సూపర్ సిక్స్‌లో మరో కీలక హామీకి సీఎం చంద్రబాబు ఆమోదం – రేపు ‘తల్లికి వందనం’ ప్రారంభం
ఆంధ్ర ప్రదేశ్
సూపర్ సిక్స్‌లో మరో కీలక హామీకి సీఎం చంద్రబాబు ఆమోదం – రేపు ‘తల్లికి వందనం’ ప్రారంభం
Published by
Rahul N
జూన్ 11, 2025 11:39 ఉద.
కూటమి ప్రభుత్వం ఏర్పడి ఏడాది పూర్తవుతున్న సందర్భంగా మరో ప్రధాన హామీ ‘తల్లికి వందనం’ పథకానికి సీఎం చంద్రబాబు నాయుడు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఈ పథకం ద్వారా లక్షలాది తల్లులకు ప్రత్యక్ష లబ్ధి చేకూరనుంది.
ముఖ్యాంశాలు:
రేపు అధికారికంగా ‘తల్లికి వందనం’ పథకం ప్రారంభం
మొత్తం 67 లక్షల తల్లుల ఖాతాల్లో రూ. 8,745 కోట్లు నేరుగా జమ చేయనున్న ప్రభుత్వం
ఈ పథకం 67,27,164 మంది విద్యార్థులను కవర్ చేయనుంది
ఒక తల్లి ఎంత మంది పిల్లలు ఉంటే, అంత మందికి లబ్ధి అందేలా పథకం అమలు
1వ తరగతి, ఇంటర్ ఫస్ట్ ఇయర్ విద్యార్థులకు కూడా వర్తింపు
అడ్మిషన్లు పూర్తయ్యాక, డేటా వచ్చిన వెంటనే తల్లుల ఖాతాల్లో నిధులు జమ
నేడు జీఓ విడుదల, విధివిధానాలు ఖరారు
ఇప్పటికే సూపర్ సిక్స్ హామీల్లో భాగంగా:
పింఛన్ల పెంపు
అన్నా క్యాంటీన్లు
మెగా డీఎస్సీ
దీపం-2 పథకం
వంటి హామీలను అమలు చేసిన ప్రభుత్వం, ఇప్పుడు తల్లికి వందనంను కూడా ఆ జాబితాలో చేర్చింది.