Download App

ఢిల్లీ హైకోర్టులో సాక్షి మీడియాకు ఎదురుదెబ్బ… హెరిటేజ్ ఫుడ్స్ పిటిషన్‌పై కీలక ఆదేశాలు

ఫిబ్రవరి 20, 2026 By Rahul N
హెరిటేజ్ ఫుడ్స్‌పై ప్రసారమైన కథనాల విషయంలో సాక్షి మీడియాకు ఢిల్లీ హైకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. Heritage Foods దాఖలు చేసిన పిటిషన్‌పై విచారణ జరిపిన Delhi High Court, హెరిటేజ్‌పై నిరాధార మరియు అసత్య ఆరోపణలతో ప్రసారం చేసిన వార్తలను తక్షణం తొలగించాలని ఆదేశాలు జారీ చేసింది. హెరిటేజ్...
ఢిల్లీ హైకోర్టులో సాక్షి మీడియాకు ఎదురుదెబ్బ... హెరిటేజ్ ఫుడ్స్ పిటిషన్‌పై కీలక ఆదేశాలు

హెరిటేజ్ ఫుడ్స్‌పై ప్రసారమైన కథనాల విషయంలో సాక్షి మీడియాకు ఢిల్లీ హైకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. Heritage Foods దాఖలు చేసిన పిటిషన్‌పై విచారణ జరిపిన Delhi High Court, హెరిటేజ్‌పై నిరాధార మరియు అసత్య ఆరోపణలతో ప్రసారం చేసిన వార్తలను తక్షణం తొలగించాలని ఆదేశాలు జారీ చేసింది.

హెరిటేజ్ ఫుడ్స్‌కు ‘బోలేబాబా డెయిరీ’తో సంబంధం ఉందని పేర్కొంటూ Sakshi TV మరియు దాని డిజిటల్ వేదికల్లో ప్రసారమైన కథనాలు సంస్థ ప్రతిష్టకు భంగం కలిగించాయని హెరిటేజ్ ఫుడ్స్ కోర్టు దృష్టికి తీసుకెళ్లింది. ఈ నేపథ్యంలో, 24 గంటల్లో టెలికాస్ట్ చేసిన లింకులు, డిజిటల్ ప్లాట్‌ఫారమ్‌లలో ఉన్న అన్ని సంబంధిత కంటెంట్ తొలగించాలని కోర్టు స్పష్టం చేసింది.

అంతేకాకుండా, నిర్దిష్ట గడువులో లింకులు తొలగించకపోతే Google, Meta Platforms, YouTube వంటి డిజిటల్ ప్లాట్‌ఫారమ్‌లు తగిన చర్యలు తీసుకోవాలని కోర్టు సూచించింది. సాక్షి యాజమాన్యానికి నోటీసులు జారీ చేస్తూ తదుపరి విచారణ తేదీని ఖరారు చేసింది.

ఇక, తన ప్రతిష్టకు నష్టం వాటిల్లిందని పేర్కొంటూ హెరిటేజ్ ఫుడ్స్ రూ.100 కోట్ల పరువు నష్టం పిటిషన్‌ను కూడా దాఖలు చేసింది. ఈ కేసు రాజకీయ, మీడియా వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.

Discover more from IndiaGlitz Telugu

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading