బాలీవుడ్ సీనియర్ నటుడు ధర్మేంద్ర (89) తుదిశ్వాస విడిచారు. శ్వాస సంబంధిత సమస్యలతో బాధపడుతున్న ఆయన ఇటీవల ఆసుపత్రిలో చేరారు. చికిత్స పొందుతూ ఈ రోజు కన్నుమూశారు. ఆయన మరణంతో భారత సినీ పరిశ్రమలో విషాదం నెలకొంది.
ధర్మేంద్రకు ఇద్దరు భార్యలు ఉన్నారు — తొలి భార్య ప్రకాశ్ కౌర్, రెండవ భార్య బాలీవుడ్ నటి హేమమాలిని. ఆయనకు సన్నీ డియోల్, బాబీ డియోల్, ఈషా డియోల్, అహనా డియోల్ అనే సంతానం ఉంది.
అరవై దశకంలో తన సినీ ప్రయాణాన్ని ప్రారంభించిన ధర్మేంద్ర, హిందీ సినిమాకు నూతన ఊపు తెచ్చారు. “షోలే” చిత్రంలో వీరూ పాత్రలో ఆయన చేసిన నటన ఈ రోజూ ప్రేక్షకుల మనసుల్లో నిలిచి ఉంది.
అతను అలీబాబా ఔర్ 40 చోర్, దోస్త్, డ్రీమ్ గర్ల్, సన్నీ, గాయల్, లోఫర్, మేరా నామ్ జోకర్ వంటి ఎన్నో హిట్ చిత్రాల్లో నటించారు.
అనేక దశాబ్దాల పాటు ప్రేక్షకులను అలరించిన ఈ లెజెండరీ నటుడు ఇక లేరు. ధర్మేంద్ర మరణంపై బాలీవుడ్ ప్రముఖులు, అభిమానులు తీవ్ర సంతాపం వ్యక్తం చేస్తున్నారు.