
గత ప్రభుత్వాల కాలంలో పంచాయతీ రాజ్ శాఖ వ్యవస్థలో పేరుకుపోయిన అవకతవకలను, నిధుల దుర్వినియోగాన్ని అరికట్టేందుకు ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారు సాంకేతికతను ఒక శక్తివంతమైన ఆయుధంగా మలిచారు. క్షేత్రస్థాయిలో జరిగే ప్రతి పనిలోనూ పారదర్శకత ఉండాలన్న ఆయన పట్టుదల, నేడు ఆంధ్రప్రదేశ్ పంచాయతీ రాజ్ శాఖను దేశంలోనే అత్యంత విశ్వసనీయమైన శాఖగా తీర్చిదిద్దింది.
అవకతవకలకు అడ్డుకట్ట కోసం ముఖ ఆధారిత గుర్తింపు (Facial Recognition) ను జత చేయడం తో, గతంలో జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం వలన (NREGA) మస్టర్ల నమోదులో అనేక అక్రమాలు జరిగేవి. పనిచేయని వారికి కూడా వేతనాలు చెల్లించడం, తప్పుడు పేర్లతో నిధులు దారి మళ్లించడం వంటి సమస్యలకు శ్రీ పవన్ కళ్యాణ్ గారు శాశ్వత పరిష్కారం చూపారు. సాంకేతికత సాయంతో ముఖ ఆధారిత గుర్తింపు (Facial Recognition) ప్రక్రియను ప్రవేశపెట్టి, క్షేత్రస్థాయిలో పని చేసే వారు స్వయంగా హాజరైతేనే మస్టర్ నమోదయ్యేలా కఠిన నిబంధనలు అమలు చేశారు. దీనివల్ల వందల కోట్ల రూపాయల ప్రజా ధనం దుర్వినియోగం కాకుండా కాపాడగలిగారు. ఇప్పుడు “స్వర్ణ పంచాయత్” పోర్టల్ పారదర్శకతకు కేరాఫ్ అడ్రస్ గా నిలిచింది.
పంచాయతీల్లో జరిగే ప్రతి పైసా ఖర్చు ప్రజలకు తెలిసే విధంగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ “స్వర్ణ పంచాయత్” పోర్టల్‌ను బలోపేతం చేశారు. రికార్డు స్థాయిలో లావాదేవీలు జరిగాయి ఈ పోర్టల్ ద్వారా… ఏకంగా రూ. 1,000 కోట్ల ఆదాయపు పన్ను నగదు రహిత చెల్లింపులు (Digital Payments) జరగడం ఒక సంచలనం. చేతితో ఇచ్చే నగదు వల్ల జరిగే అక్రమాలకు తావులేకుండా, నేరుగా ఆన్‌లైన్ ద్వారానే లావాదేవీలు జరిగేలా చేసి వ్యవస్థను బలోపేతం చేశారు.
అవకతవకలు కేవలం టెక్నాలజీతోనే కాదు, పటిష్టమైన పర్యవేక్షణతోనే సాధ్యమని నమ్మిన ఆయన, పాలనా వ్యవస్థలో కీలక మార్పులు చేశారు.
13,350 పంచాయతీ లను స్వతంత్ర యూనిట్లు గా వికేంద్రీకరణ చేశారు. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ప్రతి పంచాయతీని ఒక స్వతంత్ర పాలనా యూనిట్‌గా తీర్చిదిద్ది, వాటికి పూర్తి జవాబుదారీతనాన్ని కల్పించారు. 77 కొత్త డీడీఓ (DDO) కార్యాలయాలు ఏర్పాటు చేసి పర్యవేక్షణను మరింత ముమ్మరం చేసేందుకు మరియు ప్రజలకు నాణ్యమైన సేవలను చేరువ చేసేందుకు నెలకొల్పారు. కొత్తగా నిర్మితమైన 77 డీడీఓ కార్యాలయాలను ఏర్పాటు వలన, క్షేత్రస్థాయి లో అధికారుల పనితీరుపై నిరంతర నిఘా ఉంచే అవకాశం ఉంటుంది. దాని మూలంగా జవాబుదారీతనం పెరుగుతుంది.
ముగింపు:
“నిజాయితీ గల పాలన పల్లె నుంచే మొదలవ్వాలి” అనే సంకల్పంతో శ్రీ పవన్ కళ్యాణ్ గారు చేసిన ఈ డిజిటల్ ప్రయోగాలు సత్ఫలితాలను ఇస్తున్నాయి. పాత కాలపు అవకతవకలకు స్వస్తి పలికి, సాంకేతికతను జోడించి పారదర్శకతను పెంచడం ద్వారా ఆంధ్రప్రదేశ్ పంచాయతీ రాజ్ శాఖను ఆయన అగ్రపథంలో నిలిపారు. నిధులు నేరుగా ప్రజలకే చెందేలా ఆయన చేస్తున్న కృషి నేడు పల్లెల్లో ‘సుపరిపాలన’కు అసలైన అర్థాన్ని ఇస్తోంది.
