Download App

నాలుగు సినిమాల మధ్య నలిగిన ‘మురారి’

జనవరి 26, 2026 By Suresh Thota
2026లో విడుదలైన సినిమాల్లో కంప్లీట్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ సినిమా. అడ్వెంచర్స్ ఇంటర్నేషనల్ ప్రైవేట్ లిమిటెడ్‌, ఎకె ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై రామబ్రహ్మం సుంకర నిరించిన ఈ సినిమాకు రామ్ అబ్బరాజు దర్శకత్వం వహించాడు. హీరో శర్వానంద్, సంయుక్త మీనన్, సాక్షి వైద్య ప్రధాన పాత్రల్లో నటించిన ఈ చిత్రం ప్రేక్షకుల...
నాలుగు సినిమాల మధ్య నలిగిన 'మురారి'

2026లో విడుదలైన సినిమాల్లో కంప్లీట్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ సినిమా. అడ్వెంచర్స్ ఇంటర్నేషనల్ ప్రైవేట్ లిమిటెడ్‌, ఎకె ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై రామబ్రహ్మం సుంకర నిరించిన ఈ సినిమాకు రామ్ అబ్బరాజు దర్శకత్వం వహించాడు. హీరో శర్వానంద్, సంయుక్త మీనన్, సాక్షి వైద్య ప్రధాన పాత్రల్లో నటించిన ఈ చిత్రం ప్రేక్షకుల ను నవ్వులతో ముంచేసింది.

సంక్రాంతి పండుగ సందర్భంగా సినిమా విడుదల చేస్తే… మనం సేఫ్ అన్న ఆలోచన తప్ప… వాళ్ళ సినిమా మీద నమ్మకం లేదు అనుకుంటా… లేకపోతే..అన్ని చిత్రాలు అంతంత మాత్రమే , పండుగ కలెక్షన్స్ అన్ని మనవే అని కూడా అనుకుని ఉండొచ్చు… “నారి నారి నడుము మురారి” నిర్మాత… ఏది ఏమైనా మంచి సినిమా… ఆశించిన స్థాయిలో ప్రయోజనం చేకూరలేదు. “నారి నారి నడుమ మురారి” పెద్ద ఫైనాన్షియల్ విజయం కాకపోయినా, సినిమా పరంగా ఆకట్టుకుంది… ఇది మంచి OTT లో గొప్ప విజయం సాధించి, ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది అని చెప్పుకోవచ్చు.

ఇక్కడ ఈ చిత్రానికి సంబంధించి పేరు రావడానికి ముఖ్య కారణం దర్శకుడు… రామ్ అబ్బరాజు.

వ్యక్తిగత అభిప్రాయం చెప్పాలంటే కథ పరంగా “నారి నారి నడుమ మురారి” సేఫ్ & ఫ్యామిలీ ఎంటర్టైనర్, అంతేకానీ అద్భుతమైన కొత్తదనం మాత్రం లేదు. ఒక వ్యక్తి ఇద్దరి మహిళల మధ్య చిక్కుకోవడం, పాత కాన్సెప్ట్ అయినా కుటుంబసభ్యులు అందరూ కలసి చూసేలా ఉన్న చిత్రం.. క్లీన్ కామెడీ, డబుల్ మీనింగ్ డైలాగ్స్ లేకుండా, సిట్యుయేషన్ ఆధారంగా నవ్విస్తుంది. రిలేషన్‌షిప్ డ్రామా… హీరో, హీరోయిన్స్ మధ్య ఈగోలు, అపార్థాలు సహజంగా చూపారు.

Nari Nari Naduma Murari Review

“రామ్ అబ్బరాజు” దర్శకత్వంలో వచ్చిన “సమాజవరగమనా” తరహా సంభాషణలు సహజం గా థియోటర్ లో నవ్వులు పూయించాయి. ఈ టైపు చిత్రాలు తెలుగు ప్రేక్షకులు ఎప్పటి నుండో చూస్తున్నవే… కొత్తదనం తో తెరకెక్కించారు అనలేము… కాని ఓకే…. సినిమా చూస్తుంటే కథను ముందుగానే ఊహించవచ్చు. ఇలా జరుగుతుంది అని…. కొన్ని చోట్ల సీన్స్ ట్రిమ్ చేసుంటే బాగుండేది అనిపిస్తుంది. హీరో ఎదుర్కొనే సమస్యలు చాలా సేఫ్‌గా ఉండేలా తీర్చిదిద్దారు. రిస్క్ ఎక్కువగా తీసుకోలేదు దర్శకుడు పూర్తిగా సేఫ్ ఫార్ములాలోనే వెళ్ళాడు…. మొత్తంగా తెలుగు ఇండస్ట్రీ కి మంచి హాస్య దర్శకుడు దొరికాడు. మరీ జంద్యాల, ఇవివి లాంటి వాళ్ళతో అప్పుడే పోల్చలేము. కాని మంచి కామెడీ పండించగల దర్శకుడే రామ్ అబ్బరాజు. ఇది బ్లాక్‌బస్టర్ కథ కాదు, కానీ ఫ్లాప్ అయ్యే కథ కూడా కాదు, ఫ్యామిలీ ఆడియన్స్‌కి, టీవీ, OTT కి బాగా సెట్ అయ్యే కథ.

సంక్రాంతి కి కాకుండా వేరే ఏ డేట్ కి వచ్చిఉంటే ఈ సినిమా బెటర్ కలెక్షన్స్ తో మరో లెవెల్ లో ఉండేది అని ఒక సీనియర్ ప్రొడ్యూసర్, డిస్ట్రిబ్యూటర్ వ్యాఖ్యానించడం… గమనార్హం.

“థియేటర్‌లో కేకలు పెట్టించే సినిమా కాదు…
ఇంట్లో కూర్చొని నవ్వుతూ చూసే సేఫ్ సినిమా.”

సారాంశం: అనిల్ సుంకర” కథ పూర్తిగా విన్న తరువాత తీసిన చిత్రం అనుకుంటా” కాని “విడుదల తేదీ విషయంలో తప్పులో కాలేశారు”.

Suresh Thota

సురేష్ తోట ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్. సినిమా, రాజకీయాలు మరియు సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక వ్యాసాలు రచించడం ఆయన ప్రత్యేకత. సమకాలీన పరిణామాలపై లోతైన అవగాహనతో, వాస్తవాధారిత దృక్కోణంలో పాఠకులకు స్పష్టమైన, సమగ్ర సమాచారాన్ని అందించడం ఆయన రచనా శైలిలో ప్రధాన లక్షణం.

View all posts

Discover more from IndiaGlitz Telugu

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading