Download App

విశ్వవిద్యాలయాల్లో రాజకీయాలకు అడ్డుకట్ట…

డిసెంబర్ 17, 2025 • By Rahul N
పశ్చిమ బెంగాల్ శాసనసభ రాష్ట్ర విశ్వవిద్యాలయాల్లో గవర్నర్ స్థానంలో ముఖ్యమంత్రి ని చాన్స్‌లర్‌గా నియమిస్తూ తీసుకున్న వివాదాస్పద బిల్లును రాష్ట్రపతి ద్రౌపతి ముర్ము అడ్డుకున్నారు. పశ్చిమ బెంగాల్ యూనివర్సిటీ లాస్ (అమెండ్‌మెంట్) బిల్ 2022, అలియా యూనివర్సిటీ (అమెండ్‌మెంట్) బిల్ 2022, వెస్ట్ బెంగాల్ యూనివర్సిటీ ఆఫ్ హెల్త్...
విశ్వవిద్యాలయాల్లో రాజకీయాలకు అడ్డుకట్ట…

పశ్చిమ బెంగాల్ శాసనసభ రాష్ట్ర విశ్వవిద్యాలయాల్లో గవర్నర్ స్థానంలో ముఖ్యమంత్రి ని చాన్స్‌లర్‌గా నియమిస్తూ తీసుకున్న వివాదాస్పద బిల్లును రాష్ట్రపతి ద్రౌపతి ముర్ము అడ్డుకున్నారు.

పశ్చిమ బెంగాల్ యూనివర్సిటీ లాస్ (అమెండ్‌మెంట్) బిల్ 2022, అలియా యూనివర్సిటీ (అమెండ్‌మెంట్) బిల్ 2022, వెస్ట్ బెంగాల్ యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్ (అమెండ్‌మెంట్) బిల్ 2022 లను, రాష్ట్ర సహాయం పొందే ఇతర విశ్వవిద్యాలయాల్లో కూడా గవర్నర్‌ను చాన్సలర్‌గా తొలగించి ముఖ్యమంత్రిని చాన్సలర్‌గా నియమించేలా 2022 జూన్‌లో రూపొందించిన ఈ బిల్లులను ఆ రాష్ట్ర అసెంబ్లీ ఆమోదించింది.

2024 ఏప్రిల్‌లో గవర్నర్ సి.వి. అనంద్ బోస్ ఈ బిల్లులను రాష్ట్రపతి భవన్ కి పంపారు. డిసెంబర్ 14, 2025 తారీఖున రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఈ మూడు బిల్లులకు ఆమోదం తెలుపకుండా అడ్డుకున్నారు.

రాష్ట్రపతి బిల్‌ను తిరస్కరించడం వలన చట్టంగా మారదు, రాష్ట్రానికి అమలు చేసే అధికారం ఉండదు అంటే గవర్నర్ నే చాన్స్‌లర్ అనే ప్రస్తుత వ్యవస్థ కొనసాగుతుంది

రాజ్యాంగ ప్రకారం :

రాష్ట్ర విశ్వవిద్యాలయాలులో రాజకీయ జోక్యం లేకుండా ఉండాలి అని, విద్యార్ధుల భవిష్యత్ కోసం ఆలోచింది ఆ అధికారాలను రాజ్యాంగ ప్రకారం గవర్నర్ ను చాన్స్‌లర్‌గా నియమిస్తూ ఆయనకే కేటాయించడం జరిగింది. తద్వారా అందరికి విద్య అనే ఫలాలు సమానం గా అందుతాయి.

ముఖ్యమంత్రి నేరుగా చాన్స్‌లర్ అయితే విద్యా వ్యవస్థ పూర్తిగా రాజకీయ నియంత్రణలోకి వెళ్లే ప్రమాదం ఉంది. విద్యా వ్యవస్థ లో నాణ్యత కొరవడుతుంది. డబ్బు, ఓట్లు , కులాల ఆధిక్యత దీని మూలం గా అసలుకే మోసం వచ్చి నాణ్యత, ప్రమాణాలు దిగజారిపోయి విద్యా వ్యవస్థ విచ్చిన్నమయ్యే అవకాశం ఎక్కువ.

ఇది ఆలోచించే రాజ్యాంగంలో గవర్నర్ కు ఇచ్చారు అధికారాలు…. అయినా కూడా అక్కడక్కడ కొంతమంది వల్ల కొన్ని యూనివర్సిటీలు కళంకం తెచ్చుకున్నాయి. ఇవి చూసి, తెలిసి కూడా మమత బెనర్జీ ప్రభుత్వం ఇటువంటి బిల్లును తీసుకురావడాన్ని ఏమనాలి… ఆవిడ ప్రభుత్వం ఓట్ల కోసం ఏ వ్యవస్థ నైనా దిగజార్చి తన స్వప్రయోజనం నెరవేర్చుకుంటుంది అని నెటిజన్లు సోషల్ మీడియాలో మండిపడుతున్నారు.

రాష్ట్రపతి నిర్ణయం వలన,యూనివర్సిటీల స్వతంత్రతకు రక్షణ, తో పాటు నియామకాల్లో రాజకీయ ప్రభావం ఉండదు. మరియు విద్యా వ్యవస్థ సమతుల్యత .

ఇది రాజ్యాంగ పరిమితులు ఎవరికైనా వర్తిస్తాయి అనే స్పష్టమైన సందేశం. రాష్ట్ర ప్రభుత్వం శాసనసభలో ఏదైనా బిల్లు పాస్ చేసినా రాజ్యాంగానికి వ్యతిరేకంగా ఉంటే గవర్నర్, రాష్ట్రపతి అమోదం ఉండదు. అని సూటిగా ఆయా రాష్ట్రాలను హెచ్చరించడం లాంటిదే.

ఇలాంటి బిల్లు ఒకటి తమిళనాడు ప్రభుత్వం చేసి పంపితే గవర్నరు, రాష్ట్రపతి ఎక్కువ రోజులు తమ వద్దనే ఉంచుకుంటున్నారు అని కోర్టు కు వెళ్ళింది. కోర్టు కూడా అత్యుత్సాహంతో గవర్నర్ మరియు రాష్ట్రపతి లకు కూడా సమయం ఉండాలని నిర్దేశించింది. తరువాత సుప్రీం కోర్టు ధర్మాసనం సమయ నిర్ధారణ గవర్నర్ ,రాష్ట్రపతి వ్యవస్థ లకు నిర్దేశించలేమని చెప్పింది.

విద్యా వ్యవస్థ రాజకీయ ప్రయోగశాల కాదు. భావి భారత పౌరుల బంగారు భవిష్యత్, తద్వారా దేశ భవిష్యత్తు.

ఏ దేశానికైనా ఆ దేశ రాజ్యాంగమే సుప్రీం… అలాగే నడుచుకోవాలి అని ప్రతి రాజకీయ నాయకుడుకి రాజ్యాంగం మీద అవగాహన సదస్సులు నిర్వహించాలని నేటి నెటిజన్లు కోరుతున్నారు.

మరిన్ని వార్తలు

Discover more from IndiaGlitz Telugu

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading