Download App

నకిలీ మద్యం కేసులో కొత్త మలుపు: A1 జనార్ధన్ – జోగి రమేష్ వాట్సప్ చాట్స్ లీక్

అక్టోబర్ 14, 2025 By Rahul N
నకిలీ మద్యం కేసు మరొక మలుపు తిరిగింది. పక్కా ఆధారాలుగా చూపదగ్గట్లు A1 జనార్ధన్, మాజీ మంత్రి జోగి రమేష్ మధ్య జరిగిన వాట్సాప్ చాట్ మెసేజ్‌లు బయటకు వచ్చాయి. ఈ చాట్స్ వెలుగు చూసిన తరువాత, నకిలీ మద్యం కేసు గురించి టిడిపి చెప్పినదే నిజమని తేలింది....
నకిలీ మద్యం కేసులో కొత్త మలుపు: A1 జనార్ధన్ - జోగి రమేష్ వాట్సప్ చాట్స్ లీక్

నకిలీ మద్యం కేసు మరొక మలుపు తిరిగింది. పక్కా ఆధారాలుగా చూపదగ్గట్లు A1 జనార్ధన్, మాజీ మంత్రి జోగి రమేష్ మధ్య జరిగిన వాట్సాప్ చాట్ మెసేజ్‌లు బయటకు వచ్చాయి. ఈ చాట్స్ వెలుగు చూసిన తరువాత, నకిలీ మద్యం కేసు గురించి టిడిపి చెప్పినదే నిజమని తేలింది.

జనార్ధన్ రావు ఇప్పటికే మాజీ మంత్రి జోగి రమేష్ ఆదేశాల మేరకు తను నకిలీ లిక్కర్ తయారీకి పాల్పడ్డానని బహిర్గతం చేశారు. ఇప్పుడు వాట్సప్ చాట్స్ బయటపడటంతో ఆ ఆరోపణలు మరింత బలపడ్డాయని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

“జోగి రమేష్ మాకు ‘లిక్కర్ తయారీ చెయ్యండి. సరైన సమయం చూసి, ఎవరూ లేనప్పుడు దానిని ప్రభుత్వం మీద రుద్దుదాం’ అని చెప్పారు. అంతేకాక, నీ ఆర్థిక ఇబ్బందులు పోతాయి, సహాయం చేస్తా అని నన్ను నమ్మించారు.” అని జనార్ధన్ రావు విచారణలో పేర్కొన్నారు.

తర్వాత జరిగిన సంఘటనలు మాత్రం మరో కుట్రకు సంకేతమిస్తున్నాయి. జోగి రమేష్ తన మనుషుల ద్వారా అధికారులకు సమాచారం ఇచ్చి, రైడ్ చేయించాడు. అదే సమయంలో సాక్షి మీడియా ముందుగానే అక్కడికి రావాలని ప్లాన్ చేసినట్లు జనార్ధన్ రావు బహిర్గతం చేశారు.

ఇప్పుడు వీరిద్దరి మధ్య జరిగిన వాట్సాప్ చాట్ లీక్ అవడంతో వైసీపీ దిక్కుతోచని స్థితిలో పడింది.

Discover more from IndiaGlitz Telugu

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading