దక్షిణాది సినీప్రేక్షకులను ఉర్రూతలూగిస్తున్న రిషబ్ శెట్టి ‘కాంతార ఛాప్టర్ 1’ హవా కొనసాగుతోంది! ఆయన నటించి, దర్శకత్వం వహించిన ‘కాంతార ఛాప్టర్ 1’ బాక్సాఫీస్ వద్ద రికార్డుల వర్షం కురిపిస్తోంది. మైథాలజీ, జానపదం, యాక్షన్ అంశాలను సమపాళ్లలో మేళవించిన ఈ చిత్రం నాల్గవ వారం కూడా థియేటర్లలో హౌస్‌ఫుల్ షోలతో దూసుకుపోతోంది.
హోంబలే ఫిలిమ్స్ నిర్మించిన ఈ మాగ్నమ్ ఓపస్ ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా రూ. 818 కోట్లకు పైగా వసూలు చేసి, 2025లో అత్యధిక వసూళ్లు సాధించిన భారతీయ చిత్రంగా నిలిచింది.
తెలుగు రాష్ట్రాల్లో మాత్రమే ఈ చిత్రం రూ.110 కోట్లకు పైగా వసూలు చేయడం విశేషం. దీంతో KGF చాప్టర్ 2 తర్వాత తెలుగు రాష్ట్రాల్లో అత్యధిక వసూళ్లు సాధించిన డబ్బింగ్ సినిమాగా కొత్త రికార్డు నెలకొల్పింది.
అంతేకాదు, ‘కాంతార ఛాప్టర్ 1’ అమెరికాలో కూడా విజయపథంలో దూసుకుపోతోంది. త్వరలోనే $5 మిలియన్ మార్క్ చేరనుంది.
ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకులు ఈ చిత్రంలోని స్థానిక జానపద సంస్కృతి, శక్తివంతమైన సంగీతం, రిషబ్ శెట్టి యొక్క పవర్‌ఫుల్ పెర్ఫార్మెన్స్‌పై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.
ఇక అక్టోబర్ 31న విడుదల కానున్న ఇంగ్లీష్ డబ్ వెర్షన్ కూడా ఈ సినిమాకు కొత్త మార్కెట్లను తెరుస్తుందనే అంచనాలు ఉన్నాయి. కాంపాక్ట్ రన్‌టైమ్‌తో రాబోతున్న ఈ వెర్షన్ అంతర్జాతీయ ప్రేక్షకులను మరింతగా ఆకట్టుకోనుందని చిత్రబృందం నమ్ముతోంది.