారు, కానీ మిగతా కులాలు దూరం జరుగుతున్నాయి అనే వాదన బలంగా వినిపిస్తుంది. OPS కూడా డీఎంకే లో చేరడం తో EPS కు ఎదురు లేకుండా పోయింది… పార్టీ మీద పూర్తి పట్టు సాధించారు. బీజేపీ తో పొత్తు పెట్టుకుని అందరికంటే ముందుగా…. తన రాజకీయ చాణిక్యాన్ని ప్రకటించి అందర్నీ ఆశ్చర్యచకితులను చేశారు.
ఇక బీజేపీ అన్నామలై ను రాష్ట్ర అధ్యక్ష పదవి నుండి తప్పించారు. దీని మూలంగా బీజేపీ శ్రేణులు కొంతకాలంగా స్తబ్దుగా ఉన్నాయని అంటున్నారు. అన్నాడీఎంకే పొత్తు పెట్టుకోవడం ద్వారా బీజేపీ శ్రేణులు నూతనోత్సాహం తో ముందుకు సాగుతున్నాయి. టీవీకే తో పొత్తుకు ప్రయత్నిస్తుంది బీజేపీ అంటున్నారు కాని అవి ఎక్కడా నిర్ధారణ కాలేదు.
ఇక టీవీకే పార్టీ దళపతి విజయ్ పరిస్థితి కొంత సంకట స్థితిని ఎదుర్కొంటుంది అని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. దానికి తగ్గట్టుగా కరూర్ ర్యాలీ లో 39 మంది చనిపోగా, 100 మందికి పైగా గాయపడ్డారు. పార్టీ కోవర్టుల తో తల్లడిల్లిపోతుండగా…. ఇప్పుడు భార్య సంగీత విడాకులకు న్యాయ స్థానం ను ఆశ్రయించడం తో ఏ మేరకు విజయ్ విజయం సాధిస్తారో చూడాలి. ఐటీ విభాగం మాత్రం చాలా స్ట్రాంగ్ గా పని చేస్తుంది. ఇంతేకాకుండా తమిళనాట క్రిస్టియన్ ఓటింగ్ చాలా బలంగా నిలవబోతుంది విజయ్ కి, చర్చ్ ఫాదర్స్ విజయ్ కి సపోర్ట్ గా ఉన్నారని కొన్ని నివేదికలు తెలుపుతున్నాయి. విజయ్ అందరితో కలవకుండా, పాస్ ల మీద “క్యూఆర్” కోడ్ ను ముద్రించి వాటిని కేటాయించిన వాళ్లనే కలుస్తున్నారని దీని మూలంగా అందరూ కలవలేకపోతున్నారని, ఇది పార్టీ కి తెలిసే లోపు చాలా నష్టం చేకూరుస్తుంది అని అంటున్నారు. ఇక తన కుటుంబ సమస్య పెద్ద సమస్య కాదు అని, మొన్న జరిగిన మహిళా దినోత్సవ సభలో ఆయన ఈ విధంగా అన్నారు. “ఇటీవల కొన్ని సమస్యలు వస్తున్నాయి, అవి పట్టించుకోదగ్గవి కావు” అని అనడం కూడా వివాదానికి దారితీసింది. తన 25 ఏళ్ల వైవాహిక బంధం గురించి అలా మాట్లాడటం సరికాదు. ఆయన భార్య కూడా అభిమానిగా వచ్చి ఆరాధించి పెళ్లి చేసుకున్న వ్యక్తి అని ఆవిడను అలా మాట్లాడటం ఒక రకంగా అభిమానులను కించపరచడమే అని సోషల్ మీడియాలో నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు. ఇటువంటి సమయంలో అభిమానం ఓట్లుగా మారుతుందో లేదో వేచి చూడాల్సిందే అంటున్నారు.
ముగింపు…. ఇంకో నాలుగు రోజుల్లో పొత్తుల విషయంలో ఒక అవగాహన రావచ్చు అంటున్నారు…. అన్ని పార్టీల విషయంలో…. విజయ్ వల్ల NDA కూటమి కి లాభమా…. డీఎంకే కి లాభమా అన్నది వేచి చూడవలసిందే.
