జాతీయం

తమిళనాడు ఫలితాల్లో… ‘విజయ్’ పతాకం

Published by
Suresh Thota

తమిళనాడు 2026 అసెంబ్లీ ఎన్నికల్లో తమిళగ వెట్రి కళగం (టీవీకే) అసాధారణ విజయం సాధించించి చరిత్ర సృష్టించింది. మే 4, 2026 లేటెస్ట్ ట్రెండ్‌ల ప్రకారం, 234 సీట్ల అసెంబ్లీలో టీవీకే 108 సీట్లతో స్పష్ట మెజారిటీ (118 సీట్లు) కి దగ్గరగా వచ్చారు. రాష్ట్రం లో అత్యధిక స్థానాలు సాధించిన పార్టీగా నిలిచింది.TVK 41% ఓటు శాతంతో ఆధిక్యంలో ముందుండగా, డీఎంకే 23% ఓట్లతో, 73 స్థానాలతో మూడో స్థానానికి దిగిపోయింది. ఏఐఏడీఎంకే 53 సీట్ల స్థాయిలో రెండో స్థానంలో ఉంది. ఈ ఫలితాలు 60 ఏళ్ల ద్రావిడ ఆధిపత్యానికి గొడ్డలిపెట్టు.

2024లో సూపర్‌స్టార్ విజయ్ స్థాపించిన టీవీకే, 2026లో 234 సీట్లకు ఒంటరిగా పోటీ చేస్తుంది అని చెప్పి మరీ పోటీ చేసింది. పార్టీ ముఖ్య వాగ్దానాలు యువత, మహిళలను ఆకర్షించాయి. మార్చి 17న ఒంటరి గానే పోటీ అని ప్రకటన చేసి డీఎంకే, ఏఐఏడీఎంకేతో పొత్తులు తిరస్కరించి అన్ని సీట్లకు క్యాండిడేట్లు ప్రకటించింది.

ఏప్రిల్ 23న రికార్డు స్థాయిలో 84% ఓటింగ్ శాతం నమోదు అయ్యింది. విజయ్ “యువత ఓటు హక్కును వినియోగించుకుని బాగా పాల్గొన్నారు” అని కొనియాడాడు. ఏప్రిల్ 29 న ఎగ్జిట్ పోల్స్ రిలీజ్ అయ్యి సంచలనం సృష్టించాయి. Axis My India 98-120, వస్తాయని అంచనా వేసింది. మిగతా సంస్థ ఏది కూడా సరిగా అంచనా వేయలేకపోయాయి. మే 1 వ తేదీన AIADMK అలయన్స్ ఆఫర్ ను టీవీకే తిరస్కరించింది.

మే 4 వ తేదీ ఎన్నికల ఫలితాలతో వేసవి లో పన్నీరు జల్లులు కురిసినట్టుగా, టీవీకేకు అభినందనల వెల్లువ లో తడిసి ముద్ద అయిపోతుంది. విజయ్ ఎన్నికల విజయం పెరంబూరు (55% ఓట్లు), తిరుచి ఈస్ట్ (52%)లో గెలుపు దిశగా సాగుతోంది.

“ఎంజీఆర్” తర్వాత సినిమా నేత గెలిచిన మొదటి సందర్భం గా తమిళ వార్తలు వెలువడుతున్నాయి. “టీవీకే” విజయం కొత్త యువ శక్తిగా ఎదిగింది. విజయ్ ముఖ్యమంత్రి అవకాశాలు పక్కా అయ్యాయి. దక్షిణాది రాజకీయాల్లో “విజయ్ మోడల్” ట్రెండ్ అవుతుందని నిపుణులు అంచనా.

ఈ విజయం తమిళనాడు పౌరుల అసంతృప్తి, మార్పు కు ప్రతిబింబం. టీవీకే పాలిటిక్స్ తమిళనాడు భవిష్యత్తును ఎలా నిర్దేశిస్తుంది అనేది వేచి చూడాలి.

Suresh Thota

సురేష్ తోట ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్. సినిమా, రాజకీయాలు మరియు సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక వ్యాసాలు రచించడం ఆయన ప్రత్యేకత. సమకాలీన పరిణామాలపై లోతైన అవగాహనతో, వాస్తవాధారిత దృక్కోణంలో పాఠకులకు స్పష్టమైన, సమగ్ర సమాచారాన్ని అందించడం ఆయన రచనా శైలిలో ప్రధాన లక్షణం.