ఆంధ్ర ప్రదేశ్

లిక్కర్ కుంభకోణంలో కీలక మలుపు – భారీగా నగదు స్వాధీనం చేసుకున్న SIT

Published by
Rahul N

ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రాన్ని కుదిపేస్తున్న లిక్కర్ కుంభకోణం కేసులో కీలక మలుపు తిరిగింది. SIT అధికారులు ఈ రోజు తెల్లవారుజామున హైదరాబాద్ లో భారీ దాడులు నిర్వహించి భారీ మొత్తంలో నగదు స్వాధీనం చేసుకున్నారు.

కేసులో A–40 నిందితుడైన వరుణ్ ఇచ్చిన సమాచారంతో ఈ దాడులు జరిగినట్టు తెలుస్తోంది. దర్యాప్తు అధికారులు తెలిపిన ప్రకారం, కేసులో A–1 నిందితుడైన కేశిరెడ్డి రాజశేఖర్ రెడ్డి ఆదేశాల మేరకు వరుణ్, చాణక్య కలిసి 12 పెట్టెల్లో 11 కోట్ల రూపాయలు దాచినట్టు అంగీకరించారు.

ఈ నగదు 2024 జూన్ లో దాచినట్టు SIT అధికారులు వెల్లడించారు.

దాడులు శంషాబాద్ మండలంలోని కాచారం గ్రామంలో ఉన్న ఓ ఫార్మ్ హౌస్‌లో నిర్వహించగా, అక్కడి నుంచి మొత్తం 11 కోట్ల రూపాయల నగదు స్వాధీనం చేసినట్టు అధికారులు తెలిపారు. ఆ గెస్ట్ హౌస్ సులోచన ఫార్మ్స్ పేరుతో ఉండగా, ఇది ప్రొఫెసర్ తగల బాల్ రెడ్డి పేరుపై నమోదు అయినట్టు SIT దర్యాప్తులో బయటపడింది.

ఈ కేసులో ఇప్పటికే పలువురిపై SIT దర్యాప్తు కొనసాగుతోంది. భారీ నగదు స్వాధీనం కావడంతో ఈ కేసులో మరిన్ని సంచలన విషయాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉందని సమాచారం.

Rahul N